గజమాల
మ.
మదిలో నాహృదిలో తలో తలపులో మాయా వివేకంబులో
పదిలో యొక్కటి కూడ తా జరుగ రాబోదే అవత్యాశలో
హృదయాకాశము నెమ్మదించినచొ సుహృత్కూమ మందంతటన్
పదిలమ్మై విరబూయవే విమల సద్భక్త్యార్తి కెందామరల్
ఇదిగో నీ సుతు డెంతవాడొ కనుమీ నీపై తదేకంబుగా
కుదురుంబోవగ పద్యముల్ నుడువు శ్లోకంబుల్ వినమ్రంబుగా
సదసద్భావన లిచ్చి పల్కులకు సత్సౌందర్య ముక్తావళీ
ప్రద కంఠాభరణమ్ముగా తలచి సుప్రాలంబమీవమ్మ శా
రద పూర్ణేందు నిభాననా! యచలజా శ్రీవిద్యా పరా శాంకరీ
తుది శ్వాసం విడు దాక నీ స్మరణ చేతోమోదమై కొల్వగన్
పదవిన్యాసములున్ కడుంకడుగ నీ పైనట్లు కూర్చుచున్
ఎదురై కింకరుడై నవావరణ సంవేద్యంబునై హోతయై
మదినెల్లప్పుడు నామమే స్మరణమో మంత్రార్థమో మంత్రమో
సదసత్తంత్రమొ రూపమో సవన సౌశీల్యమ్మొ మీనధ్వజమో
మెదలన్ నేర్చిన జాలు నా మనసు సమ్మోహంబుగా నుండగా
వదలన్ బోవక సాగిపోవలెను వైవిధ్యంబుగా చల్లగా
ఇది సంకల్ప బలమ్మొ నీ దయయొ ఈప్సిత్సిద్ధి నీ యిచ్ఛయే
కద శర్వాణి! సనాతనీ!పరుల! శాంకర్యంబికా! కాళి! నీ
పద సాన్నిధ్యము నీ పదార్చనలు ప్రాప్తోద్యద్వరమ్మౌ గదే
పదిమందైనను బాలికల్ మిగుల సంప్రాప్త్యార్హులై నా వలన్
కుదురున్ బొందిన జాలు మెరికల్ గ్రామీణ బాలికల్
గదిలో మ్రగ్గిన కూనలై మసలు మాతాపితృలే దూబరా
ముదితా విద్యకు ఖర్చుయంచనెడు దుర్మార్గుల్ మరింకెందరో
అదియే నాకొక మోక్షమంచు యది మోక్షాధిక్యమంచున్ సదా
మది లో మెల్గెడి నా తలంపులకు యే మేలాటముల్ లేక నీ
కిది మేలంచనవే శివే! జనని! శ్రీ కైవల్య పాంథుండ
నా

0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home