Friday, September 28, 2018


నిర్వ్యాపక ముపవిసామి
అస్య కిమ్ కరోమి
దయితస్య ఆరోగ్యమ్ సమ్యక్ నాస్తిత్వేన
విద్యాలయమ్ గచ్ఛన్ నశక్నోమి
సర్వే ఛాత్రాణి సన్తు నిర్భయాః
ఉపాధ్యాయే అస్తు సుఖ శాంతినః

Tuesday, September 25, 2018


కం.
లేమా సయోధ్య కనుగొన
లేమా హరి పద యుగళము జేరెద మనుకో
లేమా మగువల సిగ నే
లేమా సన్మార్గ పథము లరయగ లేమా.
కం.
రామా! నినుగన రామా
లేమా! దేవుని కలంకృతియు  కాలేమా?
కోమా! యేమను కోమా?
చామా! ప్రశ్నించుచు నిను  బాధించామా?
(రామ, లేమ,కోమ,చామ=స్త్రీ)
మ.
ఇదిగో శ్రీ మతి మాటలాడ గలరో విఖ్యాత పూబాల లా
ర! దగా పడ్డ సుమమ్ములార! మధురారామమ్ము లారా! మదీ
య దిశా దర్శకులార! యో చెలిమి చేయంగోరు సంపంగె లా
ర!దయా ర్ద్రా హృదయద్యుతీ విభవు లారా! సద్వివేకంబుతో.

Friday, September 14, 2018

       గజమాల

మ.

మది‌లో నాహృదిలో తలో తలపులో మాయా వివేకంబులో
పదిలో యొక్కటి కూడ తా జరుగ రాబోదే అవత్యాశలో
హృదయాకాశము నెమ్మదించినచొ  సుహృత్కూమ మందంతటన్
పదిలమ్మై విరబూయవే విమల సద్భక్త్యార్తి కెందామరల్
ఇదిగో నీ సుతు డెంతవాడొ కనుమీ నీపై తదేకంబుగా
కుదురుంబోవగ పద్యముల్ నుడువు శ్లోకంబుల్  వినమ్రంబుగా
సదసద్భావన లిచ్చి పల్కులకు సత్సౌందర్య ముక్తావళీ
ప్రద కంఠాభరణమ్ముగా తలచి సుప్రాలంబమీవమ్మ శా
రద పూర్ణేందు నిభాననా! యచలజా శ్రీవిద్యా పరా శాంకరీ
తుది శ్వాసం విడు దాక నీ స్మరణ చేతోమోదమై కొల్వగన్
పదవిన్యాసములున్ కడుంకడుగ నీ పైనట్లు  కూర్చుచున్
ఎదురై కింకరుడై నవావరణ సంవేద్యంబునై హోతయై
మదినెల్లప్పుడు నామమే స్మరణమో మంత్రార్థమో మంత్రమో
సదసత్తంత్రమొ రూపమో సవన సౌశీల్యమ్మొ మీనధ్వజమో
మెదలన్ నేర్చిన జాలు నా మనసు సమ్మోహంబుగా నుండగా
వదలన్ బోవక సాగిపోవలెను వైవిధ్యంబుగా చల్లగా
ఇది సంకల్ప బలమ్మొ నీ దయయొ ఈప్సిత్సిద్ధి నీ యిచ్ఛయే
కద శర్వాణి! సనాతనీ!పరుల! శాంకర్యంబికా! కాళి! నీ
పద సాన్నిధ్యము నీ పదార్చనలు  ప్రాప్తోద్యద్వరమ్మౌ గదే
పదిమందైనను బాలికల్ మిగుల సంప్రాప్త్యార్హులై నా వలన్
కుదురున్ బొందిన జాలు మెరికల్  గ్రామీణ బాలికల్
గదిలో మ్రగ్గిన కూనలై మసలు మాతాపితృలే దూబరా
ముదితా విద్యకు ఖర్చుయంచనెడు దుర్మార్గుల్  మరింకెందరో
అదియే నాకొక మోక్షమంచు యది మోక్షాధిక్యమంచున్ సదా
మది లో మెల్గెడి నా తలంపులకు యే మేలాటముల్   లేక నీ
కిది మేలంచనవే శివే! జనని! శ్రీ కైవల్య పాంథుండ
  నా

కిదియున్ ముఖ్యము గావునన్ వెరసి నాకిప్పించవే షోడశీ.


Thursday, September 13, 2018

చెంగల్వ పూదండ

ఉ.
అమ్మను కొల్చుచుంటిని సకాముడ నౌచు నకాముడౌచు నే
నిమ్మడిగా యిదిమ్ము అది యిమ్మని కోరని కోర్కెలేదు మా
యమ్మ తనేమి యిచ్చినను అన్నుల మిన్నుగ నుండు యందుకే
యమ్మను నమ్ముచుంటి ననయమ్ము నయమ్ము భయమ్ము మీరగన్
అమ్మ యనంత శక్తి సులభమ్ముగ నర్థము కాదు కాని తన్
నమ్మిన వారి బాగు ఓగులకు నేరుగ బాధ్యత తానె స్వీకరిం
చిమ్ముగ భక్తులందరకు చక్కని చిక్కని కొంగు బంగరౌ
అమ్మకు నాదు గుండెలలొ దేవళ మొక్కటి కట్టినాను బ
లమ్ముగ శబ్ద శైలముల లాక్షణికాకృతులన్ మషీ సుపం
కమ్మున మేళవించి రసికత్వ సుశోభితమౌ నటుల్ విలా
సమ్ముగ నుండ నే నుపవసించుచు నుండెద నెల్లవేళలం
దమ్మకు నా సమర్పితము తృప్తి నొసంగిన చాలు వాదనల్
కమ్మని వేదనల్ ముసురు కొన్నవి ఉన్నవి చాలు చాల్ విశే
షమ్ముగ శేష జీవితము షోడసి నూపిరిగా గమింప జేయగా
అమ్మకు విన్నవించితిని స్వస్థత కూరుకు లిచ్చి చేతిలో
సొమ్ముల లేమిలేక విన సొంపగు పద్యపు కల్మి బల్మి తో
నెమ్మది నిచ్చి నన్ను కడతేర్చ మటంచును వేడుకొంటి రా
రమ్మని కాలకింకరలు రజ్జవు లొక్కెడ తీయు నంతకున్.






Monday, September 10, 2018

ఆర్యా శతకం

ఆర్యా శతకం

కారణ పరచిద్రూపా
కాంచీపుర సీమ్ని కామపీఠగతా
కాచన విహరతి కరుణా
కాశ్మీరస్తబక కోమలాంగలతా.1
భావం: కారణ పరచైతన్య రూపా కాంచీపుర మందలి కామకోటి పీఠాధిష్టాత్రీ పూగుత్తి వంటి ఒకానొక దయ అక్కడ విహరించు చున్నది.
మూక శంకరుల పంచశతి లోని మొదటిదైన ఆర్యా శతకంలోని తొలి శ్లోకం యిది. దానికి నా స్వేచ్ఛానువాదం.
కం.
శ్రీ కర కాంచీపుర స్థిత
శంకర మఠ కామకోటి శాంకరి! మాతం
గీ! కారణ పర చిద్రూ
పీ కరుణామయి లతాంగి శ్రీ కామాక్షీ. 1
కం.
కాంచీపుర తిలకే అం
బాం చిరపాశాంకుశ సుమ బాణ ధరే! ఓ
కుంచిత స్థనభార వతీ
యంచిత కైవల్య పథము నవలంబింతున్. 2
కం.
చింతిత ఫలముల నిచ్చెడి
చింతామణి! నా గుబులణచెడు చిత్సుధలన్
సంతత సుచరిత సులభా
భ్రాంతిన్ త్రుంచగదె 
కం.
కచముల కుటిలపు కఠినపు
కుచముల కుందహసిత జిగి కుంకుమ ఛాయన్
విచరించును కాంచి పురా
న చలిమలవిభు సుత కంచి కామాక్షి యనన్. 4
కం.
పంచ శరాసను కరుణన్
కాంచి పుర కుమారి యొకతె కడు మోహమునన్
పంచ శరాసను వైరిన్
పంచాస్యుని మరు వెతలకు బందీ చేసెన్. 5
కం.
వరమున కాంచీ పురమున
గిరిసమ కుచభర విలసిని శ్రీ కామాక్షీ
పరతంత్రులమై యుంటిమి
యరవిందాక్షికి స బ్రహ్మచారికి యెపుడున్. 6
కం.
ఐందవ  శేఖరు కలిమా
సుందర యైకాత్మ్య రుచియు శృత్యర్థములున్
యైందవ శేఖరియే తా
నందున కాంచి పుర మధ్య గత యై యుండెన్. 7


Friday, September 7, 2018


మందస్మితమ్ సుమధురం
సుందర వదనారవింద సంశోభిత మం
బాం దయయా త్రాతుమ్ మామ్
వందే బాలేందు మౌళి వరదామ్ లలితామ్.
వందే బాలామ్ త్రైయీమ్
ఇందు కళా ధరి మమ హృదయే 

Monday, September 3, 2018


When my mind tears
When my breath sores
Prefer to share with you
Refer to get consoled by you
Rarely you respond
Rarely you reciprocate
My interest dries and dies.
Sprinkling chilli powder
On the burning wound
You prefer deadly silence.
Staring at the shining sky
Keeps me to hope without cry
Waiting for a blissful dawn
Working for a beautiful lawn
I remain a grass hopper all the way
I retain a gross helper role every day
Rarely Iam wished
Rearly I am willed
Regrets my mind often
Retreats from thereafter soon.

Saturday, September 1, 2018


ఉ.
నేరము లెంచకే జనని నేరక జేస్తి ననేక పాపముల్
ఊరక పోవునే యఘము లుస్సురనంగగ జేసినావు నా
యారడి తీర్చి సాదర దయార్ద్ర మయీ వగ జూపకన్ యికన్
ఊరట నిమ్ము నమ్మితి నినున్ నిటలాక్షు సతీ పరాపరా.
చం.
మలిన మనో వికారములు మా మది తుందిల మందజేయు సం
చలిత తలంపుల న్నెగసి చర్విత చర్వణ మై చనున్ మదో
త్కలిత పరాత్పరత్వము ముదావహమై నడిపించు చుండగా
సలలిత శ్రీ మృడాని నను సాదర మొప్ప సాకవే శివే.
శా.
నానానేక ప్రయత్నముల్ గరపి నా మాలోక మందుండగా
నేనే పున్నెము జేసినానొ మును