Thursday, April 26, 2018

అమ్మలు - పై చదువు

అనుకున్నదొకటి అవుతున్నదింకొకటి
ఆశపడినదొకటి అంటకడుతున్నదింకోటి
ఎటూ పాలుపోని వైనం అంతా అయోమయం
ఎదనొడ్డి ఎదురించి సాధించి చూపించనా
అణకువతో హతవిధీ అని భరించనా
జీవితాన్ని ఫణంగా పెట్టి పోరాడనా
జీవితాశయాలను అటకెక్కించనా
ఎటూ పాలుపోని వైనం అంతా అయోమయం
నా మూగవేదనను ఆ పరాత్పరుడు వినడా
పగవారికి కూడా వద్దు ఈ దురవస్థ
తను పట్టిన కుందేటికి మూడే కాళ్ళంటూ ఒకరు
తన మాటను కాదన్నందుకు మౌనంగా ఇంకొకరు
ఎటూ పాలుపోని వైనం అంతా అయోమయం
పంతాలకు పోకుండా భవిత తీర్చి దిద్దే పెద్దలేరి
పరమేశ్వరా తప్పులెంచక మన్నించవా ఓ సారి
కన్న తండ్రి కి దయలేదు అభిమానించిన వారికి జాలి లేదు
ఆకాసంలోనే ఆనందంగా చదువకోలేనా
శశి వికాసం వృద్ధి క్షయాల గందరగోళం
నా మెడలో కట్టేసిన గుదిబండ కాదా
నా కెందుకీ శిక్ష? నా మీద దేనికీ కక్ష?
ఎటూ పాలుపోని వైనం అంతా అయోమయం.


0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home