Wednesday, April 4, 2018

పిలచేనా ఓ మారైనా

తలపు తలుపుల క్రీనీడ
తూగాడుతూ తారాడితే నా నీడ
ఈ క్షణ వీక్షణ ఈక్షణములు
నాకోసం నా పలుకరింపుల కోసం
ఆరాట పడితే మధన పడితే
కను కొలకుల కొనలలో
అస్పష్ట అన్వేషణల ఆర్తి
సుదూర తీరాలలో మమతల దీప్తి
అందుకుంటే ఆదుకుంటే
సంభ్రమాశ్చర్య దృగ్గోచరం
కాకుంటే అది క్షణికం
స్వాప్నిక గగన విహారంలో
మరపు రాని సౌదామిని
చతురంత యానస్థిత భామిని
నా పద కవితా నవ పేశల ధ్వని
విని నను గని వాటేసే సుధీత
పిలిచేనా ఓ మారైనా నా కలకూజిత?
(ఈక్షణములు=కన్నులు;   సౌదామిని=మెఱుపు; చతురంత యానము=పల్లకి;
సుధీత=కూతురు)

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home