Wednesday, November 28, 2018

      ఏకాక్షరి

కం.
నేనే నిన్నన్నానా?
నానన నున్నన నన నిను నన్నను నానా
నాన ననానను నానా
నూన ననా నిన్న నేనును నినన్నానా?
పద అర్థ వివరణ:
 నేనే= నేను+ఏ
నిన్న్నానా = నిన్ను అన్నానా
నాన న = సిగ్గుతో
నున్నన = మృదువైన
నన నిను = పువ్వు వైన నిన్ను
నానానాన = నా మెడ లోని నాను ఆన(ఒట్టు) 
ననానను = నన+ఆనన= పూవదనను
నానానూన = అనేక రకములుగా పరిపూర్ణమైన
ననా = ఓ పూవా
నిన్న = గత దినము
నేనును = నేను కూడా
నిను+అన్నానా = నిన్ను అంటినా?
(ఇది కూడా కుసుమ వికాసం కోసం కూర్చినదే)

Monday, November 26, 2018


ఆరు పదులు దాటింది వయసు
ఆరు గాలం శ్రమించింది మనసు
ఆరాటాలూ పోరాటాలు చాలానే
చూసిచూసి చేసిచేసి నే మిగిలానే
మందిలో ఉన్నా ఏకాకి నా మనసు
ఒంటిగా ఉన్నా మంది కోసం బ్రతుకు

Sunday, November 25, 2018


'కారు' కూతలు  వినకండి
'చేతి' వాతలు మరువకండి
కాషాయంలో మిగిలిందిక  మలం
'తామర' అంటుకుంటే వదలదు
మీ దురద ఎంత గోకినా పోదు
పంకాలూ ఏనుగులూ మనకెందుకు
'పిడికిలి' బిగించితే పిడి గుద్దులే
' సైకిల్' తో జర భద్రం క్రింద పడేవు
ఒవైసీ కి సలామ్ కొట్టే గులామ్ మనకొద్దు
అందుకే మనసున్న ఓ ఓటరూ
'నోటా' మీట నొక్కేయ్.
మిగతా కథ నెలగంట పెట్టాక చూద్దాం.

Saturday, November 24, 2018


నీ కలం పోటుతో జనత భవిత మారేనా
నీ గళం పాటతో కుపిత ప్రభుత మారేనా
కట్టలు తెంచుకునే ఆవేశం
బట్టలు చించుకునే ఆక్రోశం
బీద బిక్కీ అట్టడుగు జీవికీ
తిండీ బట్ట గూడూ కావాలి
ఆకలికి రాజు పేద బేధం లేదు
నిద్రొస్తే ఎవరైనా తల వాల్చక తప్పదు
ఎక్కడ తిరిగినా గూటికి చేరక తప్పదు
నైతికత మృగ్యమైన యీ జనత
బాధ్యతా రాహిత్య పెత్తందారీ ప్రభుత
నోటు కోసం నీచానికి దిగజారుతూ జనం
ఓటు కోసం గడ్డి తినే నాయకత్వం
దేవాలయ నియమాలకు భాష్యం చెప్పే న్యాయస్థానం
మసీదులూ చర్చిలకూ వేలెట్టి కెలకదేం
నా గుడిలో హుండీ సొమ్ము సర్కారుదా?
పది శాతం చర్చిల్లో వసూళ్ళు పాస్టర్లదా?
ఎండోమెంటు చట్టం రద్దు చేయమని అడగరేం?
శబరిమల ఆలయం సెక్యులర్ అంటాడా?
ఈ దేశంలో హిందువులకు విలువుందా?
మీ ఉదాసీనతే ఎదిరికి బలమని తెలుస్తోందా?
హిందువులారా మేలుకోండి.
ఓటడిగిన వారికి 'నోటా' తో బుద్ధి చెప్పండి.

         ముగురు బిడ్డల తల్లి.

సీ.
వినుత  సౌందర్యము మీదు  సొ త్తు కలదే
                  నూనూగు నెత్తావి నో యితరము
ప్రకృతిలో మీకొక స్థాన మున్నదని యా
                  క్రోశింతురే యెవ్వరున్ గడుసరి!
సుమతి! చాంచల్యము జెందనీకు మనసే
                మార్చన్ దలంచున్ సుమా మరిమరి
విగత వాదప్రతి వాదముల్ మరచి సాం
                  గత్యమ్ము సాగింపగా వలెనిక
తే.గీ./ఆ.వె
ఏల విరుల గోయు తలపదేల  మనుజు
లేల మిమ్ము త్రెంచెదరిక లేదదేల
మనిషి పై గురి కలదే లమకుడ నేను
సమ్మతింపరె నను జాల సరసిజములు.
(లమకుడు=ప్రియుడు)
ఈ సీస పద్యం మరో మూడు పద్యాలను కన్నది.
చూద్దామా:
1. మొదటి నాలుగు పాదాలలో తొలి అక్షరాన్ని ఆఖరి నాలుగు అక్షరాలను తొలగిస్తే మత్తేభం వస్తుంది.
మ.
నుత సౌందర్యము మీదు సొత్తు కలదే నూనూగు నెత్తావి నో
కృతిలో మీకొక స్థాన మున్నదని యాక్రోశింతురే యెవ్వరున్
మతి చాంచల్యము జెందనీకు మనసేమార్చన్ తలంచున్ సుమా
గత వాదప్రతివాదముల్ మఱచి సాంగత్యమ్ము సాగింపగా.
2.ఆట వెలది యధాతథంగా ఆ తేటగీతమే.
3. కందం.
ఏల విరుల గోయు తలప
దేల మనుజు లేల మిమ్ము త్రెంచెదరిక లే
దేల మనిషి పై గురి కల
దే లమకుడ నేను సమ్మతింపరె నను జాల్.
మనవి: కుసుమ వికాసం అనే ఓ ఖండిక. అందులో పూలు ఓ నరుని మధ్య వాద ప్రతివాదాలు జరిగి చివరకు ఒక ఒడంబడిక సాధిస్తారు. అందులో ఇదో గారడీ.
ఇది కూర్చడానికి రెండు రోజుల శ్రమ అవుసర పడింది.
చదివి తప్పొప్పులు సలహాలు తెలుప గలరు.

Tuesday, November 20, 2018

మధుర స్మృతులు


ఈ సిత శీత శరత్ చంద్రికలలో
నిండు పున్నమి నిశరాత్రి ఒంటరినై
గుండె లవిసి ఏకాంతంలో తెంపరినై
కడలి అలల కలల వీక్షణాతురుడనై
ఇసుక తిన్నెలపై అయోమయంగా
ఆశయ సాధనల కనునయంగా
తిలకిస్తూ తలపోస్తూ తపిస్తూ జపిస్తూ
నన్ను నేనే నిష్కర్షగా విమర్శించుకుంటూ
ఎదలో గాయాలను పరామర్శించుకుంటూ
మందస్మిత మలయ మారుత స్పర్శతో
కుందన్మయ నిలయ ధీరత్వపు టూహలతో
సుందర ఫేన తరంగపు అంతరంగంతో
వీచీ బాలికలతో మరీచికలతో సైకత రేణువులతో
ఎడద పరచి విడమరచి విలపించిన
ఆదమరచి మది తెరచి వినిపించిన
నా ఆక్రందనలెన్నో అశ్రుబిందువులెన్నో
కడలి కెరటాల మృదు వచో పలుకరింపుల
ఓదార్పుల కావల పిడికిలి బిగించి
కర్తవ్యతా దీక్షతో నడుం బిగించి
మరో పోరాటానికి బావుటా నెగరేసిన
మధుర స్మృతులెన్నో ఎన్నెన్నో
సాగర తీరం చూస్తే నెమరుకు వస్తాయ్
సుందర రామంగా ముందుకు నడిపిస్తాయ్.

కుసుమ వికాసం లో మరో వికారం:
కలువకు మిగతా పగటి పూలతో నప్పదు. సంపంగికి ఏ పూలతోనూ నప్పదు. ఓ మల్లె బాలతో నరుడు:
కం.
కలల మహా కలికి కలువ
తలవదు పూ బాలల నిక తను సకల తొగ
స్థుల పగ నైనా కోరను
................ . . . . . . . . . . . . . . . . . . . . . .
గమనిక:
నాలగవ పాదం పైన దాక్కుంది. వెతకండి.
పద్య తొలి అక్షరం నుంచి ఒకటి విడచి ఒకటిగా మూడవ పాదంలో 'నా' వరకూ తీసుకుంటే నాలుగవ పాదం వస్తుంది. అది
కలహాలిక వలదు బాల! కనుక తొలగనా?
(తొగ= కలువ , తొగస్థులు= కలువలు అన్నీ)
ఈ విన్యాసాన్ని పాద గోపనం అంటారు. 

కం.
నలువది యేల సృజించెనొ
కలువను వెన్నెల వెలుగుల కమనీయముగా
చెలువము జూడగ నిశలను
కలువను నిశాచ రులమె అకాలము కాదే.

Sunday, November 18, 2018

శిఖరిణి:
శివోహమ్మంచున్నే నహరహము పాసించుచు నినున్
శివా నాకీవా యియ్యదదియని ఆశించితినె ఏ
యవాంఛిత్సౌఖ్యంబుల్ యడిగితినె తాపత్రయ వినీ
త వైరాగ్యంబీవా భవభయ హరా తామస హరా

Friday, November 16, 2018

కుసుమ వికాసం లో మరో పద్యం.
మ.
తగునా మీరిటు మాటలాడు కొఱకా తత్        మానసోల్లాసముల్
మగువల్ మాలగ నౌదలల్ తురుమ మేమానంద మందంగ దా
సగమై స్రుక్కి చరింపగా మనసు నాసాంతంబు వేధింపగా
రగిలే గుండెల వేదనల్ నణచు వైరాగ్యంబు మీ కబ్బెడిన్.
గమనిక: ఇందులోంచి ఒక సీస పద్యం వస్తుంది.చూడండి.
సీ.
మీరిటు మాటలాడు కొఱకా తత్ మాన
                  సోల్లాసముల్  సొంపులు గనరొ
మాలగ నౌదలల్ తురుమ మే మానంద
                   మందంగ నోసిరి మల్లె లార
స్రుక్కి చరింపగా మనసు నాసాంతంబు
                   వేధింపగా గలవే బ్రతుకులు
గుండెల వేదనల్ నణచు వైరాగ్యంబు
                  మీ కబ్బెడిన్ కనుమీ నిజమ్ము
తే.గీ.
జగతి సృజియించు నప్పుడు జగతి కరు బ
లాఢ్యులల్ప జాతుల నెరలా జగతికి
నియమ మొసగె యీ తగువున నిరుపమ సరి
సమ తలపులు రావే? నవ సమత రాదె?
గమనిక: ఇందులోంచి ఓ కంద పద్యం వస్తుంది. చూడండి.
కం.
జగతి సృజియించు నప్పుడు
జగతి కరు బలాఢ్యు లల్ప జాతుల నెరలా
జగతికి నియమ మొసగె యీ
తగువున నిరుపమ సరిసమ తలపులు రావే?
( జగతికరు= సృష్టి కర్త అయిన బ్రహ్మ,
యీ తగువున = యీ తగువు కారణంగా)
దీనిని గర్భ కవిత్వం అంటారు.

Thursday, November 15, 2018


సీ.
కుసుమారి వైతివా పరిహాస శేఖరా
           సుమములే పడెనె నీ చురుకు కళ్ళ
మనసు లేదా నీకు మానవా? పరికింప
            వినిపించదా నీకు విరుల లొల్లి
కాసింత జాలి వలదె యిట్టి యలుసున్
             సంబరముగ నెంచ సంగి కుముద!
చూడ చక్కని పూల గొంతు కోసెద వౌర!
              సుతిమెత్తగ కనిపించు యభిరామ!
తే.గీ.
కోరి మాతోడ తగువేల కొనెడు యాశ
నేర్పు కూర్పుల బ్రతుకున నేమి కర్మ
స్తమిత హృదయ వికాశ యీ స్తవక మేల
మా తొలి తుదల గలుపు మమ్ము తెలియ.

Sunday, November 11, 2018

     निवेदन

मालूम् है किसको ये दुनिया
हर दंदा पर लूट मारे बनिया
आम आदमी कैसे गुजारे
शामना करते सवाल हजारे
महंगा है जीना न तो मरना
महंगा है जीवन गाडी चलाना
पैसे के पीछे दौढता जनता
स्वार्थ के प्रयास पर चमकता
स्वयं लाभ के शामने कमीने
रिस्त तोढकर भागता अभाग्य
श्वशुर के रूप मे नर रूप असुर्
पेट भरके दारू पीके हर हुजूर
हाथ जोढ के हे भगवान्!
समर्पित करता हूं ये निवेदन
हर प्राणि अपनी हिसाब से जीना
मुश्कराते हर शाम को घर पहुंचना
एक दूसरे पर जुलुम न चलाना.

Tuesday, November 6, 2018

1947 లో పడిసం పట్టింది

ఆచ్ ఆచ్ ఆచ్. నారాయణ నారా... ఆచ్ నారాయణ నారాయణ
ఏవండీ ఓ గోలీ మింగండీ లగాతార్ తుమ్ములొచ్చేస్తన్నాయ్.
ఆ. మరేం పరవా లేదు.
ఏంటి? చాలా పరవా ఉంది. పదండి డాక్టర్ దగ్గరికి చలేం.
రేపు చూద్దాం లే. కాస్త సంధ్య వార్చుకోనీ.
గరం పానీ లో ములగొచ్చు కదా. అన్నీ ఇలాగే.
రాత్రికి మీరు వేరే గదిలో పడుకోండి. నాకు చిట్టికి ఆ జుగామ్   తగిలించకండి.
ఆచ్.ఆచ్.
సరే. కాస్త మిరియాల చారు ఆవకాయ అన్నం రెండు పూటలు తింటే అదే తగ్గి పోతుంది.
రాత్రికి చావల్ ఎవరు తింటారు? గాంవ్ వాలా .
రోటీలోకి రసం ఏంటి ? బంద్ గోబీ సబ్జీ అంది.
సంధ్య వార్చుకుని బయటకు వచ్చేసరికి కేబ్ బుక్ చేస్తోంది తను.
పదండి. పదండి. డాక్టర్ దగ్గరకి.
1947 లో దేశానికి స్వతంత్రం వచ్చింది 2015 లో నాకు పెళ్ళయి ఉన్న స్వతంత్రం ఊడింది.
ఖర్మకాలి మోదీ రోడ్ కాంప్లెక్స్ క్వార్టర్ నెం. 1947 లోనే నివాసం.
రోజూ గుర్తుచేసుకుంటూ ఏడ్చు కొనేలా.
సరే. కేబ్ రానే వచ్చింది. డాక్టర్ దగ్గరకు వెళ్ళారు.
ఏంటి కంప్లయింట్ అంటూ డాక్టర్ అడిగేసరికి
హోతా క్యా? దహీ చావల్ ఖాతా ఔర్ కిసీ న కిసీ తకిలీఫ్ లాతా హై.
What did u take in the afternoon?
లస్సీ కాకడ్ దహీ చావల్. ఆమే ఏకరవ్ పెడుతోంది.
No.Sirఅతను ఏదో చెప్పేలోగా మరలా ఆమే
ఇన్ కో సూంయీ లగావో. రాత్ కో బిల్ కుల్ సోజానా.
డాక్టర్ ఏవో మాత్రలు రాసిచ్చాడు.
హమ్ కో సోనా నహీ దేగా. చీంక్ తే రహేగా.
సోజానే కే లియే కుచ్ కరో. అంది.
విధిలేక sleeping pill ఒకటి ఇచ్చాడు డాక్టర్.
రాత్రికి భోజనం లేదు. రొట్టె తను తినడు. అన్నం ఆమె పెట్టదు.
సరే గ్లాసుడు పాలతో సరి పెట్టుకున్నాడు.
హాల్లో దివాన్ మీద పడుకోమంది ఆమె.
ఉదయం నాలుగున్నరకే నిద్ర లేచే అలవాటు అతనిది.
కాని ఈరోజు నాలగు గంటలకే లేచినా ఉదయాన్నే తిట్లు తిన లేక ఆగాడు. అయిదయ్యేసరికి ఆమె లేచి వచ్చింది. తొలి హుకుం. ఈరోజు తలస్నానం చేయరాదు. బొంబాయి రవ్వ ఉప్మా టిఫిన్. మద్యాహ్నం కేంటీన్ లో సాంబారు అన్నం తినాలి.
మరి సంధ్యావందనం ఎలా? అడిగాడు.
ఒకరోజు చేయకపోతే కొంప ములిగిపోదు.
మరేం ఫరవాలేదు.
పోనీ ఆఫీసు కి శెలవు పెట్టనా?
తీరి కూచ్చుని తుమ్ముకో వచ్చనా?
సాయంత్రానికి జుగామ్ తగ్గిపోవాలి. లేకపోతే ఊరుకోను.
నారాయణ. నారాయణ. కిం కర్తవ్యం?
అయ్యగారి పని అవుట్
1947. ఆ నెంబరు చూస్తేనే కంపరం.
బుద్ధి ఉన్న వాడెవడూ పెళ్లి చేసుకో కూడదు. ఒకవేళ చేసుకున్నా సరే ఉద్యోగం చేసే పిల్లని అసలే చేసుకో కూడదు.
నచ్చిన డ్రస్ వేసుకునే వీలు లేదు. నచ్చినట్టు భోంచేసేే వీలు లేదు. నోరు విప్పి మాటాడే వీలు లేదు.
మరెందుకీ వ్యధ. చెప్పండి మై డియర్. అను క్షణం వెక్కిరిస్తూ 1947ఒకటి.
స్వేచ్ఛా స్వతంత్రాలు బంగాళా ఖాతంలో పారేసి ఆశలూ ఆశయాలు ఆర్కే బీచ్ లో వదిలేసి ఆత్మాభిమానం ను అంగడిలో అమ్మేసి పనికి మాలిన పని ఎందుకుచేయాలి?
1947 లో పడిశం పట్టింది అని ఓ ఉత్తరం వ్రాసి ఆత్మహత్య చేసుకోవడం బెటరేమో.

Monday, November 5, 2018

కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్

కం.
రామా? కురర కుమారా?
పోమా? పోరేల నేల రేపో మాపో
కామా మేమే, మాకా
చేమాకుల మాలపూల మాలకు మాచే.
వివరణ:
ఇటువంటి పద్యం కూర్పుకే ప్రాధాన్యం కాని అర్థ గాంభీర్యానికి సాధించడం కష్టం.
1.కురర= గోరువంక
2.  పోరేలను + ఏల
4. చేమా = చేయమా, కులము+ఆల= మాకులము యొక్క ఉపకరణము
గొరవంకలా అందమైన ఓ మనిషీ! నీ అక్కరకు మేము (పువ్వులము) రేపో మాపో రామా పోమా?
ఆకులు పూలు కలిపి అల్లే మాలకు మా విరి కులపు ఉపకరణముగా ఆ మాలకు ఉపకరించమా?
2. కం.
నాచే లింగా! బగబగ
గా చిరు రుచిగా గబగబ  గాలించేనా?

ప్రాప్త కాలజ్ఞత

మరణం అది అనివార్యం
ప్రతి జీవికీ ప్రారబ్దానుసారం
కాలుని కొలువులో వ్యవహారం
సిఫారసులకు మినహాయింపులకు
ఆమడ దూరం
అందుకే ఆయన సమవర్తి
స్వ పర బేధం లేని వ్యక్తి
ఉన్నంత కాలం ఉన్నంతలో కొంత
మంచి కోసం మంది కోసం
శెలవు చేస్తే నెలవు చేస్తే
ఉపకారం ఊరకనే పోతుందా
సహకారం మరచే వీలుందా
మూటగట్టి దాచబెట్టి దోచి పెట్టడమా?
మనసు విప్పి మాట చెప్పి ఆదుకోవడమా?
కన్న పిల్లలకే సమ న్యాయం చేయలేని
తన స్వార్థానికి వాడుకునే ఎవరేని
వారు మనుషులా? మరుగుజ్జులా?
మనం చేసిన అన్యాయాలు అక్రమాలే
అంతిమ శ్వాసకు సోపానాలు
అది తెలుసుకోకనే తగాదాలు.
ప్రాప్తా ప్రాప్తతలు ప్రాప్త కాలజ్ఞతలు
మన తలపుల చేతల ఫలితాలు.