Sunday, June 21, 2015

                కన్న తండ్రీ వందనం 

ఏ లోకాన ఉన్నారో నాన్నగారూ 
యాద్రుచ్చికమే అయినా ఈరోజే మీ మాసికం కూడా 
నే పాలు పంచుకోలేక పోయా అనారోగ్యంతో 

ఓనమాల దగ్గరనుంచి మీకు నచ్చినట్టే చదివా 
మీరు నేర్పిన బుద్ధులలో గిరిగీసుకు బ్రతుకుతున్నా 
ఉపవాసాలూ ఉపన్యాసాలూ సంధ్య వార్చడం 
తెలుగు భాషను సాధన చెయ్యడం 
పద్య్యాలూ పాటలూ అల్లడం అన్నీ మీ అభిరుచికి 
తగినట్లే సాదించా 
మీ అభిరుచి వేరు నా అభిరుచి వేరు కాకుండానే 
ఈవరకూ సాగుతున్నా. 
కన్నబిడ్డ తలిదండ్రులకు పదిమందిలో
గౌరవం ఇచ్చేదే వివాహం అని 
మీరు చూపించినదే ఒప్పుకున్నా  
మీ ఆనందమే నా ఆనందగా  శాత విధాలా 
 అనుసరించా 
మిమ్మల్ని తలచుకొని రోజు నాకొక యుగంలా ఉంటుంది ఇప్పటికీ 
నా జీవితంలో అనేక కోణాలలో మీరే కనిపిస్తారు 
నాన్నగారూ వందనం 
కన్నా తండ్రీ అభివందనం