Saturday, April 21, 2018

వనితా

లోకానికి అందం ఆనందం మన అబల
సృష్టిక్రమంలో బీజావ్యాపనానికి క్షేత్రం
పాపాయి  కాదది  ఓ జాబిలి కూన
సిరిమువ్వల సవ్వడితో పలుకరించే సిరి
చిరునవ్వుల సందడితో కనిపించే గౌరి
అనుష్టానంలో ఎందరినో అలరించే బాల
ఈడేరిన మరునాడే బంధనాల బేల
పురుషాధిక్యపు లోకంలో అణగారనదేల?
చెల్లిగా చెలియగా వధువుగా అర్థాంగిగా
అమ్మగా అమ్మమ్మగా నానమ్మగా తాతమ్మగా
ఎదిగిన కొద్దీ ఒదిగే ఉంటూ
ఒబ్బిడిగా సర్దుకుపోతూ
అన్ని పాత్రలలోనూ
పరోపకారమే పరమావధిగా
లాలనగా లలనగా ఏలనగా?
ఆలంబన తానే అని తెలిసి
అవకాశం వేరే లేదని తెలిసి
తెలివిగా పెదవి విప్పని వనితగా
సాగడమే మేలని తెలిసి
నిస్వార్థ సేవకు నిలువెత్తుగా నిలచి
అలరించే మురిపించే మైమరపించే
ఓ వనితా నీకిదే నావందనం.


0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home