Tuesday, February 1, 2022

రాజ శ్యామలా

చం.

మరకత శ్యామలా దయలు మంజుల వాగ్విభవమ్ములన్ సదా

కురియగ జేయుమీ పరుల! ఘోర విపత్కర కాలమందు నా

దరముగ నీ కృపారస సుధారస   సారము మిక్కుటమ్ముగా

స్ఫురదరుణా విలాసముల సుంత వరమ్ముల రాజ శ్యామలా.

చం.

స్ఫురదరుణాంశు పుంజములు స్ఫోరణ తోరణ వారణమ్ములై

కర మనురక్తి గొల్పగ మఘా సహచర్యపు యమృతాంశు శీ

కర విలసత్ ఝరీ హొయల కాయ మొకించుక వెచ్చ నూర్చుచో

స్మరవరదాయి! నిన్ కొలతు మన్మనమందున రాజ శ్యామలా.

ఉ.

నీ మఘ మందునన్ సమిధ నే నగుచున్ నశియించు భాగ్యమే

నా మన సెక్కుడంచు కరుణాలయ నీ వరమంచు గైకొనున్

శ్యామ వరేణ్య! నీ విమల యామల తంత్రముగా తలంచెదన్

రామ నికుంజమీ హృది విరామము నొందుమి రాజ శ్యామలా.



0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home