Saturday, September 20, 2014

                               శుభాకాంక్షలు 

అమరపురి  నున్నారు 
  నిన్నుగన్న   వారు 
అనుజుఁడు ఖండాంతర వాసి 
అగ్రజుడు  బహు దూర వాసి 

కేలు పట్టిన వాడు మితబాషి 
మెట్టినింటి వారు  మృదు బాషి 
ఇరుగు పొరుగుల వారు ఓడ్ర బాషి 

అంతరంగపు అద్దాన 
అపురూప అందాన 
మాట వన్నెల దాన 

మేటి పలుకుల వీణ 
కళావతి,కచ్ఛపి,
మహతి కన్నను మిన్న 

నీకు శతధా శుభమ్ భవతు 
నీకు బహుధా శుభమస్తు 
విజయ పరంపరా జన్మ దిన మస్తు. 

అయిన వారికి అక్కరగ నిలచి 
అత్తవారికి అండగ మెలిగి 
చిరాయురస్తు  
చిర స్మరణీయ జన్మదినమస్తు 

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home