జీవన గమనం
ఏటి ఒడ్డున నిలబడితేకోటి ప్రశ్నలు నా మదిలో
నీటి కెందుకా కులుకులని
వల్లమాలిన నడకలని
ఎల్లవేళలా సాగదు ఆ నడక అని
మెల్లగా ఎవడో ఆ దారికి అడ్డం పడ్డాక
కళ్ళు తేలేస్తావ్, నీళ్ళు నమిలేస్తావ్ .
జలధి ఒడ్డున కూర్చున్నా ఎందుకో
అలల కలలు చూసి చూసి
కలత పడుతుంది నా మనసు
వెలితి పడుతుంది నా బ్రతుకు
చెలియలికట్ట దాటలేనని తెలిసీ
ఏ సునామీ ఐ నా రాదా అని
ఆ నిరంతర ప్రయత్నం కాదా .
ఆరు బయట నిలుచుంటే
ఊరు పిలుపు వింటుంటే
గాలి కబురే నాకపురూపం
గాలికి కూడా నేనంతే
ఆ పలకరింతలో మరపురాని
పులకరింత ఎదను కుదుపు
గాలికేమి లాభం నా వల్ల
చెలిమికి నేనే దొరికానా
కలిమి లేకున్నా మేమందరం
కలిసి మెలిసే ఉంటాం
కొండలు,కోనలు , పచ్చ పచ్చని
పైరులు, లేగ దూడలు మూగ జీవులు
మా నేస్తాలు.
పరోపకారం మాలో ఒక భాగం .
0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home