Sunday, August 14, 2022

ఇదేనా నవభారతం?

       ఇదేనా నవభారతం?

దేశం కోసం

 దాస్యశృంఖలావిముక్తి కోసం

పల్లెపట్టున స్వాతంత్ర్యేచ్ఛను రగిలించిన

ఆహితాగ్న్యులు అగ్రహారీకులు ఎందరో

వీధిబడులతో అక్కరాలను అక్కరకు తెచ్చిన

అయ్యవార్లు ఇంకెందరో

తెల్లదొరలు పొలిమేరలు దాటేవరకూ

ప్రతియింటా ఉద్యమస్ఫూర్తితో రాట్నం వడికించిన

ఖద్దరు పంతుళ్ళెందరో

ఏరీ? వారేరీ? వారివారేరీ?

స్వాతంత్ర్యం వచ్చాక

 సరికొత్త నాయకులు పుట్టుకొచ్చాక

అగ్రహారాలు ఆవిరైపోయాక

ఈనాం చట్టంతో ఉన్న మడిచెక్కలు పోయాక

పొట్టకూటికోసం 

బ్రతుకుతెరువు కోసం

పట్నంబాట పట్టాల్సిన దౌర్భాగ్యం

ఎందరి నెత్తినో నిప్పులు పోసిన వైనం

ఱెక్కాడితేగాని డొక్కాడని దైన్యం

 వారికి  స్వాతంత్ర్యం  ఉన్నది ఊడగొట్టింది.

ప్రజాసేవ పేరుతో రాబందుల రాజ్యం వచ్చింది.

అల్పసంఖ్యాక కులాలు క్రమేపీ

పల్లెపట్టు విడిచి వలసపొయాక

కులాల కుమ్ములాటలు పెచ్చుమీరి

చేవున్నవారంతా పట్నాలకు

గతిలేనివారంతా పల్లెలకూ

పరిమితం

 ఇదేనా మన హితం?

ఇదేనా నవభారతం?


Sunday, June 19, 2022

మా నాన్న

      నాన్న

ఈ నా రూపానికి బీజం నాటింది నాన్న

ప్రజాపతికార్యంగా బీజవ్యాప్తికి నాందీ నాన్న

పసికూనగ గుండెలపై తంతుంటే ఆనందించేది నాన్న

తప్పటడుగులు సరిచేస్తూ నడిపించేది నాన్న

మాటలలో తొట్రుబాటు లేకుండా చేసేది నాన్న

ఒడిలో ఉంచుకుని ఓనమాలు దిద్దించేది నాన్న

పద్యాలు శ్లోకాలు భక్తిభావాలు అలవరిచేది నాన్న

వంటింట్లో అమ్మకి వీధిగుమ్మంలో తనకూ సాయపడేలా చేసేది నాన్న

మంచి చదువరిగా గడుసరిగా తీర్చిదిద్దేది నాన్న

తనకంటే ఉన్నతంగా ఉంచాలని శ్రమించేది నాన్న

బ్రహ్మోపదేశంతో సన్మార్గంలో నడిపించేది నాన్న

ప్రయోజకులైతే పుత్రో/పుత్రికోత్సాహంతో మైమరచేది నాన్న

త్యాగాలు భారాలు బాధ్యతలనూ మోసేది నాన్న

మనుమలతో మాటామంతీకన్నా మించింది లేదనేది నాన్న

ముదిమి వయసులో మౌనంగా నిర్లిప్తంగా మిగిలేది నాన్న

నాన్నంటే అందరికన్నా అన్నులమిన్న.



Friday, June 17, 2022

 కం.

ఉంటే నీవెంటన్ జా

లుంటే నీపాదమంటి లోలోనన్ నిన్

గంటే చాలున్ నా మా

టల్వింటేజాలదే కటా! ఓ బ్రాహ్మీ!

Monday, May 9, 2022

మదాలస జోలపాట

 మదాలస జోలపాట


సం.

శుద్ధోఽసి బుద్ధోఽసి నిరంజనోఽసి

సంసారమాయా పరివర్జితోఽసి

సంసారస్వప్నం త్యజ మోహనిద్రాం

మందాలసోల్లపమువాచ పుత్రమ్౹౹౧

తె.

శుద్ధుండ బుద్ధుండ నిరంజనుండ

సంసారమాయా పరివర్జితుండ

సంసార స్వప్నం విడు మోహనిద్రా

మదాలసామాటలు నమ్ము పుత్రా. 1

సం.

శుద్ధోఽసి రే!తాత నతోఽస్తి నామ

కృతం హి తత్కల్పనయాధునైవ

పంచాత్మకం దేహం ఇదం నతేఽస్తి

నైవాస్య త్వం రోదిషి కస్య హేతో౹౹౨

తె

శుద్ధుండ నీకేలని పెట్దు పేరు

పేరన్నదో కల్పనరా సుతుండ

ఈ పంచ తత్త్వాత్మకదేహ మేమి

అంచేత రోదించ పనేమి పుత్ర? 2

సం.

నా వై భవాన్ రోదితి విశ్వజన్మ

శబ్దోయ మాయాధ్య మహేశ సునుమ్

వికల్పయమానో వివిధైర్గుణైస్తే

గుణాశ్చ భౌతాః సకలేంద్రియేషు౹౹ ౩

తె.

విశ్వంబు రోదించదు జన్మవల్ల

మాటల్ల మాయా ఇదియంత రాజ!

నానా గుణాలన్ని వికల్పమేర

భూతాత్మకమ్మే సకలేంద్రియాలు. 3

సం౹౹

భూతాని భూతైః పరిదుర్బలాని 

వృద్ధిం సమాయాతి యదేహ పుంసః

అన్నాంబు పానాదిభిరేవ తస్మాత్

నా తేతి వృద్ధిర్ న చ తేస్తి హానిః౹౹ ౪

తె.

భూతాలు భూతాలతొ కూడి వీడ

వృద్ధిక్షయాలన్నియు మేనికౌను

అన్నమ్ము తోయమ్ములె హేతువౌను

ఏ వృద్ధి లేదే క్షయమేది లేదే. 4


సం౹౹

త్వం కంచుకే శీర్యమాణే నిజోస్మిన్

తస్మిన్ దేహే మూఢతాం మా వ్రజేథాః

శుభాశుభౌః కర్మభిర్దేహమేతత్

మృదాదిభిః కంచుకస్తే పినద్ధః౹౹ ౫

తె.

జీర్ణించు నీ కంచుక దేహమేను

ఆ దేహ మీవే యని మూఢులండ్రు

కర్మానుసారం చెడు మంచికల్గు

ఈ కంచుకం కూడ మృత్తికేను. 5


సం౹౹

తాతేతి కించిత్ తనయేతి కించిత్

అంబేతి కించిత్ ధయితేతి కించిత్

మామేతి కించిత్ న మమేతి కించిత్

త్వం భూతసంఘం బహు మ నయేథాః౹౹ ౬

తె.

తండ్రంచు యన్నా సుతుడంచు యన్నా

అమ్మంచు యన్నా సతియంచు యన్నా

మావాళ్ళె యన్నా పరులంచు యన్నా

మీరంత భూతాత్మక ప్రోగులంటా. 6

సం౹౹

సుఖాని దుఃఖోపశమాయ భోగాన్

సుఖాయ జానాతి విమూఢచేతాః

తన్యేవ దుఃఖాని పునః సుఖాని

జానాతి విద్ధనమూఢచేతాః౹౹ ౭

తె.

సౌఖ్యాలు దుఃఖోపశమాలు భోగాల్

కాబోవు సత్యాలు బహు మొద్దుకైనా

ఆ బాధలే సౌఖ్యము లౌను మళ్ళీ

అట్లంచు తెల్వంగను లేరు వారు. 7

సం౹౹

యానం చిత్తౌ తత్ర గతశ్చ దేహో 

దేహోపి చాన్యః పురుషో నివిష్టః

మమత్వ మురోయా న యథ తథాస్మిన్

దేహేతి మంత్రం బత మూఢరౌష౹౹ ౭

తె.

త్రోలేది చిత్తంబటు పోవు మేను

నీ మేను వేరే నడిపించు నాత్మే

నాదంచు వాదించు టదేల నీకు

దేహమ్మె నేనంచను మూఢుడేను. 8

Saturday, April 16, 2022

త్వం వా కోఽపి

 శా.

ఏకామ్రేశ్వర నాయికా! శుభకరీ! యిష్టార్థసంధాయినీ!

శ్యామా! శారదచంద్రికాద్యుతినిభా మత్హృత్సరోజాసనా

శ్రోతవ్యం మమ విన్నపం యచలజా! యోగీంద్రసంసేవితా

త్వం వా కోఽపి సమర్థమంబ! దయయా త్రాతుం ముదా మీశ్వరీ౹౹ ౧

అంబా! శ్రీ లలితా! సదా తవపదామారాధనా సేవకం

కించిత్ సాదర వీక్షణేన మమ తాపస్సర్వమేతత్ క్షణం

యదృశ్యో యతి సంభవేత్ పరిణతా కారుణ్య మీడే శివే!

త్వం వా కోఽపి సమర్థమంబ! కృపయా త్రాతుం ముదా మీశ్వరీ౹౹ ౨

భావాభావ సమస్తమున్ తవ దయా సంభావ్య మంబా! పరా!

అర్థానర్థ సమీకృతమ్  తవ కృపా సాకల్య మేతత్ఫలం

శ్రీ చక్రార్చన సేవమేవ రనిశం ఆకాంక్షితమ్ భార్గవీ!

త్వం వా కోఽపి సమర్థమంబ! దయయా త్రాతుం ముదా మీశ్వరీ౹౹ ౩

భక్తాభీష్టప్రదా! సనాతని యుమా! కారుణ్యకూలంకషా!

భక్తానామనిశం కృపా లహరి యానందాంబుధే ద్యోతనీమ్

దక్షేత్రాతు సుతుం  భగవతీ! దాక్షాయణీ! శాంకరీ!

త్వం వా కోఽపి సమర్థమంబ! దయయా త్రాతుం ముదా మీశ్వరీ౹౹౪

శా.

నానా జీవన వేదనామితి సమారోహం యనాలోచితం

సంసారాంబుధి లాహిరీం చలన ముద్విగ్నే ప్రయాణం మనో

దౌర్బల్యం కృపయా నివారయతు మా! దాక్షాయణీ శంకరీ

త్వం వా కోఽపి సమర్థమంబ? దయయా త్రాతుం ముదామీశ్వరీ౹౹౫

శా.

రాకాచంద్రనిభాననా! యనల ప్రత్యూషేందు నేత్రోజ్వలా!

భక్తాభీష్టప్రదా!సదా శుభకరీ! కామేశ్వరీ! శంకరీ!

శైలేయీ! యవధారయంతు మమ విజ్ఞప్త్యేకమేవం శివే

త్వంవా కోఽపి సమర్థమంబ! కృపయా త్రాతుం ముదామీశ్వరీ౹౹౬

శా.

ఆలంబం బృహదేవ వాంఛితమహో దాక్షాయణీ! నాన్యథా

సంసారార్ణవ లంఘనో జనని! దుస్సాధ్యం దధాతీప్సితం

సాయుజ్యం  చ పరాపరం కిమలసత్వం మార్గాంతరం కిం శివే?

త్వంవా కోఽపి సమర్థమంబ? కృపయా త్రాతుం ముదామీశ్వరీ౹౹౭

శా.

లీలామానుషరూపదివ్యవనితాసాదృశ్యశాతోదరీ!

కేలీలోలవిలోలవిశ్వజననీ! కామేశ్వరీ! శాంకరీ!

ఆలోకస్య సమస్త దుఃఖ శమనం ప్రాప్యం ముదాం సంపదాం

త్వంవా కోఽపి సమర్థమంబ? కృపయా త్రాతుం ముదామీశ్వరీ౹౹౮

శా.

జ్ఞాతవ్యం మమ క్లిష్ట క్లేశసకలం జ్ఞానేశ్వరీ! దధాతీప్సితం

శ్రోతవ్యం మమ విన్నపం శిఖరిణీ! శుష్కాపనిందాపహా

గంతవ్యం మమ యోగ్యతానుసరణం కామేశ్వరీ! శంకరీ!

క్షంతవ్యం మమ హేయకర్మ సకలం కాత్యాయనీసేవకం

చింతాక్రాంతమనోవిహ్వలశమనం కుర్యాదనంతా! పరా!