Sunday, August 30, 2015

     మాయ రోగమ దెప్పుడు మాయ మౌనొ 

తే. గీ.  మూడు నెలలుగా నను చుట్టి ముట్టె నొక్క 
          రోగ మదియేమొ వైనము రోగ హారు 
          లెవ్వ రిదమిథ్థ మని తేల్చ లేరు  యింక 
          మాయ  రోగ మదెప్పుడు మాయ మౌనొ.

        తొలుత జ్వరమనిరి పిదప తొలగని రసి 
        ఏదొ పుర్రెలో గడ్డ కట్టె ననిరి ఎట్టు లైన 
       శస్త్ర చికిత్స చేసె  విశాఖ నందు 
      మాయ రోగ మదెప్పుడు మాయమౌనొ. 

      ఈ సరికి ముమ్మారు తిరిగి వైద్య శాల 
      లకు విరివిగా నే వెచ్చించినాను మరల 
      సద్గురు లపూజ గురుపూర్ణి మా చరింప 
     శ్రమ కు లోనైన లవణంపు స్థాయి జారి 
     ఒడలెరుగనైతి మున్నాళ్ళు ఒక్క రక్త 
    బిందువు గడ్డ కట్టగా  ఇంతలోనే 
  మరల శస్త్ర చికిత్స జేసి మూర్ధ్న మందు 
 కణితి గలదరి వలదని కదలి వెడలి 
  బెంగ ళూరు వస్తిమి ఇటనట పెద్ద ఆసు 
  పత్రులందు చూపించ తప్పదు కణితి 
  తీయుటనిరి  ఏరి ఉసురు తీయు చుండె ?
  మాయ రోగ మదెప్పుదు మాయ మౌనొ. 

కర్మ క్షయమంచు సరిపుచ్చు కొనుట తప్ప 
వేరు గతిలేదు ధైర్యంబు వీడ లేదు 
  ఆ పరాపర తలచు కొనగల నం తె 
  కాది విద్యకే    నా బ్రతు కంకితమ్ము  
   
          

Wednesday, August 26, 2015


   జీవన గమనం 

ఏటి ఒడ్డున నిలబడితే
కోటి ప్రశ్నలు నా మదిలో
నీటి కెందుకా  కులుకులని
వల్లమాలిన నడకలని
ఎల్లవేళలా సాగదు  ఆ నడక అని
మెల్లగా ఎవడో ఆ దారికి అడ్డం పడ్డాక
కళ్ళు తేలేస్తావ్, నీళ్ళు నమిలేస్తావ్ .

జలధి ఒడ్డున కూర్చున్నా ఎందుకో
అలల కలలు చూసి చూసి
కలత పడుతుంది నా మనసు
వెలితి పడుతుంది నా బ్రతుకు
చెలియలికట్ట దాటలేనని తెలిసీ
ఏ సునామీ ఐ నా రాదా అని
ఆ నిరంతర ప్రయత్నం  కాదా .

ఆరు బయట నిలుచుంటే
ఊరు  పిలుపు వింటుంటే
గాలి కబురే నాకపురూపం
గాలికి  కూడా నేనంతే
ఆ పలకరింతలో మరపురాని
పులకరింత  ఎదను కుదుపు
గాలికేమి లాభం నా వల్ల
చెలిమికి నేనే దొరికానా
కలిమి లేకున్నా మేమందరం
కలిసి మెలిసే ఉంటాం
కొండలు,కోనలు , పచ్చ పచ్చని
పైరులు, లేగ దూడలు మూగ జీవులు 
మా నేస్తాలు.
పరోపకారం మాలో ఒక భాగం .