నీకో వందనం
అభిమానించనేల అవమాన పడనేలఆరోపించనేల ఆక్రోసించనేల
అడుసు తొక్కనేల కాలు కడుగ నేల
దూరంగా మౌనంగా నిమ్మళంగా ఉంటే పోలా?(పోదా)
ఎవరికి వారే యమునా తీరే
నీ దారి గోదారి నా దారి రహదారి
అని సరిపెట్టుకుని
చేతులు ముడుచుకు కూర్ఛోరాదా
ఏవరినో ఉద్ధరించాలనీ ఏదో చేయాలనీ
నీ కెందుకు పనికిమాలిన
ఆరాటం ఓ ప్రక్క పోరాటం మరో ప్రక్క
లబ్ది గ్రహీతలే సిద్ధాంతాలను పరిహసిస్తే
అపహాస్యం చేస్తే అవహేళన చేస్తే
కిం కరోమి? కిమర్థమేన ఏతత్కార్యం కరోమి?
అని నా మనసడిగే ప్రశ్నలకు బదులేది?
కూడదన్న పనే చేస్తే
కూడకూడని వారితో జత కూడితే
ఇంకా ఎందుకు వారి కోసం నీ ఆరాటం
అని నా మనసే నన్ను నిలదీస్తే భోరున విలపిస్తే
ఎంగిలి మెతుకులు ఏరుకు తినాలని చూస్తే
వసాగంధిల శల్యమునకు రుచి మరిగితే
కుక్క పిల్ల కాదది నక్క వినయపు కోతి పిల్ల
విశ్వసించడం విస్తుపోవడం నీ వంతు
ఎంతజెప్పినా ఏమి చేసినా మరలా అదే తంతు
విధి బలీయసీ నీకో వందనం
హతవిధీ పరిహసీ నీకో వందనం.
(కిం కరోమి= ఏంచేయను, కిమర్థమేన కరోమి= ఎందు కోసం చేయను, వసాగంథిల శల్యము= వాసన లేని ఎముక)
0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home