సాంత్వన
ఈ దేహంలో గాలిమర ఎన్నాళ్ళు ఆడుతుందో
అన్నాళ్ళూ ఈ మట్టి బొమ్మ
ఆడుతుంది ,పాడుతుంది
గాలిమర ఆగిపోతే కుళ్లిపోతుంది
ఆపై మట్టిలో కలిసిపోవాలి
అదే జీవితం అదే ఈ ప్రపంచం
ఇక
ఏడ్పు లెందుకు ఒదార్పులేందుకు
భజగోవిందం చదవుకున్నాంగా
పునరపి జననం పునరపి మరణం
తరుణోపాయం భక్తిమార్గం
పరోపకారం స్వధర్మ ఆచరణం
ఈ మూడే తాపత్రయమైతే
జన్మ సార్ధకము , చరితార్ధము కూడా
అది విస్మరించరాదు
బ్రహ్మ యజ్ఞం పితృతర్పణం
ఆచరించాలి యికపై
- సాధిస్తా గుర్వాజ్ఞగా
0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home