Saturday, December 3, 2016

నగదు రహిత భారతం

నగదు రహిత భారతం
ఊహలకే అందని రూపం
జరిగితే ఒరిగే ప్రయోజనం
కొంచమే అయినా అది అపురూపం
ఈ దెబ్బకు జేబు దొంగలు
క్రృష్ణ కుబేరులూ కుదేలు
నకిలీ మకలి సొమ్ము హాంఫట్

మరి గళ్ళో పళ్ళెం ఖాళీ
గల్లాపెట్టి పోపుల డబ్బా ఖాళీ
రైలు బండి లో బిచ్చగాడు ఖాళీ
మెల్లగా చిల్లర నాణాలూ తీసేస్తే
చిల్లర మామ్మూళ్ళూ పోతాయి

ధనలక్ష్మి పూజ ఎలానో ఆలోచించాలి
అలవాట్లు ఆచారాలూ కాస్త మారాలి
సంప్రదాయాల్లోనూ సాంకేతికత
తోకవాణి(mobile) హస్త భూషణం
డబ్బంతా బేంకుల్లోనే
ఊహించుకోడానికే కష్టంగా ఉంటే

జీర్ణించుకోడం ఇంకెంత కష్టమో

అందుకో అంబికా అందుకే

అమ్మా అని నోరారా పిలిచానే
అమ్మలూ అంటూ అభిమానం పంచానే
నిన్ను చూస్తే ఏమని పిస్తుందో తెలుసా
నన్ను నీలో చూసుకోవాలని
నా ఆశల హరివిల్లుగా
నా ఊహల విరిజల్లుగా
నిన్నొక అందలం ఎక్కించి
జీవితం లో ఉన్నత శిఖరాల నిలపాలని
నా మానస పుత్రిక నీవే అని
నే నేర్చినవన్నీ నీకు నేర్పాలని
నీ ఆశలనన్నింటనీ నిజం చేయాలని
చదువులో మేటిగా
పదుగురిలో పోటీ లో
ముందు వరుసలో నిలపాలని
ఎన్నో కలలు ఎన్నెన్నో ఆశలు ఇంకెన్నో ఊహలు
ఎందుకో నా మనసు తెలుసుకోవు
ఎందుకో దేనికీ ముందుకు రావు
అద్రృష్టం నీ తలుపు తడుతోంది
అవకాశం నీ ఎదుట నిలుచుంది
అందుకే యీ చేయూత నందుకో
అందుకుని ముందుకు సాగిపో
ఓ నా మానస పుత్రీ
అందుకో అంబికా అందుకే.