Wednesday, May 30, 2018

శాంకర్యాష్టకమ్

శా.
ఆర్యాణీ! అచలాత్మజా కరుణయా త్రాతుం సమర్థాం ముదాం
శ్రోతవ్యం మమ విన్నపం  భగవతీమ్ యోగీశ్వరీమ్ భార్గవీమ్
త్వత్సేవా పరివేష్ఠితా జలధిజా వాణ్యానుకంపా
మహం

మాతంగీమ్ సతతం దదాతు తవసేవాలోకనం శాంకరీ.
శా.
అంబామ్ శారద చంద్రికా ప్రహసితామ్ ఆనంద సంధాయినీమ్
ఆర్యాం మంత్ర మయీమ్ ఉమామ్
సకల శాస్త్రార్థాంతరంగామ్ ప‌రామ్
అంబే శాంభవి భద్ర కాళి ర (అ)పరా వేదత్రయీమ్ పాహిమామ్
ఆర్యాం యోగమయీమ్ స్మరామి రనిశం మాతా శివే శాంకరీ.

శా.
శ్రీ మాతా భువనేశ్వరీం శుభకరీం హ్రీంకార సంశోభిణీం
కౌమారీం నిగమార్థ గోచర కరీం సౌభాగ్య విద్యేశ్వరీం
వామాంగీం కరుణార్ద్ర భావ నిలయీం త్రాతుం తవత్పుత్రకామ్ .
కామాక్షీం జననీమ్ భవానీమ్ కృపయా  కామేశ్వరీం శాంకరీం
శా.
వారాహీం నిగమత్రయీం పరాం గిరిసుతాం నారాయణీం శాంభవీం
తారానాయక శేఖరీం మహా జనని వార్తాళీం విశాలాక్షి మే
వైరాగ్యం కృపయా దదాతు రనిశం వైదేహి కామేశ్వరీం
ప్రారబ్దమ్ తవ సేవనా ఫలమిదం ప్రాజ్ఞీశివే శాంకరీ
శా.
శ్రీ విద్యా విభవాంతరంగ నిలయాం శ్రీ శ్రీ ప్రదాయీం ఉమాం
సావిత్రీం లలితాం పరాపర మహా సాధ్వీం జగన్మాతృకాం
జీవన్ముక్త మునీంద్ర సేవిత సుసౌశీల్యాం
భవానీం సదా
సేవాభాగ్య మహం దదాతు జననీం హే భార్గవీం శాంకరీమ్.
(శ్రీ శ్రీ= లక్ష్మి, సరస్వతి )
శా.
శైలూషీం భువనేశ్వరీం శుభకరీం శీతాంసు సంశోభితాం
జ్వాలామాలిని నిర్మితాగ్నివలయప్రాకార మధ్యస్థితాం

కైలాసాచల వాసినీంశివసతీం కైవల్య మీడే శివే
బాలాలీల దదాతుమాం పరసుఖానందం సదా శాంకరీ.


శా.
శ్రీ మాతా శుభకారిణీ విమల వాక్శ్రీ దేహిమాం శాంభవీ
హే మాతా భవ హారిణీ తవ సుతాం హేలా విలీలాం సదా
క్షేమానంద మనంతశాంతి విభవాం మేధాం దదాత్భార్గవీం
కామాక్షీం భయ హారిణీం సకల సౌభాగ్య ప్రదా శాంకరీ.
శా.
శ్రీ వాణీ పరిసేవితా గిరి సుతా త్రైలోక్య సంసేవితా
కైవల్యాది సమస్త భాగ్యఫలదా త్రైగుణ్య సంహారికా
జీవన్ముక్త మహా మునీంద్ర గణ సంసేవాతురా పాహి మాం
భావాభావ వివర్జితా భవహరా అంబా పరా శాంకరీ.
(సున్దర రామ శర్మణా విరచితమిదం శాంకర్యాష్టకం సంపూర్ణం.)

శా.
ఆర్యాణీ! అచలాత్మజా కరుణయా త్రాతుం సమర్థాం ముదాం
శ్రోతవ్యం మమ విన్నపం  భగవతీమ్ యోగీశ్వరీమ్ భార్గవీమ్
త్వత్సేవా పరివేష్ఠితా జలధిజా వాణ్యానుకంపాం
 దదామ్
మాతంగీమ్ సతతం దదాతు తవసేవాలోకనం శాంకరీ.

అవిశ్రాంతమా? విశ్రాంతమా?

ఇది అవిశ్రాంత జీవన గమనం
ఇందులో అధికారిక విశ్రాంత జీవనం
అరవది  నిండిన వయసులో ఆరంభం
సమయం కొరవడిన ఒరవడి నుండి
సమయం గడవని నడవడి లోనికి
సంపాదన కోసం కాకున్నా కాలక్షేపం కోసం
ఓ వ్యాపకం ఎవరికైనా అనివార్యం
సమాజ సేవ ఉదరపోషణ ఏదైనా కావచ్చు
కొండలైన కరిగిపోవు కూర్చుని తింటే
కండబలం గుండెబలం ఉండాలేగాని
పరోపకారార్థం ఇదం శరీరం అన్నది
ఇకమీదట ఎంతో ఋజువు చేయాల్సి ఉంది.
దాచుకున్నది సంసారానికి సరిపోతే
సంపాదించడం కొనసాగించడం
మంచిదే నీ కోసం కాకుండా సమాజం కోసం
సమాజం నుంచి అందుకున్నదెంత
సమాజానికి మనం ఇచ్చినదెంత
అంకణా సరిపోవాలి చివరకు
ఆందుకోసం ఆశపడదాం ఆరాటపడదాం.

Wednesday, May 23, 2018

ఏదైనా సాధించేనా

ఆశ ఆకలి దప్పిక  ఎరుగని జీవితం
అప్రతిహతంగా అది విజయవంతం
అహం నుంచి అద్వైతం త్వమేవాహం
అందుకోవడం ఆపై ఎంత సులభం
అందని పండులా కొందరికే అండలా
ఎందుకలా ఆ పరమాత్మ అందీ అందనట్టు
వేధించడం బాధించడం సాధించుకోమనడం
అంతా ఆ ఈశ్వరేచ్ఛ ఆనుకోవడం
ఈ నయనాలకు ముందు చూపే ఉంది
నా ఎదలోన దీపశిఖ కొన చూడగలనా
పంచ భూతాల యావజ్జీవపు చెఱనుండి
పంచేద్రియాలను మనసును విడిపించలేనా
పట్టెడన్నం పెడుతూ పదిమందిని చదివిస్తూ
కొందరికైనా సహాయపడలేనా
నాలో నేనే నాకై నేనే అల్లాడిపోనా
పోనీ ఆ పరమాత్మ నైనా చూడలేనా
ఏదో ఒకటైనా సాధించగలిగేనా?

Tuesday, May 22, 2018

ఓ తండ్రికి  కూతురి పై మమకారం

నిను చూడనిదే
మాటాడనిదే
నేనుండగలనా
జీవించగలనా?
నా ఎదుట
తారాడనిదే
పోరాడనిదే
నీవుండగలవా
జీవించ గలవా?
నిదరోదామన్నా
కలగందామన్నా
నిను చూడనిదే
మాటాడనిదే
కనుమూయ గలనా
మనసాప గలనా?
కనుమరుగౌదామన్నా
నను మరచుందామన్నా
నేనొచ్చి
బతిమాలనిదే
తల నిమరనిదే
నీ వుండ గలవా
జీవించ గలవా?

శా.
అంబామ్ శారద చంద్రికా ప్రహసితామ్ ఆనంద సంధాయినీమ్
ఆర్యాం మంత్ర మయీమ్ ఉమామ్
సకల శాస్త్రార్థాంతరంగామ్ ప‌రామ్
అంబే శాంభవి భద్ర కాళి ర (అ)పరా వేదత్రయీమ్ పాహిమామ్
ఆర్యాం యోగమయీమ్ స్మరామి రనిశం మాతా శివే శాంకరీ.

अंबां शारद चंद्रिका प्रहसिताम् आनंद संधाइनीं
अर्यां मंत्रमयीं उमाम् सकल शास्त्रार्थांतरंगाम् पराम्
अंबे शांभवि भद्रकालि रपरा वेदत्रयीम् पाहिमाम्
आर्यां योगमयीम् स्मरामि रनिशं माता शिवे शाकरी.
रा.सु.रामम् विरचितं.

Wednesday, May 9, 2018

కానుక

ఆగిపోదు శుభాకాంక్షలు చెప్పకున్నా  పుట్టినరోజు
ఆగిపోదు వద్దనుకున్నా కిమ్మనకున్నా ఏరోజూ
ప్రేమ అభిమానం గుండె లోతుల్లో ఉండాలి
ఆత్మీయతా భావం కనుకొలకులలో నిండాలి
తియ్యని ఓ పిలుపు కమ్మని ఓ పలుకు
వెలకట్టలేని సరిపెట్టలేని అనుబంధాలకు
తీపి గురుతులు చెరిగిపోని ఆనవాళ్ళు
కావాలని చెప్పని వారికి బుద్ధి దేవుడే చెబుతాడు
అందుకోవడమే కాని అందివ్వడం చేతకాని
మనసొప్పని వారు పనికి మాలిన వారి
మునివాకిట నిలువు జీతంతో నిలుస్తారు
ఆదరించే అన్నపూర్ణకు మూతి వంకరలా?
నికృష్ట విధానం నిర్లిప్త జీవన గమనం
ఆదరణకు వితరణకు నడుమ తేడా ఎంచని
దుష్టబుద్ధి దుర్నీతి అహంకారం అదొక
అపోహల కాసారం , నిర్లక్ష్యపు నిబిడాంధకారం
మురికి కూపంలో స్వైర విహారం
నా పరివారం వీటికి అతీతంగా ఆదర్శంగా 
అందంగా హుందాగా ఆనందంగా ఉండాలి
అదే నాకు అసలు సిసలు కానుక.

Monday, May 7, 2018

వెన్నెల

సీ.
మఱచి నే నుందమన్నను ఉండ లేకుంటి
            మై మరచి నటుల మసల కుంటి
కలసి సాగుదమన్న కలువ నయన రాదు
             కలసి సాగక యున్న కనలి పోవు
ఎదురు చూచెడి మది బయట తా పడనీదు
             బ్రతిమలాటల బాట బ్రతుక నేర్చు
ఎదురేగి ఏమిచ్చినా కాదనదు కాని
             మెచ్చుకోలను మాట  నేర్వ లేదు
తే.గీ.
చూసి చూడక యున్నచో  ఉస్సురనును
చూచి చేయూత నొసగితే ఊసులాడు
పొగరు తలకెక్కి బరువెక్కి పోటులాడు
వెన్నెల వెలుగు మాకేల వన్నె తేదు?
(వెన్నెల=జ్యోత్స్న)

Saturday, May 5, 2018



ఉ.
మంచి యొనర్చ నెంచి మమ మానస మందున మేలుగోరినన్
కొంచెము పో కృతజ్ఞతది ఒద్దికగా కనరానిచో యిసీ
వంచన పాలు నా దు ఉపకార మటంచు మదిన్ తలంతు నొ
క్కించుక తిట్టుకొందు పరికించగ కిమ్మన కుండ నుండెదన్.

Friday, May 4, 2018

జన్మదినాన

ఆగిపోనిదీ ఆపలేనిదీ  అలుపెరుగనిదీ కాలగమనం
నచ్చుకున్నా నొచ్చుకున్నా సాగిపోయే చంక్రమణం
నభోవీథిలో నిశ్చలంగా ఉన్నా భ్రమపెట్టే పరిభ్రమణం
తనచుట్టూ గ్రహ మండలాలను త్రిప్పుకొనే వైనం
కాలానికీ ఆదిత్యునికీ అవినాభావ సంబంధం
ఏది ముందో ఏది వెనుకో తెలియని తికమక
విశ్వ సృష్టికి ముందున్న పెంజీకటి కావల
మిణుకుమిణుకు మంటూ వెలిగిన వెలుగే
పరంజ్యోతి అన్నా  అణు విస్ఫోటనమన్నా
మరి దానికీ సృష్ట్యానంతర సూర్యునికీ కాలానికీ
సంబంధం ఏముందో మరి ఆ వెలుగేమైందో
రోదశీ వింతల నెట్లా అవలోకించారో మన పూర్వులు
మానవ మేథకు అవధి లేని ఆవిష్కరణలు
నా కైతే తెలుసుకునే పిపాసే ఉంది కాని
ఆ జ్ఞానం విజ్ఞానం ప్రజ్ఞానం ఆమడ దూరం
అరువది నాలుగు నిండిన జన్మదినాన
నాలో ఎందుకో ఈ అంతర్మథనం
ఎవరిని ఆ చేరువలో నిలపాలో
ఆలోచనలే అవకాశం గా మలచాలో
అంతా ఈశ్వరేచ్ఛ! మనసంతా అమ్మకే ఇచ్చా
నిస్స్వార్థంగా ఏ పనికైనా సంసిద్ధం.

గుర్తింపు

మలుపు మలుపు లో దిక్సూచి నై నడిపిస్తా
గెలుపు పరుగులో  మార్గదర్శినై కలిసొస్తా
అలసి సొలసి పోతే ఆసరా నేనిస్తా
ఓడిన ప్రతిసారీ అభయ హస్తం అందిస్తా
కన్నీటి సుడులలో భవిత అగమ్య గోచరమై
అడుగు అడుగు లో బ్రతుకు భారమై తోచితే
అండగా నేనుంటా నిండుగా భరోసా నేనిస్తా
చిత్త చాంచల్యంతో చిత్తజు నాదరిస్తే
ఎడా పెడా వాయించేస్తా ఎత్తి కుదేస్తా
గమనం ఎపుడూ గమ్యంవైపే
సాధన అంతా లక్ష్య సిద్ధికే
నీ విజయం నా ప్రేమకు పురస్కారం
నీ జీవితం నా లాలనతో పునీతం
గురువుగా తండ్రిగా గుర్తింపే ఫలితం
నువు గుర్తించే లోగానే ఏమో తుది పయనం.