Wednesday, February 9, 2022

గతిస్త్వం

  గతిస్త్వం

భుజంగప్రయాతం:

ఉదాసీన మేలా మహోదార శీలా

సదానంద కారీ విశాలాక్షి నీవే

హృదాకాశ దేవీ సుహృద్భావ రూపీ

మిదానీం గతిస్త్వం త్వమేకా భవానీమ్.


ఉపాసింప నిన్నున్ సముల్లాస మీవే

కృపాసింధు వంచున్ సుకృత్సేవ జేతున్

జపో జల్పమంచున్ విచారించ కీవే

మపారం గతిస్త్వం త్వమేకా భవానీమ్.


సుతార మ్మదేలా యశోభూషణాంగీ

కృతార్థుండ గానే యదృష్ఠమ్ము రాదే

ప్లుతా మార్గ మీవే నభో వీధి నాకున్

మతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవానీమ్.

ప్రతిద్వంద్వ భావం అప్రాప్యాను సారం

చితాభస్మ లేపం సుశీతం మనోజ్ఞం

కృతిర్భర్తృ మోహం సకృ ద్దర్శనాఢ్యం

మతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవానీమ్.

చిదానంద రూపం విచిత్రాంతరంగం

ముదానన్య కారం సముల్లాస హాసం

దదాతాభిలాషం  సుదార్ఢ్యాతి రేకం

సదామాం గతిస్త్వం త్వమేకా భవానీమ్.



0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home