Monday, May 9, 2022

మదాలస జోలపాట

 మదాలస జోలపాట


సం.

శుద్ధోఽసి బుద్ధోఽసి నిరంజనోఽసి

సంసారమాయా పరివర్జితోఽసి

సంసారస్వప్నం త్యజ మోహనిద్రాం

మందాలసోల్లపమువాచ పుత్రమ్౹౹౧

తె.

శుద్ధుండ బుద్ధుండ నిరంజనుండ

సంసారమాయా పరివర్జితుండ

సంసార స్వప్నం విడు మోహనిద్రా

మదాలసామాటలు నమ్ము పుత్రా. 1

సం.

శుద్ధోఽసి రే!తాత నతోఽస్తి నామ

కృతం హి తత్కల్పనయాధునైవ

పంచాత్మకం దేహం ఇదం నతేఽస్తి

నైవాస్య త్వం రోదిషి కస్య హేతో౹౹౨

తె

శుద్ధుండ నీకేలని పెట్దు పేరు

పేరన్నదో కల్పనరా సుతుండ

ఈ పంచ తత్త్వాత్మకదేహ మేమి

అంచేత రోదించ పనేమి పుత్ర? 2

సం.

నా వై భవాన్ రోదితి విశ్వజన్మ

శబ్దోయ మాయాధ్య మహేశ సునుమ్

వికల్పయమానో వివిధైర్గుణైస్తే

గుణాశ్చ భౌతాః సకలేంద్రియేషు౹౹ ౩

తె.

విశ్వంబు రోదించదు జన్మవల్ల

మాటల్ల మాయా ఇదియంత రాజ!

నానా గుణాలన్ని వికల్పమేర

భూతాత్మకమ్మే సకలేంద్రియాలు. 3

సం౹౹

భూతాని భూతైః పరిదుర్బలాని 

వృద్ధిం సమాయాతి యదేహ పుంసః

అన్నాంబు పానాదిభిరేవ తస్మాత్

నా తేతి వృద్ధిర్ న చ తేస్తి హానిః౹౹ ౪

తె.

భూతాలు భూతాలతొ కూడి వీడ

వృద్ధిక్షయాలన్నియు మేనికౌను

అన్నమ్ము తోయమ్ములె హేతువౌను

ఏ వృద్ధి లేదే క్షయమేది లేదే. 4


సం౹౹

త్వం కంచుకే శీర్యమాణే నిజోస్మిన్

తస్మిన్ దేహే మూఢతాం మా వ్రజేథాః

శుభాశుభౌః కర్మభిర్దేహమేతత్

మృదాదిభిః కంచుకస్తే పినద్ధః౹౹ ౫

తె.

జీర్ణించు నీ కంచుక దేహమేను

ఆ దేహ మీవే యని మూఢులండ్రు

కర్మానుసారం చెడు మంచికల్గు

ఈ కంచుకం కూడ మృత్తికేను. 5


సం౹౹

తాతేతి కించిత్ తనయేతి కించిత్

అంబేతి కించిత్ ధయితేతి కించిత్

మామేతి కించిత్ న మమేతి కించిత్

త్వం భూతసంఘం బహు మ నయేథాః౹౹ ౬

తె.

తండ్రంచు యన్నా సుతుడంచు యన్నా

అమ్మంచు యన్నా సతియంచు యన్నా

మావాళ్ళె యన్నా పరులంచు యన్నా

మీరంత భూతాత్మక ప్రోగులంటా. 6

సం౹౹

సుఖాని దుఃఖోపశమాయ భోగాన్

సుఖాయ జానాతి విమూఢచేతాః

తన్యేవ దుఃఖాని పునః సుఖాని

జానాతి విద్ధనమూఢచేతాః౹౹ ౭

తె.

సౌఖ్యాలు దుఃఖోపశమాలు భోగాల్

కాబోవు సత్యాలు బహు మొద్దుకైనా

ఆ బాధలే సౌఖ్యము లౌను మళ్ళీ

అట్లంచు తెల్వంగను లేరు వారు. 7

సం౹౹

యానం చిత్తౌ తత్ర గతశ్చ దేహో 

దేహోపి చాన్యః పురుషో నివిష్టః

మమత్వ మురోయా న యథ తథాస్మిన్

దేహేతి మంత్రం బత మూఢరౌష౹౹ ౭

తె.

త్రోలేది చిత్తంబటు పోవు మేను

నీ మేను వేరే నడిపించు నాత్మే

నాదంచు వాదించు టదేల నీకు

దేహమ్మె నేనంచను మూఢుడేను. 8

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home