నా తెలుగు నా నుడి
నా తెలుగు నా నుడి
సీ. జానపదులకు జాను తెనుగు ఆ పరమ
భాగవతులకది భక్తి పదము
ఉగ్గు పాలను ఉబ్బి తబ్బిబగుచు గోటి
ముద్దల గోములా ముద్దు పలుకు
తనివి తీరని తల్లి ఒడిలో కులికెడి నా
తీయ తేనెల పల్కు తేట తెలుగు
ప్రాసలెరిగి యతుల నిలచి పద్యమై
వెలిగి స్వరజతుల నొదిగి మెలిగి
తే.గీ. పండితుల నోట ప్రౌడి గా పంట పండి
పామరుల యాసలో చాన పరిఢవిల్లి
పల్లె పదమై విరియు నా పాలవెల్లి
తెలుగు! యింపారు సొంపారు తెలుగు నాది.