Tuesday, May 5, 2015

                             అసూయ 


చిన్ని తనమున మన అగ్రజుల కసూయ 
చదువులో సహా ధ్యాయుల కెదొ అసూయ 
వృత్తిలో సహోద్యోగులకున్ అసూయ  
అమ్మ అనసూయ! లోకమంతయు అసూయ. 
వంశ మందు నీ  ఉన్నతి గని  అసూయ
బాల్య మిత్రుల కంతంత గానసూయ
అయిన వారికి లోలోపలన్  అసూయ
అమ్మ అనసూయ! లోకమంతయు అసూయ.

ఇరుగు పొరుగుల వారికి కలదసూయ 
ఎల్ల జనులకు నుండు జబ్బే అసూయ
ఎందుకీ అసూయలనర్ఢ మేమి ఫలము 
అమ్మ అనసూయ! లోకమంతయు నసూయ.   
  

  

Monday, May 4, 2015

        

అరువది  యేండ్ల పై బడిన  వానికి దైవమదొక్కడే కదా 
చిరుదర హాస భాసుర విచిత్ర సఖుండు తదన్యులందరున్ 
చురచురలాడు చూడ్కులను సుంత చిరాకగుపింతురెందుకో 
సరసులు గారు పిల్లలని చావును కోరి వరించ మందురే