మాయ రోగమ దెప్పుడు మాయ మౌనొ
తే. గీ. మూడు నెలలుగా నను చుట్టి ముట్టె నొక్క
రోగ మదియేమొ వైనము రోగ హారు
లెవ్వ రిదమిథ్థ మని తేల్చ లేరు యింక
మాయ రోగ మదెప్పుడు మాయ మౌనొ.
తొలుత జ్వరమనిరి పిదప తొలగని రసి
ఏదొ పుర్రెలో గడ్డ కట్టె ననిరి ఎట్టు లైన
శస్త్ర చికిత్స చేసె విశాఖ నందు
మాయ రోగ మదెప్పుడు మాయమౌనొ.
ఈ సరికి ముమ్మారు తిరిగి వైద్య శాల
లకు విరివిగా నే వెచ్చించినాను మరల
సద్గురు లపూజ గురుపూర్ణి మా చరింప
శ్రమ కు లోనైన లవణంపు స్థాయి జారి
ఒడలెరుగనైతి మున్నాళ్ళు ఒక్క రక్త
బిందువు గడ్డ కట్టగా ఇంతలోనే
మరల శస్త్ర చికిత్స జేసి మూర్ధ్న మందు
కణితి గలదరి వలదని కదలి వెడలి
బెంగ ళూరు వస్తిమి ఇటనట పెద్ద ఆసు
పత్రులందు చూపించ తప్పదు కణితి
తీయుటనిరి ఏరి ఉసురు తీయు చుండె ?
మాయ రోగ మదెప్పుదు మాయ మౌనొ.
కర్మ క్షయమంచు సరిపుచ్చు కొనుట తప్ప
వేరు గతిలేదు ధైర్యంబు వీడ లేదు
ఆ పరాపర తలచు కొనగల నం తె
కాది విద్యకే నా బ్రతు కంకితమ్ము
0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home