Sunday, July 3, 2016

మౌనం 

మౌనం మన  కొక వరం
కొన్ని ప్రశ్నలకు మౌనమే సమాధానం
అయిష్టతకు మరో పేరు మౌనం
ఉదాసీనతకు ప్రతిరూపం మౌనం
చెప్పాలనుకున్నది చెప్పలేకుంటే మౌనం
చెప్పినా వినరనుకుంటే మౌనం
ఏం  చెయ్యాలో తెలియని అయోమయం లో కూడా మౌనం
బాధా పరితప్త హృదయానికి అద్దం, అర్ధం  మౌనం
ఒత్తిడిని జయించే ఔషధం మౌనం
సమస్యల వలయంలో దిక్సూచి మౌనం
ప్రతికూలతలకు తలఒగ్గక పోతే మౌనం
ప్రతి ఘటనకు ఆద్య0 మౌనం
ఆ మౌనం సదా నిన్న0టి ఉండే నేస్తం
మౌనమే తోడుగా లేకుంటే మనుగడ ఎంత కష్టం?