Saturday, February 5, 2022

శారదా దయలు

 ఉ.

శారద రాత్రులన్ ధవళ చంద్రికలన్ పసివారమై మహా

తారల గుంపులన్ కనుచు దాన విశేషము లేమి తెల్పు మం

చారడి జేసి కొన్ని విన జాలిన భాగ్యము నాది యందులో

శారద నీరదేందు మనసారగ నేర్చిన పద్యమయ్యెడిన్.

ఉ.

శారద చంద్రికా నిశల చాల కవిత్వ ప్రసంగముల్ వినం

గా రహి మించ నేర్చితిని కాసిని పద్యసుమమ్ములన్ యటుల్

గారవ మెక్కుడై చదువగా నుసిగొల్పెను గొన్ని కావ్యముల్

యారయ శారదా దయల నాపయి మా తలిదండ్రు లాశలన్.

ఉ.


పూత మెఱంగు పిందియను ఫుల్ల సరోజ ప్రసూన బాలికా


వ్రాతము లెగ్గు జేసినను వారిధరమ్ముల నూహ సాగెడున్


చూత ఫలావతంసమను చోద్యము గా నను జూచుటేల లే


లేత కవిత్వ తత్వమిది లేవిడి లెత్తుట మీకు భావ్యమే?


0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home