Monday, November 5, 2018

ప్రాప్త కాలజ్ఞత

మరణం అది అనివార్యం
ప్రతి జీవికీ ప్రారబ్దానుసారం
కాలుని కొలువులో వ్యవహారం
సిఫారసులకు మినహాయింపులకు
ఆమడ దూరం
అందుకే ఆయన సమవర్తి
స్వ పర బేధం లేని వ్యక్తి
ఉన్నంత కాలం ఉన్నంతలో కొంత
మంచి కోసం మంది కోసం
శెలవు చేస్తే నెలవు చేస్తే
ఉపకారం ఊరకనే పోతుందా
సహకారం మరచే వీలుందా
మూటగట్టి దాచబెట్టి దోచి పెట్టడమా?
మనసు విప్పి మాట చెప్పి ఆదుకోవడమా?
కన్న పిల్లలకే సమ న్యాయం చేయలేని
తన స్వార్థానికి వాడుకునే ఎవరేని
వారు మనుషులా? మరుగుజ్జులా?
మనం చేసిన అన్యాయాలు అక్రమాలే
అంతిమ శ్వాసకు సోపానాలు
అది తెలుసుకోకనే తగాదాలు.
ప్రాప్తా ప్రాప్తతలు ప్రాప్త కాలజ్ఞతలు
మన తలపుల చేతల ఫలితాలు.

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home