Friday, June 10, 2016

భాగ్య శాలి 

అనువైన ఆలి 
చనువైన చూలి
ఇంపైన కూలి
తనదైన గూడు
తన ఇంటి కూడు
కలిగిన వాడు మహా భాగ్య శాలి. 

Saturday, June 4, 2016

ఆక్రోశం 


కను చూపు మేరలో  కనుగొనలేనని
కలలో కూడా అనుకోలేదే చెలీ
కలికి చూపుల కిన్నెరా  నా
చిలిపి ఊహల  అప్సరా

కను వేదురుమై  కనుమరుగావుతావని
కలగన  లేకున్నానే చెలీ
నా కలల కలికి తురాయి
నా ఎద వాకిట సిపాయి

తలపుల తలుపులు తెరిచావంటే
మునివాకిట నేనే కనపడతానే  చెలీ
నా మమతల వాకిట వెన్నెలా
పలుకరిస్తే కరిగిపోతా వెన్నలా

పాకుడు రాళ్ళపై పయనిస్తావా
జారుడు మెట్లపై దిగజారిపోతావా చెలీ
పట్టపగలే చీకటి చేసి
వెట్టి చాకిరికి బలి చేసి.