Saturday, May 30, 2020

                 యామావిక ---తాత్పర్య సహితం
   శ్రీ గురుభ్యో నమః ౹శ్రీ మహా గణపతయేనమః౹ శ్రీ మాత్రే నమః ౹ మాతృదేవో భవ ౹ పితృ దేవో భవ౹
సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం
అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం.౹౹
జిహ్వాగ్రే వసతుమే వాణీం కరాగ్రే లక్ష్మీం
బాలాం మమ హృదయం చిరం తిష్టాం
త్రికరణాం సర్వమ్ త్వమేవార్పణం శివే౹౹

నా ఉపాస్య దేవత యైన శ్రీ లలితా పరాభట్టారికకు
నన్ను ఆదరించి ఆశీర్వదించిన గురవర్యులకు
ఈ రీతిగా తీర్చి దిద్దిన తల్లిదండ్రులకు ఈ సమాజానికి
శిరస్సు వంచి వినమ్రంగా నమస్కరిస్తున్నాను.

బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారిచే విరచింపబడిన యామావిక అనే కావ్యాన్ని సులభ గ్రాహ్యంగా సరళ మైన తెలుగులో తాత్పర్య సహితంగా మీ ముందు ఉంచే భాగ్యం నాకు దక్కింది.
రోజుకి మూడు పద్యాల వరకూ భావసహితంగా ఉంచుతూ అక్కడక్కడా అవసరం అనుకుంటే కొంత వివరంతో అందించే పూనిక నాది. బుధులు, విజ్ఞులు పరిశీలించి ఎప్పటికప్పుడు తమ యమూల్యమైన అభిప్రాయాలను తెలియ జేసి గుణదోషములను చూపించిన తదనుగుణంగా ముందడుగు పడగలదు.
యామావిక అంటే ఏమిటి:
హింసి ధాతో స్సింహ శబ్దో వశకాంతౌ శివః స్మృతః
వర్ణ వ్యత్యయత స్సిద్ధౌ పశ్యకః కశ్యపో యధా.
హింసి >> సింహ గా వశి >> శివ  గా పశ్యకః >> కశ్యప గా మార్పు చెంది ఉత్పన్నమైన శబ్దముల వలెనే 'కవి మాయ' అనే మాటలను వర్ణ వ్యత్యయము చేయగా యామావిక అని సాధించ వచ్చు. యామ + అవిక = యామావిక.
యామ అనగా శరీరమే ఒక సాధనముగా ఉన్న యోగాంగము. అవిక అనగా వజ్రము కనుక శరీరమే ఒక సాధనంగా మలచబడిన వజ్ర తుల్యమైన యోగాంగమే యామావిక అని గ్రహించవలసినది.

ప్రధమ ప్రకరణం
యామావిక ---- సందర్భం

శా.
శ్రీ విద్యా మహనీయ యోగమున నిర్ణిక్తాంతరంబైన చే
తోఽవస్థానమున్ నిరంతరము సోహంహంస భావంబుతో
భావింపంబడు నమ్మేహేశ్వర పరబ్రహ్మమ్ము మమ్మేలు  స
త్యావష్టంభ సుఖానుభూతి భవ భావాభావ భాసమ్ములన్. ౧
      శ్రీ విద్య యనెడి ఒక మహా యోగము వలన పరిశుభ్రము నందిన   హృదయం నందు నిరంతరం ఆత్మయే పరమాత్మ అనే అద్వైత స్ఫూర్తితో తలంపబడే ఆ మహేశ్వర పరబ్రహ్మము సాత్విక సుఖానుభూతికి ఆధారమై శివద్యోతములచే మమ్ము పరిపాలించును.
    పూర్వజన్మ సుకృత పుష్టిచే కొందరికి ఉపాసనానురక్తి ప్రసాదింప బడుతుంది. అనేక దేవతలకు ప్రత్యేక ఉపాసనా మార్గాలున్నాయి. అందులో శ్రీ విద్య ఉత్తమోత్తమంగా చెప్పబడింది. 'ఆత్మ విద్యా మహా విద్యా శ్రీ విద్యా' అని లలితా సహస్ర నామావళిలో శ్రీ విద్యను మోక్ష విద్యగా చెప్పబడింది. అందుకే  'విద్యానాం కాది రుత్తమం' అని ఆర్యోక్తి. జగన్మాత అయిన ముగురమ్మల యమ్మ శ్రీ లలితా పరాభట్టారికా ఉపాసనయే కాది/హాది విద్య. అదే శ్రీ విద్య.
అటువంటి శ్రీ విద్యోపాసనచే హృదయ కమలము నందు అద్వైత భావం నిరంతరం వెలుగులీనుతూ ఉంటుంది. ఏమిటి ఆ అద్వైత భావం అంటే సోహం అనే భావన. సోహం అంటే అతడే నేను అనగా ఆత్మయే పరమాత్మ. జీవుడే దేవుడు.
ఈ ఆత్మను యోగ విదులు హంస అంటారు. ఇందులో హం పురుష ప్రతీక అయితే స ప్రకృతి ప్రతీక. ఈ రెండింటి కలయికచే సృష్టి క్రమము ఏర్పడుచున్నది.
వేదాంత సారమంతా రెండు మాటల్లో చెప్పమంటే సోహం హంసః అని చెబుతారు. ఆ అద్వైత స్వరూపమే పరబ్రహ్మము.
ఉ.
వందన మందుకొమ్ము జనవత్సల! స్వాస్థిత చందవోల్పురీ
మందిర మందిరా వినెదె?మా మనవిం దఱియే యటైనరా
జ్యేందిరతో మదాది జనయిత్రి యవామగ వామతో మహా
నందముతో మముంగని మనంబిడుమీ దెస జెన్న కేశవా.౨
  చందోలు అనే ఊరిలో వెలసిన ఓ చెన్న కేశవా! పితృవాత్సల్యంతో  మా  జోతలు అందుకో.  కొంచెం మా  మనవి వింటావా? అటులైనచో శ్రీ దేవి (లక్ష్మి) భూదేవి సహితంగా మహానందంతో ఉన్న నీవు మావంక చూచే తలంపు కూడా జేయుము. కాస్త మావైపు కూడా మనస్సు పెట్టుము.

చం.
కృతి నయి మీ కృతంబున స్వకీర్తికరిం కృతి నీదలంచితిన్
గతి గొనుమయ్య దీన మదఘంబు లెడల్ప గదయ్య యౌతకా
దృతుల వహింపబోక పొలితిన్ బొలతిన్ గయికో గదయ్య  యా
నతులొనరింతు నన్యములు నా తరమా హరి చెన్నకేశవా.౩
ఓ చెన్నకేశవా! మీరిచ్చిన దానితో కృతకృత్యుడనై నాకు కూడా పేరుండేలాగున ఒక కావ్యము వ్రాసి నీ కీయ దలచితిని. ఆదరంగా స్వీకరించవయ్యా. వరదక్షిణ / వరకట్నం కోసం పట్టుబట్టక కావ్య కన్యను పరిగ్రహించు. దీనితో నా పాపాలను పరిహరించవయ్యా. నిన్ను స్తుతించుట కన్న వేరేమి చేయగలను?
         
చం.
మునుపొక సారి కుంచవరమన్ పురమున్ బనిగల్గి చేర బో
యిన నది మాఖ మందు భవదీప్సితమౌ తిథీ యౌట గృష్ణలో
మునగగ బోవు మాన్య జన పుంజము నన్నును జీర వారితో
ననుగతి వల్లభా పురము నధ్వమునన్ పడిబోవుచున్నెడన్.
ఇదివర కొకమారు కుంచవరం గ్రామంలో ఏదో పనిబడి పోవుచుంటిని. అది మాఘమాసం. ఆరోజు పవిత్రమైన తిథి కావడంతో కృష్ణా నదిలో పుణ్య స్నానాలు చేస్తున్న మహనీయులు నన్ను పిలవడంతో వారిని అనుగమించాను. ఆ రకంగా వల్లభాపురం పోవుచుండగా
కం.
శ్రీ మహితుడు వేదాన్తము
రామస్వామి యను ఘనుడు ప్రథితుడు కొల్లూ
ర్గ్రామాగతు డవధాని
మహామహు డల భాగవతుల యన్వయజుండున్.
గీ.
సూర్యనారాయణాఖ్యుండు శుద్ధ చరితు
డేను పుట్టు పూర్వోత్తరంబుల నెఱుగ గాని
వాసుదేవాభిధుడు బుధవర్యుడొండు
గాగ నలువుల మేము నీ కథల దవిలి.
శ్రీ వేదాంతం రామస్వామి అనే ప్రముఖులు కొల్లూరు గ్రమానికి అతథి వచ్చిన అవధినిగారు భాగవతుల సూర్యనారాయణ గారూ ఓకరికొకరం అంతగా పరిచయం లేకున్నా పండితుడైన వాసుదేవశాస్త్రి ఒకడూ మేము నలువులమము అమ్మా నీ కథలు చెప్పుకుంటూ పోతూ ఉండగా
గీ.
అర్థి నొకళొకొళుల కేమొ యనుచు వినుచు
కాలమధ్వమ్మటు గ్రమింప ఘనుడు నుడివె
వాసుదేవ శాస్త్రీంద్రుడు భవ్యగాధ
తెలుగు సేసె మహారాష్ట్ర దేశభాష.
ఒకరు చెప్పినది మిగిలిన వారు అలాగా అంటూ వింటూ దోవలో కాలం గడుస్తుండగా వాసుదేవ శాస్త్రిగారు మరాఠీ భాషలోని అమ్మ గాధలను తెలుగులోకి అనువదించారని రామస్వామి గారన్నారు.
గీ.
దానికి సగర్భయై ప్రతిభాసమెనసి
నా ప్రతిభ తన్వి గనియె సంతతి కృతి నిటు
లగుట దత్సృతి వివరింతు నవధరింపు
మఖిల జగదీశ! యస్మత్పురాధివేశ.
ఓ అఖిల జగదీశా చెన్నకేశవా!  ఆ మాట వినగానే నాకున్న ప్రతిభా విశేషమునకు తనివి దీర నా మనసులో ఒక బీజం పడి యీ కావ్యంగా జనించింది. అదంతా వివరంగా చెబుతాను. అవధరింపుము.
సీ.
"మధురా విజయ కృతి" మాలిమి నొసగితి
               గురుడైన నాగలింగునకు కవికి
హనుమ కిచ్చితిని సీతమ్మ కోర్కికి "సత్య
              నారాయణ మహత్వ" నామ గాధ
"కళ్యాణ కైవర్తకము" సతీర్థ్యుండని
             పిశుపాటి కులున కర్పించితి రతి
"రామకథామృతార్థము" పితృపాదుల
            తో పరతత్త్వమందు నిడ గంటి
తే.గీ.
" దత్త భాగవత" మను గ్రంథంబు నిన్న
  మొన్న లింగోద్భవస్వామి కెన్న గూర్చి
  నేడు నీ కిడుచుంటి ననింద్య  దీని
  వాడ నున్నావు నీవు నా వాడ వగుచు.
      గురువుగారైన నాగలింగం గారికి "మధురా విజయం"
ను, సీతమ్మ కోర్కెగా హనుమకు "సత్యనారాయణ మహాత్వము" ను, సహపాఠి యైన పీశుపాటికి "కళ్యాణ కైవర్తకము", పితృపాదులకు పరతత్త్వమందుటకు గాను "రామకథామృతార్థము"ను, లింగోద్భవస్వామికి " దత్త భాగవతము"ను ఇదివఱకు సమర్పించితిని. ఓ చెన్నకేశవా నీవు నా వాడవని ఈ కృతి నీకీయ దలంచితిని.
గీ.
అర్థకాముడ గాను నీ కప్పగించు
చుంటి గైకొనుమయ్య యీ యుత్తమ కృతి
నోలి నాకేల నీ యోలి యో లలితుడ
వీడు నావా డనుము చాలు వెర వెనయుదు.౧౦
 స్వామీ! ధనాపేక్ష తో ఈ కావ్య కన్యను నీకీయుట లేదు. వీడు నావాడు అని నీవనుకుంటే చాలు. అదే నాకు జీవనోపాయం కాగలదు. నీ వద్ద కన్యాశుల్కం నా కెందుకు. అందుకే అందుకోవయ్యా యీ ఉత్తమ కృతిని.
ఉ.
చంచల కాదు కా దచల సన్నకు నేనియు నీల కాదు స్వ
భ్యంచిత కావ్యకన్య యిది యన్ని విథంబుల నిన్ను గొల్చి మె
ప్పించు ననుం గృతార్థు డనిపించు వహించు యశో భరంబు నీ
మంచికి దీని గొంచు గనుమా సుఖసంతతి జెన్నకేశవా.౧౧

  ఓ చెన్నకేశవా! ఈ కన్య అటు చంచల యైన లక్ష్మియూ కాదు ఇటు కదలని అచలయైన గిరిజయూ నీలయూ కాదు. ఆదరణీయమైన కావ్య కన్య. ఇది అనేక విథాలుగా నిన్ను మెప్పించి నన్ను కృతార్థుడ చేయగలదు.  కీర్తి వహించగలదు.దీనిని స్వీకరించి సుఖ సంతతి కనవయ్యా.
ఉ.
వందలు వేలునుం గలరు వల్లభ లంచు నెఱింగి యుండి య
స్పందమతిం గృతిప్రమద సద్గుణ నీత డొసంగినా డటం
చెందును దక్షిణత్వ మది యేర్పడ నేలిన జాలు జాలుదూన్
ముందర పేర్గడించిన సుపుణ్యుల మించగ జెన్నకేశవా.౧౨
ఓ చెన్నకేశవా! ఇప్పటికే అనేకమంది కన్యలను స్వీకరించి యున్ననూ మంచి పరిపుష్టిగా నున్న సద్గుణ సంపన్న యైన యీమెను దాక్షిణ్యముతో యేలుకొంటే చాలు. ఇంతకుముందు పేరొందిన పుణ్య చరితులను మించిపోగలను.
కం.
శ్రీ మాన్య మజ్జనక పా
దామోదిత మిత్ర కృష్ణమాచార్యపద
ప్రామాణికాచార్య! యోగ
క్షేమావహ నామ! చెన్నకేశవా. ౧౩
     ఓ చెన్నకేశవా! మా మాతామహులకు ప్రీతిపాత్రులైనట్టి
భక్తుల యోగక్షేమాలను జూచు కొనువాడను పేరుబొందినవాడవు నీవు.
వ. అవధరింపు మస్మత్త్రయికి వాసుదేవ శాస్త్రి ఇట్లనియె.౧౪.
   వినుము. మా మువ్వురితో వాసుదేవ శాస్త్రి యీ విధంగా అన్నారు.
గీ.
నాభి సరసీజమున నొక నందను గని
యతని పనికిని సాహాయ్య మాచరింప
సరసు లరసులు సనక హృత్సరసిజముల
గాముని సృజించి పెట్టు చిద్ఘను తలంతు. ౧౫
    నాభి కమలము నుండి పుట్టిన బ్రహ్మను చూచి యాతని పనికి సహాయపడుటకు గాను సనకాదుల హృదయ కమలములందు మన్మథుని సృజించిన చిద్ఘనుడవైన నిన్ను తలంచెదను.
శా.
శ్రీ రూఢంబు శరీరిపాపభర దారిద్ర్యానుసంధాయకం
బారామవ్రతతీవితాన రమణీయానోకహానీక మా
ర్యారబ్దాధ్వరభూనిఖాతశతయూపామేయ భాగ్యమ్ము కా
వేరీ తీరము భాసిలున్ సకలపృథ్వీభాగసౌభాగ్య మై. ౧౬
   కావేరీ తీరము సంపదలు మొలకెత్తు నేలతో జీవుల పాపకర్మలచే దరిద్రమునకు తోడైననూ ఆ తటిని తోటలలో ఆర్యా మహాదేవిచే ఆరంభింపబడి భూమిలో పాతబడిన శతయూపమనదగు వృక్షమునకు అల్లుకున్న లత వలె భూమండల మంతకు సౌభాగ్య మనునట్లు ప్రకాశించు చున్నది.
శా.
ఆ కావేరి తటాంచలమ్మున సహస్రాంశుండు పద్మిన్వయ
ప్రాకట్యంబు వహించు వేల నడిచెన్ బాభాసమానుండు యో
గ్యా కారుండల భోగిభోగశయు ముఖ్యమ్మైన చుట్టమ్ము నా
నాకుల్ తీవలు గోచియున్ రశనలై యంగాళి రంజింపగన్.౧౭
 ఓ సాయం సమయాన దినకరుడు ప్రొద్దువాలే వేళ ఆయనకు చుట్టము వలె తోడుగా ఒక యోగి ఒంటిమీద ఆకులు తీవెలు గోచీ మొలనూలుగా కలవాడై అచట నడచుచుండెను.
           ఒక యోగి ----- సంచారము
కం.
ఏ పగిదినొ? యెపు డెందో?
నీ పద మొకసారి తలచి ని న్నధమర్ణుం
గా పురుషు డైన జేయున్
శ్రీ పతి! మోక్షమ్మతనికి సిద్ధింపదొకో? ౨౮
 ఓ లక్ష్మీపతీ!  ఆ యోగి ఎప్పుడో ఏ రకంగానో నిన్ను స్మరిస్తూ ఋణగ్రస్తుడై ఉండవచ్చు. దుష్టుడు కావచ్చు. అతనికి మోక్షము సిద్ధించదా?
మ.
చలదూర్మి ప్రచయం బగాధమగు సంసార ప్రవాహంబునం
గల యావర్తములైన జన్మ తతులన్ గాసిల్లు కీటంబు నీ
విలసత్కారుణికత్వ మూత గొని సద్వృత్తిం దరిం జేరు గా
ని లవంబేని స్వతంత్రతం బెరయ దన్నిద్రాత్మ! విట్ఠల్ప్రభూ. ౨౦
పెద్ద పెద్ద అలలకు నిలయమైన చాలా లోతైన కల్లోల కడలి వంటి సంసార తాపత్రయములో అనేక జన్మలనుభవించిన పురుగు కూడా నీ కరుణా కటాక్షము చేత సన్మార్గంలో నీ దరి చేరును గాని తనంత తాను స్వతంత్రంగా నిన్ను చేరలేదు కదా ఓ నిర్ణిద్రుడైన విఠలా.
మ.
అఖిలంబున్ భవదీయ వైభవ మనన్యంబుల్ నభోధారుణీ
ముఖ భూతంబులు భౌతికంబు లని సంబోధించు వేదాన్తముల్
సుఖదుఃఖంబులు బంధమోక్షములు నీశుండైన నీ కున్నవే
నిఖిలంబున్ దన బుద్ధిచే గుడుచు గానీ ప్రాణి విట్ఠల్ప్రభూ. ౨౦
ఓ విట్ఠలా!ప్రభూ! ఈ సృష్టిలో సమస్తమును నీ యొక్క అనన్యమైన వైభవముచే ఏర్పడినవే. ఈ భూమ్యాకాశ ములందలి వాని నన్నిటినీ వేదాంతములలో భౌతికము లనిరి. జీవి తన బుద్ధికి తోచినట్టు గానే ప్రవర్తించును. ఈశ్వరుడవైన నీకు సుఖదుఃఖాలు బంధ ప్రతిబంధకాలు నీకు లేవు కదా.
కం.
బహు తృణ మవు సంసారం
బహి శయన! యశాశ్వత మని యాత్మ నెఱిగియున్
బహుల రజః కలనంబున
బహు శ్రుతులె దారి తప్పు వార లధీశా.౨౧
     ఓ ప్రభూ! శేషశాయి! గడ్డి బరక వంటి ఈ సంసారం అశాశ్వతమని తెలిసి కూడా రజోగుణము వలన అన్నీ తెలిసిన వారు కూడా దారి తప్పెదరు.
                ఒక కన్య
మ.
అని భక్త్యున్నతి మై గగుర్ప మహితధ్యానోల్లస త్పారవ
శ్య నిరూఢిన్ సకలోర్వరన్ మఱచి నిత్యానందుడై వోవు నా
మునిముఖ్యుం డెదురం గనుంగొనె నొగిన్ బూబోడి నొక్కర్తు న
వ్వనితారత్నము చాకచక్యము నుతింపన్ రాదు శేషాహికిన్.౨౨
     భక్తితో ఒడలు గగుర్పొడచునట్లుండి తన ధ్యాన పారవశ్యంలో ఈ జగతినే మఱచి నిరంతరం ఆనందంలో ఓలలాడుతూ పోవుచున్న ఆ మునివర్యుడు తన కెదురుగా ఒక సుతిమెత్తనైన పూబోడిని చూచెను. ఆమె చాకచక్యమును కేశవుడు కూడా లెక్కించలేడు.
సీ.
లేడిచూపుల లీల లే జూపులను జేయు
            చొప్పున నొప్పెడు చూపుకోపు
మాలూరఫల మెన్న మా ఫల మే యను
            మాద్రి నెసగు కుచమండలమ్ము
సరసీజమా? యిది సరజ మే పొమ్మను
         చంద మొందిన మోము చందమామ
చిగురు చెల్వం బన జిరుచెల్వ మని యొత్తి
          నట్టు బిట్టలరెడు నంఘ్రి యుగళి
ఆ.వె.
యంగభంగి గాగ నక్షర తత్త్వంబు
నెఱుగువారి భంగపఱచుటెంత?
యన్ని యెడల నున్న యక్షరమ్మునె మాటు
చేయ బూను చాన చేతి కింక.౨౩
  ఆమె లేడి వలె లేలేత చూపులను చూస్తోంది. ఏపుగ ఎదిగిన ఫలముల బోలు స్థన యుగళము తోను
ముఖము పద్మము వంటిదా కాదు అప్పుడే విరిసిన తామర అన్నట్లు ఉండే చందమామ లా ఉంది. పాదములు నునులేతగా అందం అనే పూత పూసినట్లుగా ఉన్నాయి. శాశ్వతమైనదానిని మాటు పెట్టుటయే పని యైనచో అంగభంగమైనపుడు అక్షరమైనదేదో తెలిసిన వారినైననూ భంగపరచడం కష్టమా?
ఆ.వె.
అచటి కొమ్మలందు నాకోమ్మ నొకకొమ్మ
గా దలచి యోగి కడచి నడచె
లోష్ఠ కాంచనములలో భేద మెఱుగని
విరతు మతికి నిదియు వింత యౌనె. ౨౪
  అచట ఉన్న వారందరిలో ఆమె కూడా ఒకతె యని అనుకొని ఆ యోగి వెడలి పోయెను. మట్టికీ బంగారానికీ తేడా చూడని విరక్తుడైన వానికి ఈమె ఈమె సోయగాలు వింత అగునా? ఏమైనా ఆగునా?
ఉ.
ఉల్లము గొల్లవోవ నల యుగ్మలి తిగ్మరుచిపరకాశు డౌ
నల్ల మునీంద్రు గాంచి తన యంగము లంగజు చేతదూల మే
నెల్ల జెమర్ప నోర్పు సెడ నెంచె మనంబున వీని పాద సం
పల్లవ మేని లేని యగపల్లవమా? యసి శంబరాలికిన్.౨౫
      ఆ వనిత తన హృదయము దోచుకోబడినదై వేడిగా వాడిగా ఉన్న ఆ యోగిని చూసి మన్మథ తాపానికి గురియై శరీరమంతా చెమటచే తడిసినదై సహనము లేక ఈ శరీరం అతని గొప్పదైన పాద స్పర్శ పొందనిచో నాది అదో పాదమా మన్మథునికి ఓ కత్తిగాని.
మ.
కమలాకాముకు కామనీయకము రాకా యామినీ నాయకో
త్తము సాకల్యము మారు చారుతర తాత్పర్య మర్థాంగజా
ని మహత్త్వం బజునోజముం బెనుచు మౌనిప్రఖ్యు సేవారతిన్
కమనీయం బగుగాత మామకము భాగ్యం బెందు  యోగ్యంబనన్. ౨౬
     కమలాకరుడైన సూర్యుని అందమూ పున్నమి రేరాజైన చంద్రుని సకలత్వము మారిపోవా మన్మథుని మహత్వం ముందు. ఆ విష్ణువు తేజస్సును కూడా త్రుంచగలదు. ఆ యోగి సేవలో నా యొక్క భాగ్యము యోగ్యమై కమనీయమై వరలు గాక.
కం.
ఏవిధమున నేనియు నే
నీ వశివరు నాత్మవశ సుఖేచ్ఛు నొనర్తున్
భావము పూనిన కృతుల క
భావం బన గల్గునే శుభం బగుననుచున్.౨౭
      ఏ తీరు నైనా ఈ ముని వర్యుని ఇంద్రియ నిగ్రహుని నాకు నచ్చిన వాడు కనుక సుఖేచ్జ కలుగు నట్లు చేతును.
మనసులో పూనిక ఉండాలే గాని నిరాదరణను జయించటకు వీలుకాదా. శుభమే కలుగును.
చం.
తలచి చలించి లేచి కలితంబగు జూపు పరిభ్రమింప ని
శ్చలు నతని న్విలాసశతసంస్తుతపాశ నిబద్ధు జేయ నెం
చి లలన గూర్చు చెయ్వులు వచింపగ వచ్చునె ?మెచ్చవచ్చు బో
వలచిన వారికిన్ తగు నుపాయములం గలవే? యపాయముల్.౨౮
    ఆమె అటులనుకొని లేచి అర్థమైంది అన్నట్లు కనులు కదలించి ఎలాగైనా ఆ యోగిని తనూ విలిస పాశములలో చిక్కునట్లు చేయ నిశ్చయీంచుకొని ఆమె చేసే చేష్టలు ఏమని చెప్పగలము? వలపు వెల్లువలో బడ్డవారికి ఎన్ని ఉపాయాలో. మెచ్చుకోవచ్చు. యపాయములుండునా?
మ.
తన వాల్జూపుల చొక్కు మందునకు జెందన్ రాక లీలాలతా
వనిపాతంబున కోటు వోక నిజ నిర్వేశం బపేక్షింపకే
చను యోగిన్ వల జేర్ప వచ్చు వల నిచ్చం బెచ్చు యోజించుచున్
వనితారత్నము నూత్నహార లతికా వక్షోజ విక్షోభయై.౨౯
    ఆ వనితామణి తన వాలు చూపులకు చిక్కక ఇచ్చవచ్చినట్లు తిరుగుచున్న ఆ యోగిని ఏ రకంగా వలలో వేసుకోవాలనే ఆలోచనలతో అంతర్మధనంతో మరో నూతన హారముల తీవె ఎదపై కదలాడగా భంగపడకుండా యోచించుచున్నది.
ఉ.
కట్టిన పట్టు పుట్టము వికాసము భాసుర మై రహింప నౌ
దట్టపు మేని కాంతి పయి దారటలాడెడు గుబ్బిగుబ్బలన్
దొట్టిన చాయ హార రుచియున్ కను బ్రామగ మౌనినాథు నా
కట్టి యెదిర్చి దోయిలి చొకారము మీఱ నమర్చి యాప్తితోన్.౩౦
 చక్కని ఆమె శరీర కాంతిపై కట్టుకున్న పట్టు చీర అందంగా అలరారుతూ ఉంటే మెడలోని హారముల చాయ చనుదోయిపై తారటలాడుతుంటే ఆ మునిపుంగవుని ఆకట్టుకుని అందంగా దోసిలి యొగ్గి ప్రేమగా.
కం. సుమనః ప్రియభానా! నుత
దమ! శాంతిసుఖ ప్రకామదా! యోగకలా
కమనీయక! పావన సం
గమ! కూర్తు ననాథనాథ! కైమోడుపులన్. ౩౧
   ఓ పావనమూర్తీ! ఓ మంచిమనస్సుతో హిథమొనర్చువాడా! నుతింప దగినవాడా! శాంతి సుఖాధికముల నిచ్చువాడా! ఓ యోగిపుంగవా! అనాథనాథా! నీకివే నా జోతలు.

కం.
అని య క్కొమ సాగిలి మ్రొ
క్కిన కనుగొని మౌనివరు డొగిన్ సాదరుడై
యనితర సాధారణ పతి
జనవాల్లభ్యం బెనయుము చానా! యనియెన్. ౩౨
      అట్లు ఆ వనిత సాగిలపడి నమస్కరించగా ఆదరంగా చూచిన మునివర్యుడు నీకు భర్త మరియు జనుల ప్రేమాభిమానాలు మెండుగా కలుగు గాక అని దీవించెను.
గీ.
పుడమి రజము పయోధర భూమి నెఱయ
లేచి నిలిచి ప్రకాశించె లేమ యపుడు
మౌనివర్యుని పై గొన్న మమత కతన
నల్లనల్లన దాద్రూప్య మమరి నట్లు.  ౩౩
   అలా నమస్కరించి లేచిన వక్షోజములపై కాస్త మట్టి యంటుకొన్నదై లేచి నిలబడగా ఆయన మీద మమకారము వలన ఎడనెడ ఆయనతో అల్లుకు పోయినట్లుగా అనిపించింది.
        భోగినీ ---- యోగి సంవాదము
ఉ.
పన్నిన ప్రేమ బంధమున  పై బడి తేని దలంక డిట్టె యీ
సన్నలకు న్విలాసముల చాయకు లోబడువాడె? వీడు సం
పన్న తపః ప్రభావు డతివా! మనకిచ్చట సిగ్గు లగ్గె ముం
దున్నది పో రసం బనుచు నూరక మారుడు వోర నారియున్. ౩౪
     ఓ అతివా! నీవేదైనా పన్నాగము పన్నితే ఏమోగానీ ఈ నీ చిలిపి చేష్టలకు లోబడతాడా? మహా తపస్సంపన్నుడు. ఈ సిగ్గులూ ఏదో మేలు కొరకే. అయినా ముందున్నది అసలైన పోరు. మన్మథుడు ఊరకే వదలునా.
ఉ.
యోగి వతంస! నా జని యథోచిత మయ్యె భవద్దయాప్తి నిం
కేగతి బ్రోచెదో ? తలుప నెన్నడు తుచ్ఛ సుఖమ్ము లేను నీ
యీగి యనర్థ మైన యిల నెల్ల వడంకదె? నన్ను భోగినిన్
యోగిని జేసి యెట్లు? మహిమోజ్వల!యేల ననుగ్రహింపవే.
 ౩౫
    ఓ యోగి పుంగవా! ఏదో మంచి పుట్టుకనే పొందాను. నీచమైన సుఖాలను కోరుకోను. నా ఈ త్యాగము వృధా అయినచో భూమి కంపించదా? నీ చేరికలో ఏలాగున బ్రోచెదవో గది. భోగినైన నన్ను యోగినిగా ఆనుగ్రవింపవయ్యా ఓ మహనీయా!
మ.
అని లో నున్నది విప్పి జెప్ప నత డ య్యజ్జాక్షి నీక్షించి యి
ట్లను లేమా! భవదీయమానస మదెట్లట్లింక గా జాలదే
మనినన్ లోకము గోడు మాని వనమధ్యంబందు జంతువ్రజం
బును బోలంగ జరించు మాకు నకటా! భోగంబు లింపౌనొకో? ౩౬
   తన మనసులోని మాటలు చెప్పిన ఆ తలపుల వనితను జూచి లలనా! నీ మనస్సు అంత తేలికగా సర్దుకోలేదు. ఎంచేతనంటే ఈ లోకం పోకడను మానుకొని అడవుల్లో  జంతువుల వలె మసలే మాకు భోగలమీద ఆసక్తి కలుగునా అనెను.
ఉ.
నీకున్ బోలిన వాని గాగ నెవనిన్ నిర్మించె నా ధాత సు
శ్రీ కు న్వాని వరించి జవ్వనము వాసిం జెంద సౌఖ్యంబులన్
గైకో నెంచుము నన్ను బోటి వికలుం గామాదిదూరుం జటా
నీకశ్మశ్రుభయంకరు న్వలచితేనిన్ నవ్వరే? కామినీ! ౩౭
     నీకు సరితూగే వానిని ఎవరినో బ్రహ్మ సృష్టించే ఉంటాడు. అటువంటి వానిని వరించి నీ యవ్వనము  తనివితీరా సుఖాలను పొందే ఆలోచన చేయాలి కాని  నాలాంటి విరాగిని జడలు కట్టిన శరీరంతో  కామం లేని వాడిని నువ్వు ప్రేమిస్తే లోకులు నవ్వరా?
ఉ.
తా నట యోగివర్యు డట తన్వి నొకర్తుక దెచ్చెనంట యీ
మౌనికి భిక్షసేయవలె మానిని కేమి యొనర్పగా వలెం
బూని వచింపు డంచు బొరపొచ్చెములాడు జనంబులందు నీ
కేనియు నాకునేని తలయెత్తగవచ్చు నెటుల్? తలోదరీ! ౩౮
తానొక యోగి యట. ఒకామెను కూడా తెచ్చుకున్నాడట.మరి అతనికి భిక్ష చేసినా ఆమెకు ఏంచేయాలి? అని లోకులు తేడా మాటలంటుంటే నీవైనా నేనైనా తల లెత్తుకుని తిరుగ గలమా? తలోదరీ!
కం.
అని నవ్వు వుట్ట ననుచున్
జన నెంచెడు మౌనితిలకు చందము గని యా
వనితామణి తన నెమ్మన
మున దలచె నిదంవిథముగ మురిపెము లఱుమన్. ౩౯
 అని నవ్వుకుంటూ  చెప్పి పో బోవుచున్న ఆ మునిని చూచి తన మనసులో ఈ విధంగా అనుకుంది.
మ.
వనితామండలి కప్రతిష్ఠ ప్రవరున్ వాంఛించి తెచ్చె న్వరూ
ధిని నే రెండవదాన నౌదునొకొ ? యీ ధీసాంద్రునిన్ గోరి నా
కును నద్దానికి సామ్యమే? తుద జలాగ్నుల్ లేవె? య ట్లేల? నా
యను వెల్లం దిలకించి  వశ్యుడవు నం చావెంట దా నిట్లనెన్. ౪౦
      ప్రవారాఖ్యుణ్ణి కామించి వనితాలోకానికే చెడ్డ పేరు తెచ్చింది వరూధిని. నేను ఆ కోవలో రెండవదానినేమో? వరూధినికీ నాకు పోలికా? చివరగా అనుకున్నది జరుగక పోతే నీరూ నిప్పు ఉండనే ఉన్నాయి. అయినా నా అనుకూలతలను చూచి తానెందుకు వశము కాడు అని ఇట్లనెను.
ఉ.
లోకముగోడు మాని పరలోకము నెంచి తపించు టెల్ల నా
నాకవధూసుఖాప్తికి మనం బురియాడుచు నుంట గాదె నా
థా! కరుణించి నన్దనిపి  దైవతభామల నాదరించుచో
నీ కెఱుగంగరా వొకొ?మనీషితసిద్ధి విశేషసంపదల్.౪౧

 ఓ నాథా! ఈ లోకంలో ఉన్నవి వద్దనుకుని పరలోకం కోసం కలవరించడమంటే ఆ స్వర్గలోక కన్యల తో సుఖించాలనే కదా. దైవతా లోకంలో స్త్రీలను కోరుకో గల నీకు ఈ ఇష్టమైన శారీరక సంపదలు తెలియనివా?
ఉ.
అన్నియు నాత్మకుం దెలిసి యక్కట మాటల మోస పుచ్చగా
జన్నె? నిను న్విధాతృడు నిజమ్ముగ నా కయి సృష్టిసేసె నే
మన్న ని కేమి?లోకమునకై విధివ్రాత దలంగవచ్చునే?
పున్నెము గట్టుకొమ్ము ననుబోటిని గాచి మునీంద్ర చంద్రమా!౪౨
  ఓ మునులలో చంద్రుని వంటి వాడా! నీకు ఆత్మలో అన్నీ తెలుసు. అయినా మాటలతో మోసం చేసిపోదువే? నా కోసమే నిన్ను సృష్టించినాడు ఆ బ్రహ్మ. లోకం కోసం విధివ్రాత ను కాదనగలమా? నన్ను పరిగ్రహించి పుణ్యం కట్టుకోవయ్యా.
మ.
తనకుం దా నయి కోరి వచ్చిన లతా తన్వి న్విసర్జించె ని
మ్ముని యౌరా! రస మిట్టు లుండునె? మహామోహాప్తి నా లేమయుం
దనకై ప్రాణము వాసె గాల్పనె? తపోదాంత్యాదు లం చాడు నీ
జనవాదంబు సహింతు నెట్లు దివి కే జన్న న్మునీంద్రోత్తమా! ౪౩
    ఓ ముని శ్రేష్టుడా! తనకు తానై వలచి వచ్చిన కాంతను ఈయన కాదన్నందుకు ఆమె ప్రాణత్యాగం చేసిందట. ఇంకొకరి ఉసురు పోసుకోడానికా ఈ తపస్సులూ మొదలైనవి అని లోకులు అనే మాటలు స్వర్గానికి పోయినా సహించేదెలా?
సీ.
గలమున బంగారు గొలు సిచ్చెద గాని
       మొలత్రా డొనర్చు మో మునివరేణ్య!
పైట చెంగొక కొంత పంచి యిచ్చెద గాని
      పిడిచుట్టు చుట్టు మో విమలహృదయ!
యుత్తరీయం బొక డుండె నిచ్ఛెద గాని
      బుజము పై నుంచు మో విజిత మదన!
లలి కెంపు ముక్కు పోగుల నిచ్చెదను గాని
      శ్రుతుల భూషింపు మో నుతచరిత్ర!
గీ.
చేత జెడ లెల్ల జిక్కు తీసెదను గాని
నను నియోగింపు మింక నో యనఘమూర్తి!
చేరి నిరతంబు సేవ సేసెదను గాని
మదనసామ్రాజ్య మేలు మో మాననీయ! ౪౪
  ఓ మునీంద్రా! నా గళసీమ నున్న బంగారు గొలుసు నిస్తాను. మొలత్రాడుగా కట్టుకో. అలాగే నా పైటచెంగు కొంత పంచి ఇస్తాను. లుంగీ లా కట్టుకో. నాదగ్గర ఉత్తరీయం ఒకటి ఉంది ఇస్తాను. భుజం మీద వేసుకో.
మంచి ఎఱ్ఱని ముక్కు పోగులు ఇస్తాను. కాస్త చెవులకు పెట్టుకో.
నీ తల చిక్కులన్నీ జాగ్రత్తగా తీస్తాను గానీ నన్ను వినియోగించుకో. ఎల్లప్పుడూ నీకు సేవ చేస్తాను గానీ నా మన్మథ సామ్రాజ్యాన్ని ఏలుకో.
మ.
తపసీ! దాపగ నేల నా మనము  మత్ప్రాణంబు లేనిన్ భవ
త్కృపకుం బాత్రము లేమి సేసెదవొ? నారీహింస పాపంబు పూ
ర్వపు మౌనీంద్రులిదే తలంచికద ద్యోవారాంగనాసంగమం
బుపలాలించిరి నీ వెఱుంగవె? పురాణోక్తిప్రపంచమ్ములన్.
౪౫
    ఓ మునివర్యా! నీకు పురాణ వచనాలు అవీ బాగా తెలుసుకదా! నా మనస్సునూ ప్రాణాన్ని కాదంటావా నీకు స్త్రీ హింసా పాపం అంటుకోదా? పూర్వపు మునులెందరో అందుకే కదా అప్సరసలను కాదనకుండా ఆదరించారు.
కం.
శ్రీ లలిత! బ్రతుకుదును నీ
యాలింగన మెనసి దివికి నరిగెద లేదే
నేలాగు నీట ముంచెదొ?
పాలన్ముంచెదవొ? నీదుపాలంబడితిన్. ౪౬

 ఓ లలితుడా! నీ కౌగిట గౌరవించితే అది స్వర్గమే నాకు.
లేదా పాల ముంచెదవో నీట ముంచెదవో నీపాలినబడినదానిని.
కం.
అనుచున్ డగ్గుత్తిక జెం
దిన కంఠము భాష్పలవము నెనసిన కనులుం
గన క్రొత్త యైన వైఖరి
యను గల రుచిరాంగి జూచి యోగి యచలుడై.౪౭

కలకంఠి కంట నీటితో గద్గదస్వరముతో మరేదో కొత్తగా కనిపించుచుండగా ఆమెను చూచి యోగి కదలనివాడై
కం.
వెడనవ్వు నవ్వి యిట్లను
బడతీ! నీ నేర్పు మెచ్చవచ్చున నీ కె
వ్వడు దగు నట జూపిన నా
కడ నింకిట నిట్లు పలుకగా కాదు చుమా. ౪౮

    ఆ ముని ఓ చిరునవ్వు నవ్వి  ఓ వనితా! నీ మాటల నేర్పు మెచ్చుకోదగినదే. నీకు సరియైన వానిని విధాత చూపించాడు. అంచేత నా వద్ద ఇంక ఇలా మాటాడకు.
కం.
వలవని వానిన్వలచుట
వలపు తెఱంగే? మెఱుంగువాల్గంటీ! నీ
పలుకులు చిత్రతరమ్ములు
కలికి! రసాభాస మిది జగమ్మున కింపే.౪౯
     ఓ కలికీ! నిన్ను ప్రేమించని వానిని నువ్వు ప్రేమించడం ఏమైనా పద్ధతా? చాలా చిత్రంగా మాటాడుతున్నావే. ఇటువంటి అనౌచిత్యము లోకానికి ఇంపగునా?
మ.
క్షణభోగ్య మ్మవు తుచ్ఛసౌఖ్యమునకా శాంతిప్రదంబౌ ప్రతి
క్షణకష్టాత్తతపఃప్రభంధమున కాశ్వాసాంతముం గూర్చి వా
రణయానా! ననుబోటి లోబడుట? నీ ప్రౌఢత్వ మే మందు? నీ
ఫణతు ల్చాలును జాలు బొమ్ము కలదే? భావం బభావంబునన్. ౫౦
    ఓ గజగామినీ! ఎంతో శాంతికాముకమై నే కూర్చుకున్న తపస్సనే ప్రబంధానికి ముగింపు పలికించుటకా నాబోటి వారిని లోబరచుకోవడం? క్షణభోగ లాలసత్వమునకా ఈ తపస్సు? నీ గొప్పతనం ఏమని చెప్పనగును? నీ మాటలతీరు చాలుచాలు. లేనిదానిలో ఏదో ఉందని అపోహపడుట తగునా?
మ.
వనితా! కీకసమాంసచర్మమయ మీ వర్ష్మంబు పై పూతలే
ననలున్ సొమ్ములు నంబరంబులును సౌందర్యార్థ మేదో కదే
నను గన్బ్రామ దలంచుచుంటి వటు లౌనా? చాన! తత్త్వార్థయు
క్తిని గా కన్యుల కే మధీనులమె? పొల్తీ! వెల్తియై తక్కటా! ౫౧
       ఓ వనితా! ఎముకలు మాంసము చర్మముతో కూడుకున్న ఈ శరీరం అంతా పై పూతలే. ఈ తాపము నగలు వస్త్రాలు  ఇవన్నీ  ఏవో అందం కోసమే కదా. నన్ను మోసగాడిలా చూస్తున్నావు కదా. నేను తత్త్వార్థ ముక్తికి అధీనుడను కాని ఇతరములకు కాదు . అంత తక్కువ వాడిని అయ్యానా?
కం.
విను మీ వబల వటం చిటు
లనుమానించెదను గాని యలివేణీ! నా
దు నియమము సెఱచు నెవ డా
తని గాల్పనె? శాప మొసగి తద్వంశముతోన్.౫౨
   ఓ అలివేణీ! ఏదో అబలవు కదా అని చూస్తున్నాగాని లేకుంటే నా నియమాలను చెఱచే వారిని వారి వంశముతో సహా నాశనమగునట్లు శపించనా?
 కం.
అని పోవుచున్న యమ్ముని
గనుగొనుచుం బకబక నగి కలికి వలుకు నో
మునినాథ! చిత్తగింపం
జను వధానమున మనవి శమ మమరారన్. ౫౩
          అని చెప్పి పోవుచున్న ఆతని జూచి ఆమె పకపకా నవ్వి  ఓ మునివరా! విన్నపం చేసినప్పుడు వినడం సబబు గాని కోపపడడం తగునా?
గీ.
క్రోధ మన గామ మనగ వైరు లివి రెండు
తపమునకు హీన మందు గ్రోధంబు సుఖము
కలుగదు వ్రతంబు చెడు గాన గామ మన్న
వ్రతము సెడినను సుఖ మఖర్వము నమర్చు. ౫౪
      తపస్సునకు కామక్రోధములు అనునవి రెండు శత్రువులు. హీనపక్షంలో కోపం వలన సుఖం కలుగదు. వ్రతం చెడినా కామం వలన సుఖం అధికంగానే లభించవచ్చు.
ఆ.వె.
కామ మెందు గలదు కాకున్న మోక్షంబు
మాత్ర మెనయ వశమె? మౌని తతికి
గామి గాని మోక్షగామి కా డనెడు నా
ర్యోక్తి వినమె? క్రోధ ముఱదు గాని. ౫౫
        కోరిక అనేది లేకపోతే మోక్షము ఎలా వస్తుంది? అదీ ఓ కోరికే కదా మునులకు. కామి గాని వాడు మోక్ష గామి కాడు అనే పెద్దలమాట వినడం లేదా? కాని కోపం మాత్రం తగనిది.

Sunday, May 24, 2020


   అమ్మ బాల్యేందు శేఖరి. అంటే ఆమె సిగలోన నెలవంక ధరించినది. శివ భవానీలు ఇరువురకూ తలపై నెలవంక ఉంటుంది. అమ్మ చిద్గగన సదన. ఆ తలపై నెలవంక కరుణాచంద్రికలను వెదజల్లును.
నిన్న దర్శ పాడ్యమి గురించి నాకున్న ఎరుకను తెలిపితిని.
ఈరోజు ద్వితీయ. అనగా విదియ. ఈ పగలుకు విజ్ఞానం అని రాత్రికి దృష్టా అని పేర్లు. భగమాలినీ నిత్యా.
లౌకిక వ్యవహారం లో ఈరోజు నెలపొడుపు. విఘ్నేశ్వరు కథా సంపప్రదాయంగా ఈరోజు చంద్ర దర్శనం చేసి చంద్రునికో నూలుపోగు సమర్పించడం మన విధి. నిన్న దృశ్యాదృశ్యమాన మైన శశిరేఖ దృష్టానుకూలమై ఈరోజు కనిపిస్తుంది.
ద్వితీయ అంటే భార్య అని మరో అర్థం కూడా ఉంది.
అందరూ నెలవంకను ఈరోజు చూడాలను కుంటారు కాని అమ్మని నమ్ముకున్నవారు నిత్యమూ చూస్తున్నారు. అదే ఓ పద్య రూపంలో
సీ.
నెలకొక్క సారియే నెలవంక గగనాన
         నీ సిగన్ నెలవంక నిత్యనూత్న
దృష్టాద్వితీయయు తానద్వితీయ యౌ
       హర ద్వితీయ నువు నాకద్వితీయ
నిందలన్ పడకుండ నెలవంక గగనాన
        జూతురు నూలుపోగు జుట్టి విసరి
బాల్యేందు శేఖరీ భక్త వశంకరీ
       నీ సిగ నెలవంక నెనరు గురియు
తే.గీ.
తలచి నంతనె మా వాంఛితములు దీర్చు
నీ కొకరు సాటియే మహనీయ మూర్తి
నన్ను కాదనకమ్మ యానందవల్లి
కంచి కామాక్షి కరుణించు కల్పవల్లి.

ఇక కృష్ణ పక్షంలో తిథి నిత్యలు క్రింద పట్టికలో గుదిగుచ్చడ మైనది.గమనించ గలరు.

Saturday, May 23, 2020

      తిథులు వేదోక్త నామాలు
అమ్మ సూర్యేందు నయన. రాకేందు వదన.
సూర్య చంద్రులు కన్నులుగా నున్న పౌర్ణమి చంద్రుని వంటి మఖము గలది.
చంద్రుని కళలు పదునారు. ఆమె షోడశ కళాత్మిక. షోడశి చిద్రూపి.
"దర్శాద్యాః పూర్ణిమాంతశ్చ కలాః పంచదశైవ తు"
అని శ్రుతి వాక్యము.
అనగా పదునైదు కళలే. మరి పదునారవది సాదాఖ్య కళ.
ఈ పదునైదు కళలు శుక్ల ప్రతిపత్ నుండి పౌర్ణమి వరకూ గల పదునైదు తిథుల రాత్రులు. వీటిని మధుకృతములు అందురు.
అలాగే పగళ్ళను మధువృషములంటారు. అవి
సంజ్ఞానం విజ్ఞానం ప్రజ్ఞానం మొదలైనవి.
ఈషత్ దర్శనాత్ అనగా కొంచెము గా కనిపించుటచే దర్శ అయినది. కామేశ్వరీ నిత్యా.
ఇయం వావా సరఘా అను తైత్తరీయ బ్రాహ్మణ వాక్యం చే షోడశీ కల యైన సాదాఖ్య తేనె పట్టులో తేనెటీగలు కూడబెట్టిన తేనెను స్రవించునట్లు ఈ పంచదశ కళల చే కూడిన సుధను సుధా బిందువై స్రవించును.
"పయోహవా ఏతా మధు కృతశ్చ మధువృషాగ్ంశ్చ వేద
కుర్వంతి హాస్యైతా అగ్నౌ మధు.
నాస్యేష్టాపూర్తం ధయంతి".
అనుటచే మధుకృత వృషములు సుధాబిందువు నందు
సరఘ వలె కూడి సుధా సింధువును కూర్చుచున్నవి అన్న ఎఱుక లేనిచో వాంఛితార్థ పూర్తి కాదు.
అంతేకాదు
"వ్యతిరేక అనిష్టమహ అథయోహ నవేధ సహాస్యైతా
అగ్నౌ మధు కుర్వకుర్వంతి
ధయంత్యస్యేష్టా పూర్తమ్ వ్యాఖ్యాథ ప్రాయమేతత్.
అనగా వీని ఎఱుక లేనిచో అగ్నియందు  మధువును సృజించవు. ఈప్సితార్థములు ఈడేరవు. అందుచే అవశ్యము తెలియనగును.
ఆ వివరములు
   తిథి         పగలు             రాత్రి                నిత్యా
ప్రతిపత్      సంజ్ఞానం          దర్శా.       కామేశ్వరి
విదియ.      విజ్ఞానం            దృష్టా.     నిత్యక్లిన్న
తృతీయ.    ప్రజ్ఞానం.          దర్శతా.    భేరుండ
చతుర్థి.       జానత్.           విశ్ళరూపా. వహ్నివాసిని
పంచమి.   అభిజినాత్.       సుదర్శనా  మహావజ్రేశ్వరి
షష్టీ.           సంకల్పమానం  అప్యాయమానా శివదూతీ
సప్తమి       ప్రకల్పమానం.  ఆప్యాయమానా త్వరిత
అష్టమి      ఉపమానం.        ఆప్యాయా.   కులసుందరి
నవమి.      ఉపక్లుప్తం.         సూనృతా      నిత్య
దశమి.       క్లుప్తమ్.            ఇరా.            నీలపతాక
ఏకాదశి.        శ్రేయమ్.     అపూర్యామాణా  విజయ
ద్వాదశీ     వశీయమ్.     అపూర్వామాణా  సర్వమంగళ
త్రయోదశీ     అయత్.      పూరయంతీ.   జ్వాలామాలిని
చతుర్దశి.   సంభూతమ్.   పూర్ణా              చిత్ర
పౌర్ణమి      భూతమ్.       పౌర్ణమాసీ.     శ్రీ లలితా
కృష్ణపక్ష తిథులు మరోసారి చూద్దాం.
మంగళమ్ మహత్.

Friday, May 22, 2020


సీ.
 ఒకవంక యాశతో యొకవంక బెంగతో
           నెలవంక వలె నేను నెగడు చుంటి
ఒకసారి భయమునన్ యొకసారి భవములన్
            వేసారి పోవుచున్ వెతల నుంటి
యభయ ముద్రను జూచి యభయ మిచ్చెద వంచు
            యభయంకరీ వినుమంచు యంటి
వినుతు లెన్నియొ జేసి విన్నవించితి నమ్మ
            వివశుడై శరణంటు వేడుకొంటి
తే.గీ.
 ఎదురు చూపూల యెడదకు యెండమావి
నెదురు పడనీకు చూపించు నీటి బావి
నా మనవి విను తల్లి యానందవల్లి
కంచి కామాక్షి కరుణించు కల్పవల్లి.44
సీ.
నెలకొక్క సారియే నెలవంక గగనాన
         నీ సిగన్ నెలవంక నిత్యనూత్న
దృష్టాద్వితీయయు తానద్వితీయ యౌ
       హర ద్వితీయ నువు నాకద్వితీయ
నిందలన్ పడకుండ నెలవంక గగనాన
        జూతురు నూలుపోగు జుట్టి విసరి
బాల్యేందు శేఖరీ భక్త వశంకరీ
       నీ సిగ నెలవంక నెనరు గురియు
తే.గీ.
తలచి నంతనె మా వాంఛితములు దీర్చు
నీ కొకరు సాటియే మహనీయ మూర్తి
నన్ను కాదనకమ్మ యానందవల్లి
కంచి కామాక్షి కరుణించు కల్పవల్లి.45
సీ.
శారద యామినీ సమయ విభవమందు
          శ్రీ చక్ర సారూప్య సేవ నిమ్ము
శారదా రూప శ్రీ చక్రమే జగమంత
          ఈమేను శ్రీ మేరు వే యనెరిగి
శారదా వాగ్రూపి సాక్షర స్ఫురఝరి
          న్నిడి భావాంబర మేలు కొమ్ము
శారద కామరాజ సుశక్తి బీజముల్
          నిరతము మదిని నిర్ణీత మిమ్ము
తే.గీ.
శారదా కృపా భర సుధా స్రవము నొసగి
మోక్ష మార్గము నందు మమ్మోప నిమ్ము
నన్ను మన్నించ వమ్మ యానందవల్లి
కంచి కామాక్షి కరుణించు కల్పవల్లి. 46.
సీ.
తలపు లన్నియు భవత్తంత్రమై పలుకు ల
     న్నియు మంత్ర మయములై నిలువ నిమ్ము
నిరతి యంతయు మనికి నియమమై మనగల్గు
      నియతి నిమ్ము  నను పునీతు జేసి
నిశ్చల మతినై యనిర్వచనీయ సు
      ధా స్రవంతిని నన్ను తనియ నిమ్ము
వర్షోరు ధారా పరంపరలన్  కృప
      గురియ నిమ్ము మనసు కుదురు నిమ్ము
తే.గీ.
అరసి యరయక జేసిన యఘము లన్ని
కృతకమన జేసి నాకు నిష్కృతిని యిమ్ము
నన్ను గావుమో తల్లి యానందవల్లి
కంచి కామాక్షి కరుణించు కల్పవల్లి.47.



Wednesday, May 20, 2020

  మొక్కై వంగనిది
తొలినాళ్ళ గగ్గోళ్ళు
మలినాళ్ళ సందళ్ళు
లేనోళ్ళ ఉన్నోళ్ళ కన్నీళ్లు
కనరారు ఏలికల పాలేళ్ళు
వినరావు పాలితుల గలస్వనాలు
కరోనా దెబ్బకి బెంబేలెత్తిన జనం
అది పోయేది కాదని తెలుసుకున్న మనం
మొక్కై వంగనిది మానై వంగునా అని
ఇంతింతై అంతంతై లోకం చుట్టేసినా
విరుగుడు లేక దానితో పరుగిడ లేక
సహజీవన మనివార్యం అంటూ
చేతులు దులిపేసుకునే పాలకులు
ఈ పాపం నాది కాదు నీదనే తలపులు
జాతస్యహి మరణం ధృవం కనుక
ఆ క్షణం ఆ కరోనాకు ఉంటుందని
ఆశావహ దృక్పథంతో
నిరాశా నిస్పృహలను వీడి
మరలా మన యాతన మొదలెడదాం
తాళం మూతను ఎత్తేసినట్లున్న
ప్రభుత్వాల తీరును ఏమనగలం
రోజుకి వందలలో సోకినప్పుడు
ఇంటికి పరిమితమై కూర్చున్నాం
రోజుకి అయిదారు వేలకు సోకుతుంటే
తలుపులు తెఱచుకు బయటకు వస్తున్నాం
ఎందరికి సోకేనో ఎవరికి సోకేనో
ఆ పరమేశ్వరునికే తెలియాలి
ఎవరి బాధ వారే పడాలి
ఏలికలకు అదే కావాలి.

Saturday, May 16, 2020


కం.
శివశంకరి మమ శంకరి
భవభయహారీ భవాని భగవతి పరులా
శివవల్లభ ప్రభా భ
క్త వశంకరి నౌమి శారదా శ్రీ మాతా. 66

ఈశానీ శర్వాణీ
ఈశీ భవాని శివాని యీశ్వరి కళ్యా
ణీ శివ రాణీ కాళి యు
మా శివదయితా నమోస్తు మా శ్రీ మాతా.67

ఆనంద భైరవివి నీ
వానందము నీ వలదె శివానీ గౌరీ
యానంద లహరి మాకు శి
వానంద లహరిని యొసగవా శ్రీ మాతా.68

కాత్యాయనీ మహా సం
స్తుత్యా యారాధ్య మీవె శుభంకరి శివే
తిర్యగ్గతి వలదు వలదు
యార్యా ఋజు గతి నిడు కృపయా శ్రీ మాతా.69

దాక్షాయణీ  చిద్రూపిణి
రక్షో మార్గము మనోహరమ్మగు నటులన్
కుక్షింభర జాతికినిడి
రక్షించవే యపరా పరా శ్రీ మాతా.70

ఆర్యాణీ కళ్యాణీ
నర్యము నెఱింగి సుజనుల నానా వెతలన్
తిర్యక్ప్రేక్షణములతో
తిర్యగ్జేయవలె పార్వతీ శ్రీ మాతా.71
(నర్యము = నరునకు ఇంపైనది, తిర్యక్ప్రేక్షణము = ఓరజూపులు , తిర్యగ్జేయు = అడ్డగించు)

అపరాజితా యపర్ణా
యుపగుహ్యము నరయమి మరియున్నత్యాశన్
యప మార్గంబుల పడు మము
యుపదిష్టము నిచ్చి కావుమో శ్రీ మాతా.72
(ఉపగుహ్యము =అందుకో దగినది, అరయమి = తెలియక, ఉపదిష్టము = ఉపదేశము)

ముక్కంటి వాలుగంటి య
నిక్కంబగు జీవ వాహినిలో బడి మనుజుల్
లెక్కింపరు మంచి చెడులు
చక్కం జేయ గదవే ప్రజన్ శ్రీ మాతా. 73

దేవేశి మహేశి శివే
నీవే జగజ్జననీ కనికరించవలెన్
ఈవే కోర్కెల నమ్మా
నీవే దిక్కని కొలచితినే శ్రీ మాతా. 74

దుర్గవు దురిత విదూరవు
భార్గవి భవసాగరమను బంధ విదారీ
స్వర్గరివై దయతో స
న్మార్గ పథికుల మము జేయుమా శ్రీ మాతా.75

ద్యుతిమత మరకత శ్యామా
యతి ధృతి కిరాతి భగవతి యనుకూల్యముగా
సితకంధరు సతి యుండగ
మిత మేమి మాకని తలుపమే శ్రీ మాతా.76

వడకులమల దొర పట్టివి
యడిగిన లేదనక నొసగు యమ్మవు నీవే
తడబడి చిడిముడి కోర్కెల
నడిగితి ననుకో దొసగగునా శ్రీ మాతా. 77

వలిగుబ్బల ముద్దు సుతవు
వెలిగొండ దొర ప్రియ సతివి విశ్వేశ్వరివై
యెలమిని మాకిడ వేలా
గలరే వేరె మము కావగా శ్రీ మాతా.78

వెలిగొండ రాయుని సగమగు
తెలిగంటి వైతివి యడిగితే కాదనడే
కలిముల నీయగ వలదని
తెలివేల్పు నీ దయ కలుగదే శ్రీ మాతా.79
(తెలిగంటి = వనిత, వెలిగొండ = కైలాసం
తెలివేల్పు = శివుడు)

అచలాత్మజా భవానీ
విచలిత మనస్కులు గారె విబుధు లుదాసీ
న చలనము వలన లలనా
యుచితమె నీ మౌనము యరయుమి శ్రీ మాతా.80

మంగళ మూర్తివి సర్వ సు
మంగళ భక్తులు సతమత మగుచో భువిలో
మంగళ మగునే భువికి య
మంగళహర హర సతి వినుమా శ్రీ మాతా.81

కలిగిన కాడికి గంజియొ
కలియో  తిని యుండ నీదు కలికాలము గా
కలిమిడు నాశతొ పనిమం
తులు పని జేతురు పని వలతురు శ్రీ మాతా.82

ఏలా తాపత్రయములు మా
కేలా వ్యాపారము లన కే లాడిన వా
రే లాభింతురు యంటే
యేలా నాబోటి వారి కిక శ్రీ మాతా.83

ఏమగునో యెటులగునో
నా మది కేమియు తెలియక నా కెంతో బెం
గై మనసింతై  తెలిపితి
భ్రామరి నీకున్ నను మరువకు శ్రీ మాతా.84

నగజా విరజా హోమము
తగ జేతును మనసు నిలిపి తరియింపంగా
వగ జూపకు తాళను చను
వుగ నను కనుగొన వో శ్రీ మాతా.85

మాతంగీ మధుశాలిని
పీతాంబరి విష్ణు సహజ బేలగ జూడన్
జోతింగ దయిత దయతో
ద్యోతింపగ జేయుము హృదియున్ శ్రీ మాతా.86

పరమేశ్వరి యీశ్వరి యిహ
పర శుభ దాయని యచలజ పార్వతి నిన్నే
పర హితమే కామేశ్వరి
వరమని నెఱ నమ్మితి గనవా శ్రీ మాతా.87

అనుకూలింతు వనుచు నే
ననుకొంటిని శాంకరీ మనస్సుమధురమై
వినుతించితి నా నేర్పున
కనికరమగునా భవహరకరి శ్రీ మాతా.88

భవ హరమై ద్యుతి కరమై
శివ పరమై మేనకాత్మజవై విజయవై
శివ సగమై నిలచెడి నీ
కివియే నతులమ్మ వలదనకే శ్రీ మాతా.89
( హిమవంతుని భార్య మేన. వారికి మువురు సుతలు.1.ఉమ 2.ఏకపర్ణ 3. అపర్ణ)

కరమై విరి సరమై శుభ
కరమై యొప్పగ నుడివితి కందములన్ శం
కరమై యభయంకరమై
వరమై వెలుగొంద నీయవా శ్రీ మాతా.90.

మనసారగ నే పలుకగ
మనసారగ నిన్ కొలువగ మనసౌ నమ్మా
నిను కొలచుట యోగ మనుచు
నిను నమ్మిన వాడను జననీ శ్రీ మాతా.91

శ్రీ విద్య నిచ్చితివి గనుక
సేవా నిరతికి బలమిడు చేతల కింకన్
నీవే యిమ్మవకాశము
మా వేలుపు వాదుకో యుమా శ్రీ మాతా.92


శ్రీ కరి శుభకరి శాంకరి
నా కను దోయికి కనబడునా యొక సారై
నా రుచిరార్థపు రూపము
నీ రమణీయ విలసనము నిట శ్రీ మాతా.93

శ్రీ హరిసహజా గిరిజా
సాహసమగునా నినుగన సరిపోనా భ
వ్యా హరదారా యపరా
సింహరథ భగవతి తామసీ శ్రీ మాతా. 94

నీవు సనాతనివమ్మా
నీవే బాలవు భవాని నిరుపమ జననీ
నీవే గా జగదంబవు
నీవే నా వేలుపు జననీ శ్రీ మాతా.95

నీవే బగళా ముఖివిన్
నీవే  పంచదశివి జననీ శ్రీ లలితా
నీవే భైరవి షోడశి
నీవే  సమస్తమును జననీ శ్రీ మాతా.96

నిన్నే నమ్మితి మదిలో
నిన్నే  స్థిరముగ కొలచితి నెద కోవెలలో
నిన్నే మననము జేతును
నిన్నే దరి జేరగ వలెనే శ్రీ మాతా. 97

విన్నా నమ్మా నీ కథ
లెన్నో ప్రవచనము లందు యెన్నెన్నో నే
కన్నా నమ్మా మహిమలు
కన్నార్ప కుండ నిజమనగా శ్రీ మాతా.98

ఉన్నావమ్మా గుడిలో
నున్నావమ్మా  యెద యెద నున్నావమ్మా
పెన్నార్తి కను సన్నల
నున్నావంతట కనుగొనుచు శ్రీ మాతా.99

గుడిలో శిలలో విరిలో
జడిలో బడిలో యల యలజడిలో  ద్యుతిలో
యిడికను నీటను గాలిని
తొడి లేక నుందువు గురుతుగ శ్రీ మాతా.100

ఆవునమ్మా కోర్కెలు తర
గవులే యుచితా నుచితము గని నీవిమ్మా
కవినై పవినై భువిపై
రవి శశి మయూఖ మన యలరన్ శ్రీ మాతా.101

కాదమ్మా  కామాక్షీ
నీదరి చేరగ సుళువుగ నెఱ నమ్మిన వా
రే దరిశనమో దరియో
నీదయ వల నొంద గలుగు నిల శ్రీ మాతా.102

రాదమ్మా కైవల్యము
వాదోప వాదులకు యపవాదులకున్ కా
రాదని చులకన పడగను
లేదనుటే మేలు పనిలే శ్రీ మాతా.103

మాకంద ఫల రసాదుల
నానందముగా గొనుము సనాతని మృదులా
యానందమీవె నందా
మాకందరకున్ భగవతి మా శ్రీ మాతా.104

వందలు వేలుగ స్తుతులను
యెందరు జెప్పిరొ అయినను ఇప్పటి కిపుడే
కందములో జెప్ప మనిన
సుందర రాముని గని మనసున శ్రీ మాతా.105

నతిగా సన్నుతిగా మది
నతిగా తలుపక నుడివితి నమోస్తు లలితా
స్తుతి జేయుట కూర్చుటకున్
యతి స్థానము జటిలము యగు శ్రీ మాతా.106

ఎదలో తుందిల మందితి
మదిలో పలు ప్రశ్నలు యభిమానము లెగయన్
హృది మందిరమున నిన్నిడి
యిదిగో  గూర్చితి  శతకము నిటు శ్రీ మాతా.107

వెతలన్ బాపగ నిమ్మా
శ్రుతి సూక్తి నెఱుక పరచగ శుభమల నొసగన్
నతి జేయుచు నుతి జేసితి
సతి సత్యా సౌమ్య యచలజా శ్రీ మాతా.108





Friday, May 15, 2020

శ్రీ మాతా


కం.
శ్రీ వాణీ పరిసేవిత
దేవీ లలితా పరా పదే పదె నిన్నే
సేవించే భక్తుండను
కావవె వరద శుభము నొసగవె శ్రీ మాతా.1

నమ్మకమే యూపిరిగా
సుమ్మా మిగిలితి భవాని! చూడకుమీ యో
యమ్మా నా తప్పుల నిపు
డిమ్మా చేయూత ఋణపడెద శ్రీ మాతా.2

అమ్మా నీపై యెంతో
నమ్మకముంచి దిగితిని యనాథను కానీ
కమ్మా ఋణసౌకర్యము
నిమ్మా నిలబెట్టెద బడి నెంతగనో శ్రీ మాతా.3

అమ్మా నీ కనుసన్నల
నిమ్మా యానతి యలాగునే నే నడచే
నమ్మా నా తలపై యొ
ట్టమ్మా నన్నమ్ముమమ్మ  అల శ్రీ మాతా. 4

అమ్మా దిక్కెవ్వరు నా
కమ్మా పదిమందికి యుపకారము జేయన్
ఇమ్ముగ నగునని దలచితి
నమ్మా మన్నించవమ్మ నన్ శ్రీ మాతా.5

అమ్మా  నాదేలే త
ప్పమ్మా పడియుండుట సరిపడదని తలచా
నమ్మా పిల్లలపై మో
జమ్మా యందుకె బడి తెఱిచా శ్రీ మాతా.6

అమ్మా నావైపిటు చూ
డమ్మా దీవించవమ్మ యభయము నిడుచున్
ఇమ్మా ఋణహరణపు మా
ర్గమ్మోయి దయార్ద్ర హృదయ గా శ్రీ మాతా.7

ఏ వేళన్ నిను మరచే
నా వేరెవరిన్ తలచితినా  కామాక్షీ
కావగ గదవే దీనుని
రావే యీశ్వరి యిళ యపరా శ్రీ మాతా. 8

నీవే తప్ప మరెవ్వరి
సేవే యెఱుగని మనిషికి చేదోడువు కా
వే వే రెవరిని వేడెద
రావే రక్షింపవే పరా శ్రీ మాతా. 9

నీవే సమస్త మంచును
నీవే నా దైవమంచు నెఱ నమ్మితినే
సావిత్రీ వారాహీ
నీవే దిక్కు ఖచరి! జననీ! శ్రీ మాతా.10

నమ్మితి నిన్నే కొలచుచు
నమ్మిన వారికి యిడుముల నాశము నీవే
ఇమ్ముగ చేతువనుచు ని
న్నమ్మిన వాడను చెఱపగునా శ్రీ మాతా.11

కాలమొ కర్మమొ భ్రమసితి
చాలిటు వంటి యవివేక చర్యలిక పయిన్
చాలును తల్లీ యాద్యా
యాలము సేయక ననుగనవా శ్రీ మాతా.12

సరిచేయన్ గలవంచును
మరిమరి వేడితి మృడాని మాతంగీ నీ
కరుణా పాత్రుడ గానే
పరమారాధ్యా ననుగనవా శ్రీ మాతా.13

చేతులు కట్టుకు పడి యుం
టే తిరముగ కూర్చొన గలడే నరుడెవడున్
రాతిరి పగలనకను పని
జేతును ఋణహరణము తలచిన శ్రీ మాతా. 14

నిలిపెదవో తలలెత్తుకు
కలవానిగ నిల్పి నన్ను కారుణ్య నిధీ
నలిపెదవో తలదించుకు
బలికమ్మని యీసడింతువా శ్రీ మాతా.15

 ఆరాతి చేతికి చిక్కిన
 రారాతి సూతి ధనమును రప్పించినచో
దారా సుతలెడ మన్నన
గా రాజిల్లగ మనగలుగనె శ్రీ మాతా.16

పాపమొ పున్నెమొ యెంచక
కాపరివై నన్నుకావగా వలెనమ్మా
పాపినిలే కాదనను నా
పాపము లన్ని శమియింపవా శ్రీ మాతా.17

కలలోనైనను కనపడి
బలిమిని యొసగెదననుచు నభయము నొసగవా
కలిమికి దూరము చేయక
నలుగురి లో నన్ను  నిలుపవె నా శ్రీ మాతా.18

పిల్లల కనువుగ బడి చదు
వల్లన యిష్టమగునట్లు అందరికిన్ నా
యుల్లము నిండుగ నేర్పెద
కల్ల యెరుంగని బుడుతలకట శ్రీ మాతా.19

ఋణముల పాలై పోయెను
వణిజుల వడ్డీల పాలు వడిగా తీర్చన్
ఋణ మతి తక్కువ వడ్డీ
గుణియించునట్లు వరమడుగుదు శ్రీ మాతా.20

మంచి పనులు జేయింతువొ
ఇంచుక మిగిలిన బ్రతుకున యెంతైనా నీ
పంచన పడివుంటా యే
వంచన సలుపక నను గొనవా శ్రీ మాతా.21

ప్రతి పనికీ ధన మక్కర
అతి దీనముగా యడిగితి ననుకో వమ్మా
గతిలేని వాడిని సుతుడ
నుతి జేసి వినతుల జేతు నో శ్రీ మాతా.22

ఇప్పింతువో ఋణమొకటి
తప్పింతువొ నర్థబాధ తడబడు చుంటిన్
ఒప్పింతు నెవరి నైనను
నొప్పింతువొ నలుగురెదుటనో శ్రీ మాతా.23

మౌనమె నీ బదులైనను
మానమె నాకు నతి ముఖ్య మనుచున్ తలతున్
గాన నిక ముగింతు బ్రతుకు
నానక కన  వారిజాసనా శ్రీ మాతా.24

ఎవ్వరి నడిగెద నిమ్మని
యెవ్వరి కడ యంగలార్తు  యెట్లోర్తును యిం
కెవ్వరు మ్రొక్కగ లేరే
యివ్విధి తప్పించు వారలే శ్రీ మాతా.25.

ఏ కోరిక లేకుండను
నాకో వరమీయ రాదె నారాయణి నీ
రాకా ముఖ విలసిత హే
లా కారుణ్య మునను పరులా శ్రీ మాతా.26

లౌకిక జీవన యానము
నాకిక చాలును  యపర్ణ! నాచే పరుషా
ధికముల పలికించకుమీ
వ్యాకుల మందెద కనుగొనవా శ్రీ మాతా.27

ఉన్నావని నాతో నీ
వన్నావని సంబర పడి పరుగిడనా నా
కన్నీ నీవే కాదా
యెన్నాళ్ళని యెదురు చూతునే శ్రీ మాతా.28

అడగాలని యనిపించదు
యడిగినను గాని బదులిడ వనిపించున్ నే
నడిగెద పదిమంది కొఱకు యె
పుడడిగిన యేమి మును తలపుకు శ్రీ మాతా.29

రారాతి ప్రసూతి! శిగను
రేరేని నగవు గనుమ పరికించితివి గా
పారాణి పదముల మిసిమి
కారాదు దూరము తరచుగా శ్రీ మాతా.30


ఏలా  పలు తపనలు నా
కేలా యీ వయసులోన  కిమ్మన కుండా
మూలన పడియుండక యిపు
డేలా శ్రమైక విధానమిట శ్రీ మాతా.31

అనువా కాలము చూడగ
చనునా బుడతల చదువుల సంగతి మరలా
కనవే వెనుకటి యనుభవ
మనగా బదులేమి లేదు మా శ్రీ మాతా.32

మనసంతా వ్యాకులమై
మనవారికి సరిపడని సమస్యగ యెదురై
ధన మాన హరణమై మిగి
లిన పని నాకేల యనకులే శ్రీ మాతా.33


ఏదో చేయాలని నేన్
యేదీ చేయొద్దని మన యింటా వంటా
లేదని కుటుంబిని సుతయు
వాదోపవాద ములైనవట శ్రీ మాతా.34

ఇల్లాలి పోరుతోడను
యిల్లే సమస్తమను జను లెవ్వరి తోడన్
కల్లోల కడలి తోడను
యెల్లెడలా యోటమౌను యిల శ్రీ మాతా.35

పెద్దల దీవెన లుంటే
ముద్దుగ సాధించ వచ్చు ముందర పనులన్
వద్దుర పొమ్మని రనుకో
నిద్దరి గెలుపొంద లేము నిల శ్రీ మాతా.36

జరిగిన దానికి వగవక
జరగగ వలసినది చూడ చక్కంబడు నం
చెరిగిన జాలదె సుమతుల
కరయమి గాదె. భ్రమలు తొలగవె శ్రీ మాతా.37

అందల మెక్కుట కాదే
మందితొ వ్యవహారమనగ మా యమ్మా యే
మందును విధి యిట్లున్నది
చెందురు తోబుట్టువు దయచే శ్రీ మాతా.38


ఎవ్వరెటులన్న నేనే
మివ్వ గలను బదులు మౌనమే మేలనుచున్
సవ్వడి లేకుండ నడతు
యెవ్వరి కొరకు బ్రతికెద లే శ్రీ మాతా.39

నాకో యుపకారము గా
నాకో మహా వరమనగ నందీ యవె మా
నీ కెంతేని ఋణపదును
నీ కేలొకపరి   ప్రియ జననీ శ్రీ మాతా.40

ఆమ్మా మనసా వందన
మమ్మా వచసా నతి గొనుమా పరులా నే
నమ్మా నీ సుతుడను రా
వమ్మా నా యెద వసింపవా శ్రీ మాతా.41

అమ్మా యని పిలచిన చా
లమ్మా  మదిలో దిటవగు నంతియె కానీ
యమ్మను మించిన దైవము
నిమ్మహి కలదె వరదాయినీ శ్రీ మాతా.42

అమ్మా షోడసిగా నిను
నెమ్మదిలో తలతు నెపుడు నిశ్చల మతినై
ఇమ్మా కాదనకట్టి శు
భమ్ము భగవతి శివవల్లభా  శ్రీ మాతా.43

అమ్మా బాలా మంత్రము
నిమ్ముగ జపియించు నపుడు నిజముగ నీవే
గమ్మున కనిపించితివే
కమ్మని యనుభూతి కలుగగా శ్రీ మాతా.44


అమ్మా నీ చరణ శరణు
నిమ్మా పరిపరి విధముల నిడుముల నిడకమ్మా మే
లమ్మా నీ జపమే నా
కిమ్మా జననీ కిరాతకీ శ్రీ మాతా.45

అమ్మా  యలభ్య యోగమొ
నమ్మకమో పున్నెమో జననీ జనకులే
యిమ్ముగ దీవించిరొ న
న్నమ్మా కడ దేరగ గలనా శ్రీ మాతా. 46

అమ్మా నువు జగదంబవు
ఇమ్మనుజుల కేల యిడుము లిస్తివి  కారే
యిమ్మనుజులు నీ బిడ్డలు
రమ్మని పిల్లల గని యనరా శ్రీ మాతా. 47

అమ్మా నే వదరిన యున్
కిమ్మన వేలా  కిరాతి వేలా యిటులన్
గమ్మున యుందువు వినవో
నెమ్మదిగా చెప్పి నంతనే శ్రీ మాతా.48

అమ్మా  నిను కను గొన్నా
నమ్మా కలలోన యొక్క నాడది నిజమో
సమ్మోహనమౌ బంగరు
బొమ్మగ శ్రీ చక్రపు పనుపున శ్రీ మాతా.49

అమ్మా శ్రీ విద్యా విభ
వమ్మో పురాకృత ఫలమొ  వాగ్భవ బలమో
నమ్మిక యో నడిపించును
కమ్మగ నన్ను  పురుహూతికా శ్రీ మాతా. 50

నీ కరుణకు సరి పాటియె
లోకము లో వేరొకటి పలురీతుల శివే
లోకులు పలుగాకులతో
నాకేమి పనో చెఱపగునా శ్రీ మాతా.51

నిన్నే నమ్మిన రీతిగ
విన్నావా నమ్మ నొరుల విదుషీ  లలితా
కన్నావా భక్తుల కొర
కున్నావా కాదని యనకో శ్రీ మాతా.52

నమ్మిన వారికీ సంపద
లిమ్ముగ నిత్తు వనిరి మునుపే రీతిగ నిన్
నమ్మన వారిని జూస్తివొ
యమ్మా నన్నటులె జూడవా శ్రీ మాతా.53

ఆమ్మా నాకొక దరిశన
మిమ్మా కనులారగ కననిమ్మా యొకసా
రమ్మా  మాటాడు నాతో
నమ్మా తరియింపగ నగునా శ్రీ మాతా.54

మును నే జేసిన పాపమొ
వెనుకటి మిగిలిన విచ్చితమో  నా
కనులదొ మనసుదో దోసము
కన నీయదు నిన్ను యంతగా శ్రీ మాతా.55

ఎందరికో యారాధ్యవు
కొందరి కేనట సుసాధ్యగుదువది యేలో
యందరి నొకటే రీతిగ
నెందుకు జూడవొ భవహరిణీ శ్రీ మాతా.56

తారా పథమంటిరి నిన్
తారగ కొలచిన ప్రముఖులు తామసు లైనన్
తారిణి వనుచును తారా
తారిణి వనుచు యపరాజితా శ్రీ మాతా.57

ఇహ సౌఖ్యమ్ములకై
దహరా కాసమున పంచ దశిన్ జపింపన్
యిహపర ముభయము కలుగన్
వహియింతు నుభయము నే జపము శ్రీ మాతా. 58


మోక్షము జూచిరె యెవరున్
మోక్షపు విద్య యని 'కాది' ముక్తికి నిదియే
కుక్షికి కాదని యందురు
దక్షతగా తెలుపవె వరదా శ్రీ మాతా.59

ఆద్యా నీ వొసగిన నిర
వద్యము శిరసా వహింప వలదే లలితా
సద్యః ఫలదాయిని శ్రీ
విద్యా యుపాసన భైరవీ శ్రీ మాతా.60

ఆర్యా మహా జనని నా
కార్యము సఫలము నగు వరకారాట పడన్
పర్యవ సానము లెంచను
దుర్యోగము నాకిక వలదో శ్రీ మాతా.61

మంత్రమె నాకున్న బలిమి
మంత్రమె నాదు కలిమి యనుమానము లేలా
మంత్ర యనుష్టానము స్వా
తంత్రము నిచ్చెనుకద లలితా శ్రీ మాతా. 62

చలిమల చూలికి వరద క
పాలికి శూలికి కిరాతి భగవతి కెపుడున్
కాళికి  యీశికి త్రిభువన
కేళికి ప్రణతు లిడుట లెరుకే శ్రీ మాతా63

శాంకరి శాంభవి భక్త వ
శంకరి శిరసా నమోస్తు సర్వ శుభకరీ
పొంకము నొప్పగను శివ ప
ర్యంకా దీవించవె కృపయా శ్రీ మాతా.64

శారద యార్త త్రాణ వి
శారద వరదా మునీంద్ర శాస్త్ర విహితమౌ
దారిని నను నడిపించగ
నారాయణి దయ గలుంగునా శ్రీ మాతా 65


కం.
శివశంకరి మమ శంకరి
భవభయహారీ భవాని భగవతి పరులా
శివవల్లభ ప్రభా భ
క్త వశంకరి నౌమి శారదా శ్రీ మాతా. 66

ఈశానీ శర్వాణీ
ఈశీ భవాని శివాని యీశ్వరి కళ్యా
ణీ శివ రాణీ కాళి యు
మా శివదయితా నమోస్తు మా శ్రీ మాతా.67

ఆనంద భైరవివి నీ
వానందము నీ వలదె శివానీ గౌరీ
యానంద లహరి మాకు శి
వానంద లహరిని యొసగవా శ్రీ మాతా.68

కాత్యాయనీ మహా సం
స్తుత్యా యారాధ్య మీవె శుభంకరి శివే
తిర్యగ్గతి వలదు వలదు
యార్యా ఋజు గతి నిడు కృపయా శ్రీ మాతా.69

దాక్షాయణీ  చిద్రూపిణి
రక్షో మార్గము మనోహరమ్మగు నటులన్
కుక్షింభర జాతికినిడి
రక్షించవే యపరా పరా శ్రీ మాతా.70

ఆర్యాణీ కళ్యాణీ
నర్యము నెఱింగి సుజనుల నానా వెతలన్
తిర్యక్ప్రేక్షణములతో
తిర్యగ్జేయవలె పార్వతీ శ్రీ మాతా.71
(నర్యము = నరునకు ఇంపైనది, తిర్యక్ప్రేక్షణము = ఓరజూపులు , తిర్యగ్జేయు = అడ్డగించు)

అపరాజితా యపర్ణా
యుపగుహ్యము నరయమి మరియున్నత్యాశన్
యప మార్గంబుల పడు మము
యుపదిష్టము నిచ్చి కావుమో శ్రీ మాతా.72
(ఉపగుహ్యము =అందుకో దగినది, అరయమి = తెలియక, ఉపదిష్టము = ఉపదేశము)

ముక్కంటి వాలుగంటి య
నిక్కంబగు జీవ వాహినిలో బడి మనుజుల్
లెక్కింపరు మంచి చెడులు
చక్కం జేయ గదవే ప్రజన్ శ్రీ మాతా. 73

దేవేశి మహేశి శివే
నీవే జగజ్జననీ కనికరించవలెన్
ఈవే కోర్కెల నమ్మా
నీవే దిక్కని కొలచితినే శ్రీ మాతా. 74

దుర్గవు దురిత విదూరవు
భార్గవి భవసాగరమను బంధ విదారీ
స్వర్గరివై దయతో స
న్మార్గ పథికుల మము జేయుమా శ్రీ మాతా.75

ద్యుతిమత మరకత శ్యామా
యతి ధృతి కిరాతి భగవతి యనుకూల్యముగా
సితకంధరు సతి యుండగ
మిత మేమి మాకని తలుపమే శ్రీ మాతా.76

వడకులమల దొర పట్టివి
యడిగిన లేదనక నొసగు యమ్మవు నీవే
తడబడి చిడిముడి కోర్కెల
నడిగితి ననుకో దొసగగునా శ్రీ మాతా. 77

వలిగుబ్బల ముద్దు సుతవు
వెలిగొండ దొర ప్రియ సతివి విశ్వేశ్వరివై
యెలమిని మాకిడ వేలా
గలరే వేరె మము కావగా శ్రీ మాతా.78

వెలిగొండ రాయుని సగమగు
తెలిగంటి వైతివి యడిగితే కాదనడే
కలిముల నీయగ వలదని
తెలివేల్పు నీ దయ కలుగదే శ్రీ మాతా.79
(తెలిగంటి = వనిత, వెలిగొండ = కైలాసం
తెలివేల్పు = శివుడు)

అచలాత్మజా భవానీ
విచలిత మనస్కులు గారె విబుధు లుదాసీ
న చలనము వలన లలనా
యుచితమె నీ మౌనము యరయుమి శ్రీ మాతా.80

మంగళ మూర్తివి సర్వ సు
మంగళ భక్తులు సతమత మగుచో భువిలో
మంగళ మగునే భువికి య
మంగళహర హర సతి వినుమా శ్రీ మాతా.81

కలిగిన కాడికి గంజియొ
కలియో  తిని యుండ నీదు కలికాలము గా
కలిమిడు నాశతొ పనిమం
తులు పని జేతురు పని వలతురు శ్రీ మాతా.82

ఏలా తాపత్రయములు మా
కేలా వ్యాపారము లన కే లాడిన వా
రే లాభింతురు యంటే
యేలా నాబోటి వారి కిక శ్రీ మాతా.83

ఏమగునో యెటులగునో
నా మది కేమియు తెలియక నా కెంతో బెం
గై మనసింతై  తెలిపితి
భ్రామరి నీకున్ నను మరువకు శ్రీ మాతా.84

నగజా విరజా హోమము
తగ జేతును మనసు నిలిపి తరియింపంగా
వగ జూపకు తాళను చను
వుగ నను కనుగొన వో శ్రీ మాతా.85

మాతంగీ మధుశాలిని
పీతాంబరి విష్ణు సహజ బేలగ జూడన్
జోతింగ దయిత దయతో
ద్యోతింపగ జేయుము హృదియున్ శ్రీ మాతా.86

పరమేశ్వరి యీశ్వరి యిహ
పర శుభ దాయని యచలజ పార్వతి నిన్నే
పర హితమే కామేశ్వరి
వరమని నెఱ నమ్మితి గనవా శ్రీ మాతా.87

అనుకూలింతు వనుచు నే
ననుకొంటిని శాంకరీ మనస్సుమధురమై
వినుతించితి నా నేర్పున
కనికరమగునా భవహరకరి శ్రీ మాతా.88

భవ హరమై ద్యుతి కరమై
శివ పరమై మేనకాత్మజవై విజయవై
శివ సగమై నిలచెడి నీ
కివియే నతులమ్మ వలదనకే శ్రీ మాతా.89
( హిమవంతుని భార్య మేన. వారికి మువురు సుతలు.1.ఉమ 2.ఏకపర్ణ 3. అపర్ణ)

కరమై విరి సరమై శుభ
కరమై యొప్పగ నుడివితి కందములన్ శం
కరమై యభయంకరమై
వరమై వెలుగొంద నీయవా శ్రీ మాతా.90.

మనసారగ నే పలుకగ
మనసారగ నిన్ కొలువగ మనసౌ నమ్మా
నిను కొలచుట యోగ మనుచు
నిను నమ్మిన వాడను జననీ శ్రీ మాతా.91

శ్రీ విద్య నిచ్చితివి గనుక
సేవా నిరతికి బలమిడు చేతల కింకన్
నీవే యిమ్మవకాశము
మా వేలుపు వాదుకో యుమా శ్రీ మాతా.92


శ్రీ కరి శుభకరి శాంకరి
నా కను దోయికి కనబడునా యొక సారై
నా రుచిరార్థపు రూపము
నీ రమణీయ విలసనము నిట శ్రీ మాతా.93

శ్రీ హరిసహజా గిరిజా
సాహసమగునా నినుగన సరిపోనా భ
వ్యా హరదారా యపరా
సింహరథ భగవతి తామసీ శ్రీ మాతా. 94

నీవు సనాతనివమ్మా
నీవే బాలవు భవాని నిరుపమ జననీ
నీవే గా జగదంబవు
నీవే నా వేలుపు జననీ శ్రీ మాతా.95

నీవే బగళా ముఖివిన్
నీవే  పంచదశివి జననీ శ్రీ లలితా
నీవే భైరవి షోడశి
నీవే  సమస్తమును జననీ శ్రీ మాతా.96

నిన్నే నమ్మితి మదిలో
నిన్నే  స్థిరముగ కొలచితి నెద కోవెలలో
నిన్నే మననము జేతును
నిన్నే దరి జేరగ వలెనే శ్రీ మాతా. 97

విన్నా నమ్మా నీ కథ
లెన్నో ప్రవచనము లందు యెన్నెన్నో నే
కన్నా నమ్మా మహిమలు
కన్నార్ప కుండ నిజమనగా శ్రీ మాతా.98

ఉన్నావమ్మా గుడిలో
నున్నావమ్మా  యెద యెద నున్నావమ్మా
పెన్నార్తి కను సన్నల
నున్నావంతట కనుగొనుచు శ్రీ మాతా.99

గుడిలో శిలలో విరిలో
జడిలో బడిలో యల యలజడిలో  ద్యుతిలో
యిడికను నీటను గాలిని
తొడి లేక నుందువు గురుతుగ శ్రీ మాతా.100

ఆవునమ్మా కోర్కెలు తర
గవులే యుచితా నుచితము గని నీవిమ్మా
కవినై పవినై భువిపై
రవి శశి మయూఖ మన యలరన్ శ్రీ మాతా.101

కాదమ్మా  కామాక్షీ
నీదరి చేరగ సుళువుగ నెఱ నమ్మిన వా
రే దరిశనమో దరియో
నీదయ వల నొంద గలుగు నిల శ్రీ మాతా.102

రాదమ్మా కైవల్యము
వాదోప వాదులకు యపవాదులకున్ కా
రాదని చులకన పడగను
లేదనుటే మేలు పనిలే శ్రీ మాతా.103

మాకంద ఫల రసాదుల
నానందముగా గొనుము సనాతని మృదులా
యానందమీవె నందా
మాకందరకున్ భగవతి మా శ్రీ మాతా.104

వందలు వేలుగ స్తుతులను
యెందరు జెప్పిరొ అయినను ఇప్పటి కిపుడే
కందములో జెప్ప మనిన
సుందర రాముని గని మనసున శ్రీ మాతా.105

నతిగా సన్నుతిగా మది
నతిగా తలుపక నుడివితి నమోస్తు లలితా
స్తుతి జేయుట కూర్చుటకున్
యతి స్థానము జటిలము యగు శ్రీ మాతా.106

ఎదలో తుందిల మందితి
మదిలో పలు ప్రశ్నలు యభిమానము లెగయన్
హృది మందిరమున నిన్నిడి
యిదిగో  గూర్చితి  శతకము నిటు శ్రీ మాతా.107

వెతలన్ బాపగ నిమ్మా
శ్రుతి సూక్తి నెఱుక పరచగ శుభమల నొసగన్
నతి జేయుచు నుతి జేసితి
సతి సత్యా సౌమ్య యచలజా శ్రీ మాతా.108
































Monday, May 11, 2020

  తిరోగమనం
కలిగిన కాడికి కలో గంజో
మా ఊరిలోనే మా వారితోనే
అందుకే మూటా ముల్లె సద్దేసా
ఏలికల పిలుపు కోసం
ప్రభుత్వాలు కల్పించే
ఉచిత రైలు బండి కోసం
ఎదురు చూసే ఓపిక లేక
ఆ పిలుపందే ఆశ లేక
ఆలు బిడ్డలతో అలుపెరుగని
ఆకలి పయనం మాది
సత్తువ లేకున్నా నడుస్తూనే ఉన్నాం
ధర్మాత్ములెవరైనా పట్టెడన్నం పెడితే
ఎంగిలి పడుతూ సాగిల పడుతూ
పంటి బిగువున కష్టాన్ని దిగమింగుతూ
నడుస్తున్నాం దూరాభారం ఎంతైనా
నాది ఒంటరి పయనం కాదు
వందల కొద్దీ మందల కొద్దీ ఎందరో
అందరిదీ ఒకటే లక్ష్యం
అందరిదీ అదే నిర్వేదం
అసంఘటిత కార్మిక జనం
వలస కూలీ అరణ్య రోదనం
వందల వేల మైళ్ళ దూరాలు
ఎన్నాళ్ళకు చేరేనో గమ్యాలు
నాకైతే అగమ్య గోచరాలు.
ఇదీ నా దేశంలో బడుగు జనం
దౌర్భాగ్యం నెత్తిన మోసే గుణం
తప్పెలా జరిగిందో తప్పే జరగ లేదో
అతి సామాన్యుల నడ్డి విరిచి
నడిరోడ్డున పడేసిన లాక్ డౌన్
పస్తులతో కానకళ్ళన చచ్చేకన్నా
కలిగిన కాడికి కలో.. గంజో
మా ఊరి లోనే..మా వారి తోనే
అందుకే ఈ తిరోగమనం
అందుకే మా వూరి పయనం.

Sunday, May 10, 2020


సీ.
మనిషికెన్ని వెతలు మనికికెన్ని కతలు
      నీమీద మనసుల నిలుపుటెట్లు
దినదిన గండాలు దీర్ఘాయు రన్నట్లు
      బ్రతుకు సమరమున వరలు టెట్లు
ఆపదల నడుమ ఆశల వెనుకగా
     మెలగుటే కాని నే మిగులు టెట్లు
నెమ్మది కరవయి నిమ్మళించని మది
    నిష్కామ కర్మలు నెఱపుటెట్లు
తే.గీ.
పూట గడచిన చాలు సంపూర్ణ మతిని
మాట పడకుండ బ్రతికెడు మనికి చాలు
నన్ను మన్నించవమ్మ యానందవల్లి
కంచి కామాక్షి కరుణించు కల్పవల్లి.41
సీ.
చీటికీ మాటికీ చీకాకు పరచుచూ
      విసిగించ లేను నే విసివి పోను
ఆలనా పాలనా అమ్మ! నీవే యంచు
      అనునిత్యమూ నమ్ము ఆర్భకుడను
ఆదుకో చేదుకో ఆర్యా మహాదేవి!
      నిన్ను నమ్మిన వాడ నిరతమేను
అన్నెమూ పున్నెమూ యసలేమి ఎఱుగను
       అందర్ని నమ్మేటి అధముడేను
తే.గీ.
ఆదు కోవమ్మ అభయంపు హస్తమొసగి
చేదు కోవమ్మ గోముగా చేరదీసి
నన్ను మన్నించవమ్మ యానందవల్లి
కంచి కామాక్షి కరుణించు కల్పవల్లి.42
సీ.
రారాతి దుహిత కిరాత దయిత విశ్వ
   వపుష కరుగునా యావంత మనసు
రేరేని సిగబంతి రిత్త జేసిన యింతి
   చల్లని వెన్నెలల్ జల్ల గలవె
దాదాపు నీ ప్రాపు దక్కునననుకొంటె
    దాక్షాయణీ దయ దలుప వేల
జేజేల సరములన్ చిద్రూపి కడనుంచి
     చిత్త చాంచల్యమున్ చిదుమ వేల
తే.గీ.
శివ కుటుంబిని జాగేల చింత దీర్ప
శం కరివరదా భయమీయ శంకలేల
నామనవి వినవేల యానందవల్లి
కంచి కామాక్షి కరుణించు కల్పవల్లి.43


            అమ్మ
ఎవరి అమ్మ వారికి బ్రహ్మే.
అమ్మతో కొన్ని సంఘటనలు మరచిపోలేని తీపి గురుతులు.
నేను పుట్టిన పదినెలలప్పడు వంటి నిండా కురుపులు. రసి కారేవి. ఎవరు ఎత్తుకుంటే వారికీ వచ్చేసేవి. మాతామహుల ఇంట ఆయుర్వేద వైద్యం. మంచి గుర్తింపుతో నడిచేది. అయినా ఓ సంవత్సరం పైనే ఆ కురుపులతో ఇబ్బంది పడ్డా. నాకు బాగా గుర్తు . రావికమతంలో తాతగారి ఇంటి పక్కనే ఆసుపత్రి. మామయ్య ఆయుర్వేద భిషక్ మరియు ఆర.ఎం.పి.
అక్కడకి ఓ సాయంత్రం వెళ్ళాను. మామయ్య ఇంజక్షన్ చేయడానికి సిద్ధపడ్డాడు. ఏడుస్తూ ఇంటికి పరిగెత్తా. అమ్మ ఎత్తుకుని సముదాయించింది. ఆ పరుగెత్తే సీన్ ఇంకా గురుతుంది. ఆ తరువాత ఎప్పుడో మా కలకత్తా దొడ్డ సల్ఫాన్ మేన్ పౌడరు కొబ్బరినూనె కలిపి రాయించింది. మూడురోజుల్లో కురుపులన్నీ మాయం.
రోజూ నిద్రపోయేటప్పుడు అమ్మ ఏవో కథలు చెప్పేది. ఆ తరువాత "వద్దురా పోవద్దురా  రద్దులు మనకొద్దురా" అన్న పాట పాడాకే నిద్ర.
మూడేళ్ళప్పుడు నాన్నగారి తో పచార్లు తిరుగుతూ నేర్చుకున్న కృష్ణ శతకం పద్యాలు అమ్మ అప్పచెప్పించుకునేది. అప్పుడే ఓ సారి మా అక్క పావడా నీలిరంగుది వేసి జాకెట్టు వేసి బడికి పంపింది నాన్నగారి దగ్గరకు. అందరూ మా అక్కే అనుకున్నారు. ఒక్క సారి నాన్నగారికి కనిపించి ఇంటికి పరుగో పరుగు. ఆ పరుగూ ఆ డ్రస్సూ ఇంకా గురుతే.
అక్షరాభ్యాసం అయ్యాక ఓ రోజు ఎండలో ఇసక పోసి అఆఇఈలు దిద్దిస్తోంది అమ్మ. ఇంతలో నాన్నగారు బడినుంచి వచ్చారు. అమ్మని కసురుకున్నారు. ఆ ఎండలో అక్షరాలు దిద్దడం ఇంకా గురుతే. అప్పుడు అక్షరాలు సుద్దముక్కతో అరుగు మీద వ్రాసి చింత పిక్కలు పేర్పించేవారు. ఆ తరువాత అక్షరాలు రాసి ఇవ్వకుండా నే చింతపిక్కలు పేర్చమనేవారు. మొత్తానికి ఆ రకంగా అక్షరాలు నేర్చుకున్నా.
ఒక సంవత్సరం లోనే ఒకటి రెండో తరగతులు అయిపోయాయి. మరుసటేడు. మూడు నాలుగూ అవగొట్టేసా. అన్నీ ఇంటి దగ్గరే. అమ్మ దగ్గరే. అయిదో తరగతి పూర్తిగా ఓ సంవత్సరం బడికి వెళ్ళి చదివా.
మాకు దగ్గరలో హైస్కూలు లేక మా అన్నయ్య తాతగారింట ఉండి చదువుకోవడానికి ఏర్పాటు చేస్తే వాడికి టైఫాయిడ్ వచ్చి ఇంటికి వచ్ఛేసాడు.
1963 వేసవి శలవుులకు కోటనందూరులో కాపురం. నేమాని వారింట వసతి. ఇంటూ. ఫస్ట్ ఫారం పరీక్ష కి తయారవడం. ఆ ఎత్తరుగుల మీద కూర్చుని చదువుకోవడం ఇంకా గురుతే.
అప్పటికి నాకు తొమ్మిది సంవత్సరాల వయసు.
నేను మా అక్క మా అన్న ముగ్గురం ఆరో తరగతిలో చేరాం. ఆప్పటికి నాకు
భాగవతంలో పద్యాలు మా అమ్మ చాలా నేర్పింది. ఏ పద్యం అడిగినా చెప్పాలి. అదే ఆట నాకు.
కార్తీకమాసం లో తెల్లవారుజామున ఏటికి స్నానికి నలుగురైదుగురు ఆడవాళ్లు మా అమ్మ. కలిసి వెళ్ళేవారు. లాంతరు పట్టుకుని తోడు వెళ్ళడడం నా డ్యూటీ. వాళ్ళ పని అయిపోగానే నేనూ స్నానం చేసి ఓ దీపం నీటిలో వదిలి ఇంటికి రావడం. అలా ఆరేళ్ళు చేసా.
తొమ్మిదో తరగతిలోకి వచ్చేసరికి రోజూ స్నానం చేసాక అమ్మతో కలిసి పే..ద్ద గొంతుపెట్టి వేంకటేశ్వర సుప్రభాతం మంగళ హారతి చదివే వాడిని.
వంటల్లో కూడా ఆమ్మ నన్నే పిలిచేది. మడి వంటకి ఆడపిల్లలు తడిబట్టలతో ఉండలేరని. నా పెళ్ళి అయిన తర్వాత కూడా ఓ సారి వినాయక చవితికి తుని వచ్చిం బొంబాయి నుంచి. ఆ రోజూ నేనే. మడికట్టుకుని వంట లో సాయం చేసా అమ్మకు.
అలా అమ్మతో ఎన్నో ఎన్నెన్నో అనుభూతులు జ్ఞాపకాలు.
అలా నన్ను తీర్చి దిద్దిన మాతృమూర్తికి జేజేలు.

Saturday, May 9, 2020


అమ్మా నీ కళ్ళలోకి చూస్తూ
నెలల బిడ్డగా వెన్నెల చూస్తూ
అఆ..ఇఈ.ఉఊ..అంటూ నవ్వా
అమ్మా అంటూ తొలి మాటను. పలికా //   //
నీ ఒడిలో ఆదమరచి నిదరోయా
ఆ ఒరవడిలో కళ్ళతోనె ఊసాడా
నీవే సర్వస్వంగా తలపోసా
నీ కొంగు పట్టుకుని తిరిగా
నీ గోరుముద్దలే అమృతంగా
నీ జోల పాటలే కర్ణామృతంగా
పెరిగానమ్మా ఇదిగో ఇలా ఉన్నానమ్మా //   //
బడికి పంపినపుడు వెక్కివెక్కి ఏడ్చానే
కాలేజీకి పంపలేనపుడూ ఏడ్చానే
ఉపాధి కోసం వలసబాటలో ఏడ్చా
ఉన్నంతలో తీర్థ యాత్రలెన్నో చేయించా
మూడు ముళ్ళు వేసాకే నిన్ను కాస్త మరిచా//   //
మాయ రోగం నీ కొచ్చినపుడు
నిన్నంటి పెట్టుకు నిలిచానే
ఋణం తీరిపోయే క్షణం
ఎందుకో దూరమైపోయానే
నీవిచ్చిన సంపదే నా నోటి తెలుగు
నువు నేర్పిన ప్రణతే నా భగవత్సేవ
అందుకే అమ్మా నీకు వందనం
అమ్మా నీకిదే సాష్టాంగ ప్రణామం.//   //

Friday, May 8, 2020


సీ.
గోవునైనను గాక పోతిని నోరార
      అంబా రవమ్మునే యనుచు మిగుల
రాయినైనా గాక పోతిని నీరూప
    మపురూప మౌనట్లు మలచ బడగ
పూవునైనా గాక పోతిని నీ పాద
    కమల సేవకే తుది గమనమనగ
సుజలమైనా గాక పోతిని నీ కభి
     షేక జలముగా గాసేపు నిలువ
తే.గీ.
విలువ లేని యీ బ్రతుకు నీ వీయనేల
కలిమి లేముల నడుమ నే కనల నేల
నా వినతి వినవేల యానందవల్లి
కంచి కామాక్షి కరుణించు కల్పవల్లి.39

సీ.
ఈతి బాధల మధ్య నిష్కామ యోగాన
     నిరతమ్ము నిరతిగా నేగు టెట్లు
ఆలు బిడ్డల మధ్య యనవరతము నిన్ను
     తలచు టెట్లు సతమత మగు టెట్లు
లోటు పాటుల మధ్య నీ సేవ కంకిత
    మగుటెట్లు మనసట్లు మనుచు టెట్లు
ఆటు పోటుల మధ్య  యారాట పడుటెట్లు
    యార్తితో కొలుచుచు యడుగు టెట్లు
తే.గీ.
ఇంత యాతనా భరితమౌ యిహమునందు
నిత్య సమరమునందు నే నెగ్గుటెట్లు
నన్ను ఉద్ధరించవటె యానంద వల్లి
కంచి కామాక్షి కరుణించు కల్పవల్లి.40

Thursday, May 7, 2020

తే.గీ.
వలదు లెండి వూరడి నొప్పు పలుకరింత
కలదు లెండి గుండె దిటవు కరుగకుండ
లేదు లెండి విధి నెదిర్చు లేకి బుద్ధి
ఉన్న దొక్కటే కన్నీటి ఉంకు వగుచు.

వగవ మీకేల మా యన్న వరము లీయ
చచ్చినోరికి కోటియే చచ్చిపోమ?
బ్రతికితే యంత సాధించు భ్రాంతి లేదు
చావు బ్రతుకుల మేలేదొ చాటరయ్య.

వెరచి కార్చడే కన్నీటి బిందువేని
కలసి యోదార్చడే కొంత కడుపు నిండ
నిలచి మాతోటి నింపాది నిచ్చు వరకు
మరువ లేదు విశాఖ ముమ్మాటి కెపుడు.

Monday, May 4, 2020

నేనూ.. నా దేశం
మందు మత్తులో చిత్తైనా
విత్త భ్రాంతితో ముద్దైనా
అకుంఠిత దీక్షతో సాగుతాం
అవనత వదనంతో తిరిగొస్తాం. // నేను//

మందు బుడ్డియే జనతకు అమృత కలశం
రొక్కం దక్కే దోవే ప్రభుతకు పరవశం
పరువపు బిగిలో వనితలు కూడా
మందు వరుసలో ముందే ఉండే
ఈమందేదో ఇంటింటికీ పంపిస్తే
ఆ కామందులకే ఓటేస్తాం
ఆ కామాంధులనే గెలిపిస్తాం. //నేను //

మందు చూపేగాని
ముందు చూపే లేని
మా నేతలకు నమో నమో
పుస్తెలమ్మకునైనా పులసల కోసం
పస్తులుంటున్నా ఈ మందు కోసం
ఎగబడతాం గంటల కొద్దీ నిలబడతాం
కాదంటే ఊరుకోం తిరగబడతాం. //నేను //

Sunday, May 3, 2020


అవును
 నాన్న గొంతు మూగబోయింది
అమ్మే యింకా కాస్త నయం
ఆరుపదుల వయసు దాటాక
సంతానం సంపాదనలో పడ్డాక
సంసార భారం తరం మారాక
నిజంగానే
నాన్నగొంతు మూగబోయింది
అమ్మే యింకా కాస్త నయం
ఇప్పుడు
 నాన్నవన్నీ ఛాదస్తపు మాటలే
నాన్నకివేమీ మింగుడు పడవులే
పంచమి నాడు మంచిదన్నా తప్పే
మంచము మీద బువ్వ తినరాదన్నా తప్పే
ఉదయాస్తమాన సంధ్యా పూజలు తప్పే
హృదయాంతరంగ నామస్మరణా తప్పే
ఎందుకో
నాన్నగొంతు మూగబోయింది
అమ్మే ఇంకా కాస్త నయం
ఏదైనా కోరి తిందామన్నా తప్పే
ఎందుకులే నాకొద్దు అన్నా తప్పే
అలా కాలక్షేపానికి తిరిగొస్తానన్నా తప్పే
ఇంట్లోనే పడి ఉంటానన్నా తప్పే
మద్యాహ్నం నడుం వాల్చనన్నా తప్పే
రాతిరి పెందలాడే పడుక్కున్నా తప్పే
తెల్లవారకముందే నిద్ర లేచినా తప్పే
అందుకే
నాన్న గొంతు మూగబోయింది
అమ్మే ఇంకా కాస్త నయం

Friday, May 1, 2020


కొలిమి లో కాలిన చువ్వను నేను
సమ్మెట పోటులకు సాగి సాగి
కమ్మరీడు చేతిలో మలచబడ్డ
పలుగును స్వేద బిందువును నేను
నా స్వేదం నిర్వేదం కాదోయ్
నా వాదం సంవాదం కాదోయ్
ఎలుగెత్తి చెప్పలేక పోతున్నా
పలుగెత్తి బరువెత్తి చూపుతున్నా
కార్మిక కర్షక బహుజన హితైషిని
ధార్మిక ఆస్తిక జీవన పిపాసిని
శ్రమయేవ జయతే అని నమ్మిన
కర్మచారిని ఓ బాటసారిని
నా దేశం భవిత ఎక్కడుందీ అంటే
కూలివాని కండల్లో కర్మచారి చెమటల్లో
అలుపెరుగని రైతుల అరచేతిలో
ఆర్థికవేత్తల మించిన అతివల చేతుల్లో
అని ఎలుగెత్తి చెబుతున్నా.