Tuesday, February 8, 2022

దేవుడే దిక్కు మాకు

 

సీ.

దిక్కుమాలిన వార్కి దిక్కెవ్వరే మాకు?

        దేవుడే నిజముగా దిక్కు మాకు

దీనులై మసలంగ దిక్కెవ్వరే మాకు?

          దేవుడే యసలైన దిక్కు మాకు

దినదిన గండాన దిక్కెవ్వరే మాకు?

           దేవుడే కనరాని దిక్కు మాకు

తిమిర సంహరమందు దిక్కెవ్వరే మాకు?

           దేవుడే కొండంత దిక్కు మాకు

తే.గీ.

అమ్మ! ఆరేడు వయసులో యలసిపోక

పర సుఖానంద మవధిగా పరితపించు

దెసల, దిక్కెవ్వరే మాకు? దీన బంధు!

దేవుడా పరమాత్ముడే దిక్కు మాకు.

సీ.

దివిటీల వెలుగులో దిక్కెవ్వరే మాకు?

        దేవుడే యపుడప్డు దిక్కుమాకు

తీరు మారని వార్కి, దిక్కెవ్వరే మాకు?

        దేవుడే యెట్లైన దిక్కు మాకు

దేహి యనని వార్కి, దిక్కెవ్వరే మాకు?

        దేవుడే చక్కన్ని దిక్కు మాకు

తేట తెనుగు వార్కి, దిక్కెవ్వరే మాకు

       దేవుడే కడకంట దిక్కు మాకు

తే.గీ.

అమ్మ!  యాటు పోటులఁ బ్రతుకంత బ్రతుక

అలసి సొలసిన మాకు ఏ యండ గలదు?

ధిషణ! దిక్కెవ్వరే మాకు? దివ్య చరిత!

దేవదేవుడే దిటవైన దిక్కు మాకు.




0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home