Monday, October 29, 2018

శిఖరిణీ వృత్తం:
అమేయానందంబున్ చదిరవదనా! నాకొసగవే
ఉమాపుత్రా! నీవే సులభ కవితా పుష్టి నిడుమా
సమర్థారామంబౌ శిఖరిణి సుహస్తం బగుచు భూ
తమాతా పుత్రా!సంతత చతురతంతా యొసగుమా .
ఉదారంగా పారాయణి శిఖరిణిన్ ఉత్తమ కళా
నిదానంబీవా యో బుధజననుతా నీ కరుణచే
మదాసక్తంబౌ నాశతకము నికన్ మంజులముగా
సదామోదంబౌనట్లు తెలుగొనరించం గలుగనే.

మనోభీష్టంబై నా స్తుతి మహిత కామాక్షి వరమై
తెనుంగున్ జేతున్ మూక కవి మది నా తెల్సిన విధిన్
యనేకానేకుల్ శ్రేష్ట కవి కుల శ్రేయార్తి గనరో
పునీతంబౌ యో శాంభవి లలితా పున్నెమగునే.

Friday, October 26, 2018

వందనం...అభివందనం

తలచి తలచి విసివి వేసారి పోయా
వలచి వలచి తనిసి వెనుదిరిగి పోతా
వలచిన పాపం నాది
గెలిచిన గర్వం నీది
పలుకుల నగవుల సవ్వడి
కలలో కలిసే చిన్ముడి
నిజమై ఎదురై కనరాదో
వరమై స్వరమై మనలేదో
అలసిన తలపులు ఆగేనా
పిలువని పిలుపులు సాగేనా
కలువని కలువను చూసేనా
చెలువుల చెలిమిని మరచేనా
వలచిన ఖర్మం నాది
గెలిచిన మర్మం నీది
వాడి విసిరి పారేయడం ఓ కళ      వసి
వాడి విసిగి పోరాడడం ఓ కల
వందనం ఓ చంద్రకళా.    అభి
వందనం ఓ శరద్జ్యోత్స్నా.

Wednesday, October 10, 2018


కాలం మారిపోయిందా
మనిషి మనస్తత్వం మారిందా
అవగాహన పెరిగిందా
అవసరం ముందుందా
నిజాయితీ తగ్గిపోయిందా
సామాజిక బాధ్యత కొరవడిందా
అవును అన్నిటికీ మూలం
మనిషికి స్వార్థం పెచ్చు మీరింది
తత్కాల సౌఖ్యం, సద్యః ఫలితం
బాధ్యతా రాహిత్యం
సమాజానికి పట్టిన చెద పురుగులు
ఫలితం
ముదనష్టపు జీవితాలు
నికృష్టపు ఆలోచనలు
దేవదేవా! నా జాతికి వరమివ్వు
శ్రమజీవన నైతికతా బలమివ్వు.

Monday, October 8, 2018

At your lotus feet

Whom can I express my grief?
Where can I explain my disbelief?
How can I sustain the difficulties?
How can I submit the differences?
Oh! God! Oh! nature! Oh! Universe
Let me get an elevation, a salvation
Though I may be murky or dirty
Though I may be a sinner or thinner.
Me alone and none to share my views
Me aloof but none to share my joys
Neither I seek nor I  work for such
Nevertheless my tears and my breaths
Are left on your lotus feet
With a hope of wipe out
Give me a role to serve
Give me strength if I deserve
Let me remain at your lotus feet
Let me retire with your thought.