విభావరిని
విభావరిని
నేనొక అసదృశాగమ్యగోచర మనో వికారిని
అనిర్వచనీయానుష్టాసక్త సంతప్తహృదయ విచారిని
సమయదక్షిణాచార కాదివిద్యారణ్యగత పాదచారిని
సంప్రదాయ కవిత్వ సరోవర లహరీ భ్రామిక సంచారిని
పరసుఖానంద విభాసమాన హృదయవల్లరీ యనాకారిని
పరాపరాభావ సంవేద్య భావాభావ సంభావ్య నిషద్వరిని
అనవరత సనాతనధర్మ సంపోషకాభిలాషా నిర్ఝరిని
ఇథమిత్థ మంచెఱుకపడని అసామాన్య విభావరిని.