Monday, April 30, 2018

ట్రెండ్ మారింది


చిట్టి కాస్త పొట్టిదే గాని బుఱ్ఱ నిండా పుట్టెడు బుద్ధులు.
ఉల్లిపాయ పొరల్లాగ ఒలచిన కొద్దీ ఘాటు ఎక్కువ.
నిన్ననే పదో తరగతి ఫలితాలు వచ్చాయికదా. అప్పటి నుంచి మూగనోము పట్టింది. పదికి పది మార్కులు రాలేదని చిఱ్ఱు బుఱ్ఱు మంటోంది.
నేను అక్కడ చదవను గాక చదవను అంటే విన్నారా? పంతులుగారి స్కూల్లో వేసారు. అందుకే ఇలా అయింది. ఆయన అన్నీ నీతులు చెబతాడు. కడిగీసిన ముత్యంలాగ కూర్చోవాలి అంటాడు. లైఫ్ లో ఎంజాయ్ మెంట్ అఖ్ఖరలేదా?
అతను ప్రవరాఖ్యుడైతే కావచ్చును కాని నేను పదహారేళ్ళ సగటు ఆడపిల్లను అంతే.
'దృష్టి 'స్కూల్లో బడుద్దాయ్ సోము , అల్లరి హరి ఏవరేజ్ గా చదివే కవిత అందరికీ పదికి పది నాకేమో 9.6 ఎంత ఘోరం?
వాళ్ళేమో పుస్తకాలు దగ్గర పెట్టి రాయించారు పరీక్షలన్నీ. ఫుల్ కాకపోతే నిల్ వస్తాయా?
నీతి నిజాయితీ ఎవడిక్కావాలి? ఫుల్ మార్కులు కావాలికాని.
వాళ్ళ అమ్మ మీద కోడె త్రాచులా బుసకొడుతోంది చిట్టి.
నైతిక విలువలు సిద్ధాంతాలు కడుపు నింపుతాయా?
శాంతారామ్ ఆఫీసునుంచి కాస్త తొందరగానే వచ్చేసాడు. టైమ్ ఏడే అయింది.
చిట్టీ నీకు మంచి రేంకే వచ్చిందమ్మా. అలా వాపోతే ఎలా?లేకపోతే భోరున ఏడవాలా? అంది చిట్టి.
చూచికాపీలు స్లిప్పులూ మనలాంటి వారు చేసే పనులు కాదమ్మా అంటూ తండ్రి.
ఎప్పుడు మామాట విన్నారు కనక మేం బాగు పడ్డానికి అంటూ ఆటం బాంబులూ శతఘ్నులు పేల్చడం మొదలెట్టింది భార్య భగళ. అసలే ఆమె నిప్పులు తోక్కిన కోతి.
శాంతారామ్ నిజంగానే శాంతమూర్తి. మన పిల్ల ని మంచి కాలేజీలో చేరుస్తున్నాను కదా. ఆ తర్వాత ఈ మార్కులెందుకూ పనికి రావు. రెండేళ్ళు కష్ట పడితే ఐఐటి సీటు వస్తే చాలదా అన్నాడు

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home