Monday, April 30, 2018

ట్రెండ్ మారింది


చిట్టి కాస్త పొట్టిదే గాని బుఱ్ఱ నిండా పుట్టెడు బుద్ధులు.
ఉల్లిపాయ పొరల్లాగ ఒలచిన కొద్దీ ఘాటు ఎక్కువ.
నిన్ననే పదో తరగతి ఫలితాలు వచ్చాయికదా. అప్పటి నుంచి మూగనోము పట్టింది. పదికి పది మార్కులు రాలేదని చిఱ్ఱు బుఱ్ఱు మంటోంది.
నేను అక్కడ చదవను గాక చదవను అంటే విన్నారా? పంతులుగారి స్కూల్లో వేసారు. అందుకే ఇలా అయింది. ఆయన అన్నీ నీతులు చెబతాడు. కడిగీసిన ముత్యంలాగ కూర్చోవాలి అంటాడు. లైఫ్ లో ఎంజాయ్ మెంట్ అఖ్ఖరలేదా?
అతను ప్రవరాఖ్యుడైతే కావచ్చును కాని నేను పదహారేళ్ళ సగటు ఆడపిల్లను అంతే.
'దృష్టి 'స్కూల్లో బడుద్దాయ్ సోము , అల్లరి హరి ఏవరేజ్ గా చదివే కవిత అందరికీ పదికి పది నాకేమో 9.6 ఎంత ఘోరం?
వాళ్ళేమో పుస్తకాలు దగ్గర పెట్టి రాయించారు పరీక్షలన్నీ. ఫుల్ కాకపోతే నిల్ వస్తాయా?
నీతి నిజాయితీ ఎవడిక్కావాలి? ఫుల్ మార్కులు కావాలికాని.
వాళ్ళ అమ్మ మీద కోడె త్రాచులా బుసకొడుతోంది చిట్టి.
నైతిక విలువలు సిద్ధాంతాలు కడుపు నింపుతాయా?
శాంతారామ్ ఆఫీసునుంచి కాస్త తొందరగానే వచ్చేసాడు. టైమ్ ఏడే అయింది.
చిట్టీ నీకు మంచి రేంకే వచ్చిందమ్మా. అలా వాపోతే ఎలా?లేకపోతే భోరున ఏడవాలా? అంది చిట్టి.
చూచికాపీలు స్లిప్పులూ మనలాంటి వారు చేసే పనులు కాదమ్మా అంటూ తండ్రి.
ఎప్పుడు మామాట విన్నారు కనక మేం బాగు పడ్డానికి అంటూ ఆటం బాంబులూ శతఘ్నులు పేల్చడం మొదలెట్టింది భార్య భగళ. అసలే ఆమె నిప్పులు తోక్కిన కోతి.
శాంతారామ్ నిజంగానే శాంతమూర్తి. మన పిల్ల ని మంచి కాలేజీలో చేరుస్తున్నాను కదా. ఆ తర్వాత ఈ మార్కులెందుకూ పనికి రావు. రెండేళ్ళు కష్ట పడితే ఐఐటి సీటు వస్తే చాలదా అన్నాడు

Thursday, April 26, 2018

అమ్మలు - పై చదువు

అనుకున్నదొకటి అవుతున్నదింకొకటి
ఆశపడినదొకటి అంటకడుతున్నదింకోటి
ఎటూ పాలుపోని వైనం అంతా అయోమయం
ఎదనొడ్డి ఎదురించి సాధించి చూపించనా
అణకువతో హతవిధీ అని భరించనా
జీవితాన్ని ఫణంగా పెట్టి పోరాడనా
జీవితాశయాలను అటకెక్కించనా
ఎటూ పాలుపోని వైనం అంతా అయోమయం
నా మూగవేదనను ఆ పరాత్పరుడు వినడా
పగవారికి కూడా వద్దు ఈ దురవస్థ
తను పట్టిన కుందేటికి మూడే కాళ్ళంటూ ఒకరు
తన మాటను కాదన్నందుకు మౌనంగా ఇంకొకరు
ఎటూ పాలుపోని వైనం అంతా అయోమయం
పంతాలకు పోకుండా భవిత తీర్చి దిద్దే పెద్దలేరి
పరమేశ్వరా తప్పులెంచక మన్నించవా ఓ సారి
కన్న తండ్రి కి దయలేదు అభిమానించిన వారికి జాలి లేదు
ఆకాసంలోనే ఆనందంగా చదువకోలేనా
శశి వికాసం వృద్ధి క్షయాల గందరగోళం
నా మెడలో కట్టేసిన గుదిబండ కాదా
నా కెందుకీ శిక్ష? నా మీద దేనికీ కక్ష?
ఎటూ పాలుపోని వైనం అంతా అయోమయం.


Monday, April 23, 2018

అన్వేషణ

ఆరు పదుల వయసులో కూడా
ఇంకా అన్వేషిస్తూనే ఉన్నా
నన్ను నన్నుగా ప్రేమించే
ఓ ఆలోచనా తరంగాల
సమ ఉజ్జీ కోసం
భావ సారూప్యతా
విశాల హృదయం కోసం.
ఎందుకో
కపటం లేని ప్రేమా
స్వార్థం లేని స్నేహం
తారసపడటం లేదు
ఊహల ఉయ్యాలలో ఊగాడినా
ఆశల పల్లకిలో ఊరేగినా
ఆశయాల ఆకాసంలో తిరిగాడినా
అవమానాల కొలిమిలో కాలినా
అభిశంసనల రొచ్చులో మునిగినా
ఏకాంతంగానే నాలో నేనే
అధరాధరాన్ని పై పంటితో నొక్కి
అశృబిందువుల కనుకొలకులలో
అదిమి పట్టి ఆత్మావ లోకనంతో
గమిస్తున్నా   శ్రమిస్తున్నా
ఆది దంపతుల సన్నిధానం
నా మనో మందిరంలో కల్పించుకుని
నమ్ముకున్న సిద్ధాంతాలతో
అమ్మలమ్మయే సర్వస్వంగా
పరసుఖానందమే పరమావధిగా
అనుక్షణం అహరహం
ఆలోచిస్తూ విలోకిస్తూ
చూస్తున్నా చేస్తున్నా ఛస్తున్నా.

Saturday, April 21, 2018

వనితా

లోకానికి అందం ఆనందం మన అబల
సృష్టిక్రమంలో బీజావ్యాపనానికి క్షేత్రం
పాపాయి  కాదది  ఓ జాబిలి కూన
సిరిమువ్వల సవ్వడితో పలుకరించే సిరి
చిరునవ్వుల సందడితో కనిపించే గౌరి
అనుష్టానంలో ఎందరినో అలరించే బాల
ఈడేరిన మరునాడే బంధనాల బేల
పురుషాధిక్యపు లోకంలో అణగారనదేల?
చెల్లిగా చెలియగా వధువుగా అర్థాంగిగా
అమ్మగా అమ్మమ్మగా నానమ్మగా తాతమ్మగా
ఎదిగిన కొద్దీ ఒదిగే ఉంటూ
ఒబ్బిడిగా సర్దుకుపోతూ
అన్ని పాత్రలలోనూ
పరోపకారమే పరమావధిగా
లాలనగా లలనగా ఏలనగా?
ఆలంబన తానే అని తెలిసి
అవకాశం వేరే లేదని తెలిసి
తెలివిగా పెదవి విప్పని వనితగా
సాగడమే మేలని తెలిసి
నిస్వార్థ సేవకు నిలువెత్తుగా నిలచి
అలరించే మురిపించే మైమరపించే
ఓ వనితా నీకిదే నావందనం.


Thursday, April 19, 2018


అభిమానించడం ఓ పాపం
అనుమానించడం ఓ నేరం
అవమానించడం ఒక ఘోరం
ఏది ముదిరినా అశాంతి ఖాయం
కంటి నిండా నిద్ర మాయం
ఆపై ఏమీ తోచని అయోమయం
ఉపకారం చేసినా
ఊడిగం చేసినా
రాతి గుండెలు కరుగవు
కోతి బుద్ధులు తరుగవు
ఏమన్నా అంటే జట్టు పీస్
జాలి దయ గౌరవం అభిమానం
భూతద్దం పెట్టి వెదకినా కానం
ఇదండి మా అమ్మాయిల వరుస.

ఆశ పడితే తప్పా?

పిల్లలంటే ఎంతో ఇష్టం
పిల్లలతోటే ఈ జీవితం
పిల్లలే నాకు సమస్తం
తెలివైన అమ్మాయిలు
ఎవరైనా నాకెంతో ఇష్టం
అలాంటి ఓ అమ్మాయి
ఏడెనిమిదేళ్ళ పాపలా
బాలా మంత్ర జపంలో
తరచూ కనిపించితే
అభిమాన పుత్రిక అని
ఆశ పడితే తప్పా?
కూతురని చేరదీస్తే తప్పా?
సగం బాధ్యతే నాదంటే తప్పా?
నగ ఇస్తే వాటా ఇస్తే తప్పా?
చదువుకు సగం ఖర్చు నాదంటే తప్పా?
నామీద కూడా ప్రేమ ఉండాలంటే తప్పా?
నన్నూ ఓ తండ్రిగా గురువుగా చూడాలంటే?
గురువుగా నా మాట వినమంటే తప్పా?
వినకపోతే బాధపడటం తప్పా?
నా బాధ చెప్పుకోడం తప్పా?
నే బాధపడుతూ బలవంతంగా
నేనెప్పుడూ ఏమీ చేయలేదే
నాకిష్టం లేని పనిచేస్తే నా మనసు రోదిస్తే
ఆ బాధలో నేనేదైనా అంటే
నా కంట పడకుండా 
నా నీడ పడకుండా
గోడ కట్టేస్తారా?
నన్ను వెలివేస్తారా?
నా ఆశ అడియాశ చేసేస్తారా?

Sunday, April 15, 2018

తెనుగు

అమ్మ బాస

సీ.
శ్రీ లలితా దేవి శ్రీ చక్ర యాన
              శార్దూల వృత్తంపు పద్య మన్న
జంభారి వహనపు అంబారి ఘనమద
              గజయాన మత్తేభ పద్యమన్న
శ్రీ కృష్ణు కంఠాన చెంగల్వ పూదండ
              ఉత్పల మాలయన్ వృత్తమన్న
ముగురు అమ్మల మెడన్ ముగ్ధ సౌవర్ణ పూ
                 మాలయే చంపక మాల యనిన
తే.గీ.
  తేనె లొలికేటి తెలుగింటి తేటగీతి
  మాడ వీథుల విహరించు ఆటవెలది
  కలిమి ద్విపద సీసములు మా కందమగును
  భువికి దివిటీలు తెలుగున పద్య ములన.

విచక్షణనీవే

మనసు వెన్నపూస
మాట ఓ మణిపూస
చేత చక్రాయుధం
చేవ వజ్రాయుధం
మనసులు తొలిచే ఆవేదన
మనసులు గెలిచే సంభాషణ
ఈసడింపులూ వెక్కిరింతలూ
ఆక్రోశాలు ఉక్రోషాలు ఆవేశాలు
అన్నిటినీ మౌనంగానే భరిస్తూ
అన్నిటికీ మౌనంగానే బదులిస్తూ
వివేకంతో సంయమనంతో
అనుసరించితేనే  విజయం
అనునయిస్తేనే నవజీవనం
అన్నంపెట్టి ఆదరించే హస్తం
అదమాయిస్తే పురమాయిస్తే
తప్పులెంచాలా? తప్పుకు పోవాలా?
కూడనిదేదో కాకూడనిదేదో
తేట పరిస్తే గర్హిస్తే
తప్పుపడతామా? లెంపలేసు కుంటామా?
గుండెల మీద చేయుంచి
ఆత్మ విమర్శ చేసుకుంటే
తప్పేమిటో ఎవరిదో ఎఱుకౌను
సరిదిద్దుకోవడం ఆపై చేతనౌను
అనుబంధం పెనవేసుకున్నాక
ఆప్యాయతలు పెంచుకున్నాక
నాది అన్నభావనే అనర్థాలకు మూలం
నాది కాదనుకుంటే అంతా ప్రశాంతం
నాది అనుకుంటేనే అజమాయిషీ
అనుక్షణం సాధించితేనే నగిషీ
కావాలి నా బాల ఓ విదుషి
యుక్తాయుక్త విచక్షణ నీవే షోడశీ.



Friday, April 13, 2018

నీకో వందనం

అభిమానించనేల  అవమాన పడనేల
ఆరోపించనేల ఆక్రోసించనేల
అడుసు తొక్కనేల కాలు కడుగ నేల
దూరంగా మౌనంగా  నిమ్మళంగా ఉంటే పోలా?(పోదా)
ఎవరికి వారే యమునా తీరే
నీ దారి గోదారి నా దారి రహదారి
అని సరిపెట్టుకుని
చేతులు ముడుచుకు కూర్ఛోరాదా
ఏవరినో ఉద్ధరించాలనీ ఏదో చేయాలనీ
నీ కెందుకు పనికిమాలిన
ఆరాటం ఓ ప్రక్క పోరాటం మరో ప్రక్క
లబ్ది గ్రహీతలే సిద్ధాంతాలను పరిహసిస్తే
అపహాస్యం చేస్తే అవహేళన చేస్తే
కిం కరోమి? కిమర్థమేన ఏతత్కార్యం కరోమి?
అని నా మనసడిగే ప్రశ్నలకు బదులేది?
కూడదన్న పనే చేస్తే
కూడకూడని వారితో జత కూడితే
ఇంకా ఎందుకు వారి కోసం నీ  ఆరాటం
అని నా మనసే నన్ను నిలదీస్తే భోరున విలపిస్తే
ఎంగిలి మెతుకులు ఏరుకు తినాలని చూస్తే
వసాగంధిల శల్యమునకు రుచి మరిగితే
కుక్క పిల్ల కాదది నక్క వినయపు కోతి పిల్ల
విశ్వసించడం విస్తుపోవడం నీ వంతు
ఎంతజెప్పినా ఏమి చేసినా మరలా అదే తంతు
విధి బలీయసీ నీకో వందనం
హతవిధీ పరిహసీ నీకో వందనం.
(కిం కరోమి= ఏంచేయను, కిమర్థమేన కరోమి= ఎందు కోసం చేయను, వసాగంథిల శల్యము= వాసన లేని ఎముక)

Sunday, April 8, 2018

సోపానములు

విశ్వాశం విన్నపానికి ముందు
అవిశ్వాసం అపనమ్మకానికి తదుపరి
విమర్శల పరంపర అభిమానపు గోడలపై
స్తుతి విశ్రుతులు స్వలాభాపేక్షకు పునాదులు
ఆర్జనతోనే వ్యయ ప్రయాసల ఒడిదుడుకులు
స్వార్జితం తోనే పుణ్య కార్యాలు శాంతి సౌఖ్యాలు
ప్రశాంత జీవన గమనానికి ఈ బాటలే రహదారులు
వితరణ తోనే ఆర్జనకు సార్థకత
వైతరణి లోనే అఘమర్షణ  సాఫల్యత
పరోపకారం తోనే భాగ్యోదయం
పరేంగితం తెలిస్తేనే సౌభాగ్యం
ఇవే
ప్రశాంత జీవన గమనపు రథ సారథులు
నిరంతర ప్రయత్నం తోనే లక్ష్య సాధన
అవుసరాలకై అన్వేషణలోనే ఆవిష్కరణ
అనుదిన మౌన పోరాటంతోనే నిష్క్రమణ
జీవిత సాఫల్యానికి ఇవే సోపానాలు.


Wednesday, April 4, 2018

పిలచేనా ఓ మారైనా

తలపు తలుపుల క్రీనీడ
తూగాడుతూ తారాడితే నా నీడ
ఈ క్షణ వీక్షణ ఈక్షణములు
నాకోసం నా పలుకరింపుల కోసం
ఆరాట పడితే మధన పడితే
కను కొలకుల కొనలలో
అస్పష్ట అన్వేషణల ఆర్తి
సుదూర తీరాలలో మమతల దీప్తి
అందుకుంటే ఆదుకుంటే
సంభ్రమాశ్చర్య దృగ్గోచరం
కాకుంటే అది క్షణికం
స్వాప్నిక గగన విహారంలో
మరపు రాని సౌదామిని
చతురంత యానస్థిత భామిని
నా పద కవితా నవ పేశల ధ్వని
విని నను గని వాటేసే సుధీత
పిలిచేనా ఓ మారైనా నా కలకూజిత?
(ఈక్షణములు=కన్నులు;   సౌదామిని=మెఱుపు; చతురంత యానము=పల్లకి;
సుధీత=కూతురు)

Sunday, April 1, 2018

ముక్తసరి

మనసు విప్పాలని ఉంది
తలపు తెలుపాలని ఉంది
అయినా అభిజాత్యం అడ్డురాగా
అందుకే ఒకటి అరా
ముక్తసరి మాటలు మనసు
ఊరించే ముత్యాలు
అడిగించు కోవడం ఓ దురదా
బ్రతిమాలించు కోడం బలే సరదా
మనసు విప్పాలనిపిస్తే
గలగలా గోదారిలా ఉప్పొంగి పోవాలి
గబగబా మా కూనలా ఊసులెన్నో చెప్పాలి
శ్రోతనై ఉబ్బి తబ్బిబ్బై ఆనంద పడాలి
అంతరాలు పెరిగిన కొద్దీ
అభిమానం తరుగుట ఖాయం
అభిమానించ లేకుంటే
అవమానించడం మానకుంటే
ఎవరికి నష్టం తెలుసుకో నేస్తం
పొడి పొడి మాటలు ఒకటీ అరా
అవి కూడా దాచుకుంటే కాదా
ఎందుకు ఎరువు తెచ్చుకునే చిరునవ్వు?
ముందుకు కలత మిగిలించే గులాబీ పువ్వు.

ఉ.
లెక్కకు మించి చేయ తలపెట్టితి  సేవలు వేనవేలుగా
అక్కర లేని సంశయము లా సరి జూచిన విస్తు పోవలెన్
ముక్కున వేలు వేసుకొని ఉన్నతి గోరి సమాదరంబుగా
గ్రక్కున ఆప్త హస్త మిడ గా నిధి నొక్కటి కూర్చి నంతటన్.

పలుకే బంగారమా

పలుకే బంగరమా  నీ
కులుకే ఒయ్యారమా
మౌనమే ఓ అలంకారమా
మటుమాయమే సౌభాగ్యమా
నీ లక్ష్యమే అపురూపమా
నిర్లక్ష్యమే నీ సౌశీల్యమా
కృతజ్ఞతకు ఆమడ దూరమా
కృతఘ్నతే నీ సహజ గుణమా
పరేంగితం నీ కనవసరమా
పరోపకారం మహా నేరమా
అహంభావమే నీ కాభరణమా
సాదర సంభాషణే శిరోభారమా
కానకళ్ళ నుంటేనే అవగతమా
కట్టెదుట నిలుచుంటే అవనతమా
కలసి నడిస్తే అవమానమా
కనులనిండా అనుమానమా
పలుకే బంగారమా నీ
మనసే పాదరసమా

మ.
కవి నంచున్ పవి నంచు పెద్ద లెదుట హుంకారమ్ము నే జేయ లే (దు)
భువి భూలోకము నంతటన్ దిరిగి సంభాషింప లేదెప్పుడున్
చివురింపన్ చిరు కోర్కె నేర్చితిని వచ్చీ రాని పద్యమ్ము లన్
కవితల్ వ్రాయుట దంత అక్షర సువిన్యాసంబె. కాదందురే?