Friday, October 31, 2008

శివ సంకల్పమస్తు

శివుని ఆజ్ఞా లేనిదే చీమైనా కుట్టదని నానుడి. మరి అటువంటి శివుని కి కుడా శని నుంచి తప్పించు కోవడానికి చెట్టు తొర్రలో దాగుండవలసి రావడం విచిత్రమే అనిపిస్తుంది. విశ్వంలో ఎల్లప్పుడూ ౨౫% మంది సనిబదాతప్తులే వుంటారు మన జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.
అటువంటి బాధలనుంచి కించిత్తు ఉపసమనం కోసం ప్రతివారు ప్రయత్నించవలసినదే. అందుకోసం మన ఆ యా దేవాలయాలకు పోయి అర్చనాదులు చేయించుకుని తత్సాంతిని పొందాలని అనుకుంటాము. ఆగమసాస్త్రం ప్రకారం సనీస్వర దర్శన, అర్చన, అభిషేక అనంతరం అచటనే స్నానమాచరించి శివ దర్శనం కావించుకుని ఇంటికి చేరుకోవాలి. కాని ఈరోజుఏ దేవాలయం లోను అటువంటి అవకాసం కనిపించుటలేదు. ఇది మన దురుద్రుష్టం.
అయితే ఈమధ్య తూర్పుకనుమల వాలులందు ఒక పురాతన శిధిల శివాలయం దర్శించుకునే సమయాన అనిపించింది ఏమిటంటే అక్కడ శనికి ఒక దేవళం నిర్మించాలని. ఏలనంటే అక్కడ ఒక సహజ జలపాతం ఉంది. ఆప్రక్కన ఈ శివాలయం ఉంది. ఆ చేరువలో శనికి కూడా ఒక దేవళం నిర్మిస్తే శాస్త్రప్రకారం శనిని సేవించుకుని లబ్ది పొందవచ్చు
అని.
నా ప్రయత్నంగా మొదట ఆ శివాలయాన్ని పునరుద్దరించాలని అక్కడ కార్తీక బహుళ ఏకాదశి ఆదివారం అనగా 23-11-2008 న రుద్రాభిషేకము,రుద్రహోమము జరిపిచుటకు ఏర్పాటు చేస్తున్నాను. అలాగునే ఆ జలపాతం వరకు శివాలయం నుండి దారి సరిగా లేనందున మెట్లు ఏర్పాటు చేయించాను. వాటికి సిమ్మెంటు పని మరొక వారం రోజులలో పుర్తికావచ్చు.
ఆ ప్రదేశాన్ని ఒక పర్యాటక ప్రదేశంగా కుడా రూపొందించవచ్చు. ఆ రకంగా అక్కడ కొంటఅభివృద్ధిని తీసుకురావచ్చునని నానమ్మకం. ఇందుకు ఎవరైనా సహకరించ గలిగితే ధన్యోస్మీ. నా అంతటా నేనే ఈపని పూర్తిగా చేయాలంటే పంచ వర్ష ప్రణాళిక అవుసరమేమో.
ఈ విషయంలో మీ మీ అభిప్రాయాలు పంపించగలరు.