స్మృత్యంజలి
కనుపాపలా కాపాడుతూ
కదిలే దేవతగా నను సాకిన
అమ్మ గతించి పోయి ఎంతో వెలితి చేస్తే
ఇప్పుడు నాన్నగారు కూడా
అమ్మ దగ్గరకే వెళ్లి పోయి
మాదారిన మమ్ము వదిలేసి
వెళ్ళిపోయినా
మరలా అమ్మా నాన్నలు
ఒక్కటైనందుకు సంతోషమే
ఒక ప్రక్క అయినా మరో ప్రక్క
ఇద్దరూ వెళ్లి పోయారన్న బాధ
చెప్పలేనంత .
అమ్మ నేర్పిన బుధ్ధులూ
నాన్న నేర్పిన పద్యాల
సాక్షిగా చెప్తున్నా
వారి ఆశల మేరకు బ్రతుకుతూ
కన్నవారికీ కన్నా ఉరుకూ
రుణపడి ఉంటూ
మంచి పేరు తెస్తా
మంచిగానే బ్రతుకుతా.
(నాన్నగారు 26/12న సునాయాసంగా పరమ పదిచారు)
0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home