Sunday, June 19, 2022

మా నాన్న

      నాన్న

ఈ నా రూపానికి బీజం నాటింది నాన్న

ప్రజాపతికార్యంగా బీజవ్యాప్తికి నాందీ నాన్న

పసికూనగ గుండెలపై తంతుంటే ఆనందించేది నాన్న

తప్పటడుగులు సరిచేస్తూ నడిపించేది నాన్న

మాటలలో తొట్రుబాటు లేకుండా చేసేది నాన్న

ఒడిలో ఉంచుకుని ఓనమాలు దిద్దించేది నాన్న

పద్యాలు శ్లోకాలు భక్తిభావాలు అలవరిచేది నాన్న

వంటింట్లో అమ్మకి వీధిగుమ్మంలో తనకూ సాయపడేలా చేసేది నాన్న

మంచి చదువరిగా గడుసరిగా తీర్చిదిద్దేది నాన్న

తనకంటే ఉన్నతంగా ఉంచాలని శ్రమించేది నాన్న

బ్రహ్మోపదేశంతో సన్మార్గంలో నడిపించేది నాన్న

ప్రయోజకులైతే పుత్రో/పుత్రికోత్సాహంతో మైమరచేది నాన్న

త్యాగాలు భారాలు బాధ్యతలనూ మోసేది నాన్న

మనుమలతో మాటామంతీకన్నా మించింది లేదనేది నాన్న

ముదిమి వయసులో మౌనంగా నిర్లిప్తంగా మిగిలేది నాన్న

నాన్నంటే అందరికన్నా అన్నులమిన్న.



0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home