Wednesday, February 9, 2022

 

అపరాధాధికముల్ యొనర్చినను యమ్మై కాచుటే ధర్మమౌ

కపట మ్మెంచని తల్లి ప్రేమక దలంకారమ్ము గాదే? శివే

యపరాధంబులు జేస్తి నంచు నను ముక్తాలంకృతున్ జేతువే

యుపవేష్టుండను నీ యుపాసనల సాయుజ్యంబు నాకీయవే?

సీ.

ఈతి బాధలమధ్య యిడుములన్నిటి మధ్య

         నేరీతి తృప్తిగా నిన్ను గొలుతు?

ఇక్కట్ల లోనుండ నీసురోమని యుండ

        నేరీతి హాయిగా నిన్ను గొలుతు?

నికృష్ట భాగ్యాన నిర్దుష్ట సమయాన

       నిశ్చింతగా నెట్లు నిన్ను గొలుతు?

అవరోధ మార్గాల నపరాధ భావాల

       నియతితో నేనెట్లు నిన్ను గొలుతు?

తే.గీ.

మనసు నీపైన కుదురుగా మలచు టెట్లు?

ప్రణతి యొనరించి నేనెట్లు ప్రణుతి జేతు?

వల్ల కాదని నీ సేవ బాయు టెట్లు?

ఆదరించవె జనని నన్నాదుకోవె?


1. గుడి బాగుపడాలా? అతను బాగుపడాలా?

దేవుడికి పస్తు అతనికి మస్తు

అమ్మవారికి గౌను ?

వచ్చిన ఆదాయంలో అయను మహా అయితే దీపానికి నూనె కొంటాడేమో

శివరాత్రి కి వచ్చిన డబ్బులలో ఏడెనిమిది వేలు ఇచ్చుకోవాలా?

 వాళ్ళు ఓనర్లా?

వచ్చిన పని చూసుకు పోవాలిగాని మిగతావి నీకెందుకు అంటాడా?

గత రెండేళ్లుగా వచ్చిన డబ్బులు ఏమయ్యాయి

ఓ పంతులు గారిని పెట్టి రోజూ అభిషేకం చేసేలా చూడాలి

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home