కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్
కం.రామా? కురర కుమారా?
పోమా? పోరేల నేల రేపో మాపో
కామా మేమే, మాకా
చేమాకుల మాలపూల మాలకు మాచే.
వివరణ:
ఇటువంటి పద్యం కూర్పుకే ప్రాధాన్యం కాని అర్థ గాంభీర్యానికి సాధించడం కష్టం.
1.కురర= గోరువంక
2. పోరేలను + ఏల
4. చేమా = చేయమా, కులము+ఆల= మాకులము యొక్క ఉపకరణము
గొరవంకలా అందమైన ఓ మనిషీ! నీ అక్కరకు మేము (పువ్వులము) రేపో మాపో రామా పోమా?
ఆకులు పూలు కలిపి అల్లే మాలకు మా విరి కులపు ఉపకరణముగా ఆ మాలకు ఉపకరించమా?
2. కం.
నాచే లింగా! బగబగ
గా చిరు రుచిగా గబగబ గాలించేనా?
0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home