Monday, December 31, 2012

శుభాకాంక్షలు

అందరికీ శుభా కాంక్షలు  ఆంగ్ల  నూ 
                                     తన  వత్సర  తరుణ  మందు 
అందరికీ  ఇదే నా వేడికోలు మీ 
                                    వంతుగా మంచిని పంచ మనుచు 
అందరికీ  ఇదే నా విన్నపం కాస్త 
                                     సంస్కృతీ నినిలిపి  సంబర పడ 
అందరికీ మరోమాట మన తెలుగు
                                    కమ్మదనం  మరచి పో కండి 

రచి పిల్లలను పరాయి పలుకులో పల్క రించకండి 
అమ్మ ఎంత యిష్టమో అమ్మ భాష కూడ 
అంత గొప్పని చెప్పండి ఆంగ్ల భాష 
కూటి కొరకే  మన నోటి కొరకు కాదు.


 

  
                    

Sunday, December 30, 2012

మన తెలుగు తల్లి

నా నోటి పలుకుల తల్లి
నా బ్రతుకు వెలుగుల పాలవెల్లి
నా గుండె సవ్వడి   నిండు తెలుగు తల్లి
ననుగన్న తల్లి నా తెనుగు తల్లి.

నా ఇంటికే వెలుగు ఆ తెలుగు
తెలుగువెలుగుల నీడ నా బ్రతుకు వెలుగు
నా ప్రతి పలుకు జానుతెనుగు
నా ప్రతిన పలుకు పలుకున తెనుగు.

వేదికైనా వేడుకైనా
పండగయినా సందడైనా
పోరుగువాకిట కూలినైనా
వలస జీవనమోద్దికయినా
పరువు దాటని పలుకునేనైనా.

ఎత్తుమూటలనాటి  మా అమ్మ పలుకు
సుతిమెత్తగా వినిపించు ఎల్లప్పుడూ అ పలుకు
తీయ తేనెల అమేటి తేట తెలుగు పలుకు
తలపు తలపులో నా నుడి తెలుగు నానుడి
ఆ నుడికారమే ప్రాకారమై
నా గుండెలో వెలసిన తెలుగు గుడి .

నా ఆశ తెనుగు బాస
నా శ్వాస తెనుగుబాస
నా చెలిమి  నాబలిమి
నా కొలువు  నా నెలవు
నను తీర్చిదిద్దిన వేవెలుగు తెలుగు.

నాకళ్ళ లోగిళ్ళలో వెలిగి
నాకళ్ళ ఆకళ్ళలో మలిగి
నానోటి పాటగా వెలిసి
నా మేటి పద్యమై విరిసి
వెలుగొందు నా తెలుగుతల్లి
జేజేలు ననుగన్న నా తెలుగుతల్లి.