Sunday, July 14, 2013

పుష్ప వికాసం

                                    పుష్పవికాసం 

చం.

1. ఉదయమె నొక్కరోజు తొ

లి పూజకు పువ్వులు కోయబోవ నె 

    మ్మది చటుక్కునన్  తళుకు మన్నవి పుష్ప విలాప గానముల్ 

    కదలక కాళ్ళు చేతులును కాని పనేల  నటంచు తోచినన్ 

    కదిలితి నుత్త చేతులను కాని మనంబున ఎన్ని శంకలో. 

2  చం.

నిజముగ నన్ను పాతకుడనిన్ మరి పూలు తిరస్కరించుచో 

గజిబిజి గాక ఏమిటిది కమ్మని పూలనలంకరింపమే 

 అజితుల దేవళమ్ముల ననారతమీ విధి సాగు చున్నదే 

కుజపతి నీవే సంశయము గుంభనగా నిక తీర్చగా వలెన్. 

3. అన్య మనస్కతన్ మది ననన్య విచార విషణ్ణ భావమే 

దో న్యసనమ్ము కాగ మది దోచక పూజను చేయ లేక సౌ 

 జన్యము కూర్పమంచు గిరిజాపతి వేడితి నార్తితో  ఆసా 

 మాన్య విపత్కర స్థితి సుమా యిదమిథ్థ మేరుంగ నైతినే. 

                                                  సశేషం .