Tuesday, November 6, 2018

1947 లో పడిసం పట్టింది

ఆచ్ ఆచ్ ఆచ్. నారాయణ నారా... ఆచ్ నారాయణ నారాయణ
ఏవండీ ఓ గోలీ మింగండీ లగాతార్ తుమ్ములొచ్చేస్తన్నాయ్.
ఆ. మరేం పరవా లేదు.
ఏంటి? చాలా పరవా ఉంది. పదండి డాక్టర్ దగ్గరికి చలేం.
రేపు చూద్దాం లే. కాస్త సంధ్య వార్చుకోనీ.
గరం పానీ లో ములగొచ్చు కదా. అన్నీ ఇలాగే.
రాత్రికి మీరు వేరే గదిలో పడుకోండి. నాకు చిట్టికి ఆ జుగామ్   తగిలించకండి.
ఆచ్.ఆచ్.
సరే. కాస్త మిరియాల చారు ఆవకాయ అన్నం రెండు పూటలు తింటే అదే తగ్గి పోతుంది.
రాత్రికి చావల్ ఎవరు తింటారు? గాంవ్ వాలా .
రోటీలోకి రసం ఏంటి ? బంద్ గోబీ సబ్జీ అంది.
సంధ్య వార్చుకుని బయటకు వచ్చేసరికి కేబ్ బుక్ చేస్తోంది తను.
పదండి. పదండి. డాక్టర్ దగ్గరకి.
1947 లో దేశానికి స్వతంత్రం వచ్చింది 2015 లో నాకు పెళ్ళయి ఉన్న స్వతంత్రం ఊడింది.
ఖర్మకాలి మోదీ రోడ్ కాంప్లెక్స్ క్వార్టర్ నెం. 1947 లోనే నివాసం.
రోజూ గుర్తుచేసుకుంటూ ఏడ్చు కొనేలా.
సరే. కేబ్ రానే వచ్చింది. డాక్టర్ దగ్గరకు వెళ్ళారు.
ఏంటి కంప్లయింట్ అంటూ డాక్టర్ అడిగేసరికి
హోతా క్యా? దహీ చావల్ ఖాతా ఔర్ కిసీ న కిసీ తకిలీఫ్ లాతా హై.
What did u take in the afternoon?
లస్సీ కాకడ్ దహీ చావల్. ఆమే ఏకరవ్ పెడుతోంది.
No.Sirఅతను ఏదో చెప్పేలోగా మరలా ఆమే
ఇన్ కో సూంయీ లగావో. రాత్ కో బిల్ కుల్ సోజానా.
డాక్టర్ ఏవో మాత్రలు రాసిచ్చాడు.
హమ్ కో సోనా నహీ దేగా. చీంక్ తే రహేగా.
సోజానే కే లియే కుచ్ కరో. అంది.
విధిలేక sleeping pill ఒకటి ఇచ్చాడు డాక్టర్.
రాత్రికి భోజనం లేదు. రొట్టె తను తినడు. అన్నం ఆమె పెట్టదు.
సరే గ్లాసుడు పాలతో సరి పెట్టుకున్నాడు.
హాల్లో దివాన్ మీద పడుకోమంది ఆమె.
ఉదయం నాలుగున్నరకే నిద్ర లేచే అలవాటు అతనిది.
కాని ఈరోజు నాలగు గంటలకే లేచినా ఉదయాన్నే తిట్లు తిన లేక ఆగాడు. అయిదయ్యేసరికి ఆమె లేచి వచ్చింది. తొలి హుకుం. ఈరోజు తలస్నానం చేయరాదు. బొంబాయి రవ్వ ఉప్మా టిఫిన్. మద్యాహ్నం కేంటీన్ లో సాంబారు అన్నం తినాలి.
మరి సంధ్యావందనం ఎలా? అడిగాడు.
ఒకరోజు చేయకపోతే కొంప ములిగిపోదు.
మరేం ఫరవాలేదు.
పోనీ ఆఫీసు కి శెలవు పెట్టనా?
తీరి కూచ్చుని తుమ్ముకో వచ్చనా?
సాయంత్రానికి జుగామ్ తగ్గిపోవాలి. లేకపోతే ఊరుకోను.
నారాయణ. నారాయణ. కిం కర్తవ్యం?
అయ్యగారి పని అవుట్
1947. ఆ నెంబరు చూస్తేనే కంపరం.
బుద్ధి ఉన్న వాడెవడూ పెళ్లి చేసుకో కూడదు. ఒకవేళ చేసుకున్నా సరే ఉద్యోగం చేసే పిల్లని అసలే చేసుకో కూడదు.
నచ్చిన డ్రస్ వేసుకునే వీలు లేదు. నచ్చినట్టు భోంచేసేే వీలు లేదు. నోరు విప్పి మాటాడే వీలు లేదు.
మరెందుకీ వ్యధ. చెప్పండి మై డియర్. అను క్షణం వెక్కిరిస్తూ 1947ఒకటి.
స్వేచ్ఛా స్వతంత్రాలు బంగాళా ఖాతంలో పారేసి ఆశలూ ఆశయాలు ఆర్కే బీచ్ లో వదిలేసి ఆత్మాభిమానం ను అంగడిలో అమ్మేసి పనికి మాలిన పని ఎందుకుచేయాలి?
1947 లో పడిశం పట్టింది అని ఓ ఉత్తరం వ్రాసి ఆత్మహత్య చేసుకోవడం బెటరేమో.

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home