Saturday, June 30, 2018


మరణం ఎదురైతే
ఖచ్చితంగా ఆహ్వానిస్తా
వద్దన్నా ఆగదుగా అది
ఆ జగన్మాతకు నాదో వినతి
షోడశీ మననంతో నా మనసు
యోనిముద్రలో కరద్వయము
శివోహం అంటూ నా శ్వాస
ఆగిపోనీ ఆగేవరకూ సాగిపోనీ
నీ స్ఫురణ లోనే హంస ఎగిరిపోనీ
అవకాశం ఉంటే వారణాసిలో
గాంగ సైకతమందు అంత్యేష్టి
అదే నీ పాద సేవా ఫలం
మన్నించవే అమ్మ నా ఈప్సితం.

Wednesday, June 27, 2018

వినమ్రంగా

కం.
గురువై ఈ సకల చరా
చర జీవులకు విభుడై ప్రశాసకుడై తాన్
తెరువై చెఱువై పరువై
హరుడై వెలుగొందు వాని ప్రస్తుతి జేతున్.1

పరుడై ఈశ్వరుడై భవ
హరుడై హరుడై పరాత్పర స్వరూపుండై
వరుడై ఘనుడై తోడై
స్మరహరుడై యొప్పు వాని స్మరింతు నెపుడున్.2

వరమై మహా విభవమై
తారా నివహపు వెలుగుల తావై యా ధ్వాం
తారాతి విహా రమ్మై
ధరణీ ధరుడై వెలిగెడి తండ్రిన్ కొలతున్.3
(నివహము=గుంపు, ధ్వాంతారాతి=సూర్యుడు)

జలమయమై తమిశ్రమమై
విలయమ్మై తానొకండె ఏకాంతమునన్
నిలచిన శాశ్వతు నచ్యుతు
తలువని తలపుగ  తలతును తలపుల మూలున్. 4

దేహము దేహియు వేరని
యిహమున తనువును తనదని తెలియక పోగా
కుహనా జ్ఞానము చిదిమిన
మహనీయుని  యాత్మ మూలు మదిలో తలతున్.5
తలపుల మూలము తానై
తలకెక్కిన యహమనునది తానై తానే
కలిమికి బలిమికి కొలువై
కొలచిన వారికి శుభమిడు గోపతి గొలతున్.6
(గోపతి =శివుడు)
జగతికి గురువై వెలుగై
ప్రగతికి పేరై బ్రతుకుల ప్రజ్ఞానమ్మై
యగణిత శంకరుడై తాన్
జగముల నడిపెడు దిసమొల జంగము కొలతున్.7
వేదియు వేదము తానై
వేదాంతపు సారమై సువేశా స్థలమై
యాదియు నంతము నొకడై
ప్రోది యగునాతని కొలతు ప్రోక్షిత మతినై.8
అలఘుల్ గురువులు నాయెడ
ల లఘువుల నితోధికముగ లాఘవమొప్పన్
చలన మనోదీప్తి న్న
న్నలఘున్ జేసిన గురువుల నాత్మ దలంతున్.9
(లఘువుల=వడివడిగా)

Tuesday, June 19, 2018

डरपोक नहिं

कसम से कहता हूँ कि
हर कमीने प़ूंंछ हिलाते
जब एक कदम पीछे हटें
हर कुत्ता भोंकने लगे
अगर जान पूछ के चुप रहें
ये दुनिया वफादारी नहिं
बेवकूफों के अंगना है
जितना भी अछ्चे पायें
सुबह तक सबकुछ भूल जाएंं
बार बार कितने बार याद दिलादें
प्राप्त हुवा सहाय कभी न भूलें
मिला हुआ मदद बहुत मेहंग ही मानें
वक्त आनेपर दिल खोल कर देखें
कितने लोग हमे प्यार कियें
कितना रुण ग्रस्त रह जायें
मालूम होगा महनत का किमत कितना
मालूम होगा हरदिन का प्रयास जितना
उमर से हो या डर से हो
कयी बार चुप रहतें
सबके अच्छाई केलिए
मगर वह डरपोक नहीं
मान्यता का प्रतीक रहें।

Saturday, June 16, 2018

తండ్రి

సీ.
కోటి ఆశల సుత కంట కన్నీరు తాన్
             కలనైన నెపుడైన కోరు కొనడు
ఆశల బాసల అందాల హరివిల్లు
             కూరిమి పేరిమి కూతు రనిన
అంగారు బంగారు ముంగారి సింగారి
             తలపు తెమ్మెర యౌను తనయ తనకు
తండ్రి హృదయ మెంతొ బెంగతో నల్లాడు
             అత్తింటి కంపిన  ఆత్మజ యన
తే.గీ.
 రాసి రంపాన వెట్టని అత్త గలదె
వెలికి వెలి గక్క లేకుండు వెరపు గలిగి
దినదినము మ్రొక్కు ముక్కోటి దేవతలకు
దుహిత సుఖ శాంతి గోరుచు తండ్రి ఎపుడు.

Wednesday, June 13, 2018

అమ్మో పాపం అమ్మాయిలు

గొడ్డు చాకిరీ తనే చేయ్యాలి
అయ్యగారికి అన్నీ అందించాలి
లక్షల్లో సంపాదించుకు రావాలి
నోరెత్తకుండా పడి ఉండాలి
అత్త మామలంటే అగ్గగ్గలాడాలి
ఆడపడుచు ఏం చెబితే అది చెయ్యాలి
ఏగాణీకి పనికిరాని ఏబ్రాసికి ఏసీ కావాలి
ఆలసీ పోలసీ అల్లాటప్పా అప్పారావు
తిండిపోతు వదరుబోతు తిమ్మారావు
ఎంత కాల్చుకు తింటున్నారు
ఈ నాజుకు సాఫ్ట్వేర్ అమ్మాయి లను
ఈడేరిన దగ్గరనుంచి సవాలక్ష ఆంక్షలు
ఎవరికుండవు అభివృద్ధి పై ఆకాంక్షలు
పది తరువాత పెళ్ళికాదు పదకొండు
అని దండోరా వేయించింది పోలీసు దండు
చేతికీ మూతికి సరిపోయే ఇంటిలో
ఆడపిల్ల పెద్దచదువు అత్యాశే.
ఎలాగో తినో తినకో చదివి ఓ ఉద్యోగం సాధిస్తే
ఇంటిల్లి పాదికీ ఆనందమే
మాయదారి పెళ్ళి కన్నీటి సిరికోసమా
ఇంగీతం లేని మగడు అత్త మానవ మృగాలు
ఇంతలో ఒకరో ఇద్దరో పిల్లలు
వారితో మరో కొత్త బాధ్యతలు
ఎక్కడండీ అమ్మాయికి సుఖం
కంట తడిపెట్టనిదే కునుకు శూన్యం
ఎందుకీ ఆడ బ్రతుకు ఎవరికోసం ఈ తెగింపు
అత్తలూ ఆయన గార్లూ కట్ట కట్టుకుని
పాపి కొండల నడుమ గోదాట్లో దూకండి
ఆడదాని ఉసురు పోసుకోకండి.
(కూతుళ్ళ వారం సందర్భంగా
ఆడపిల్లల కు అంకితం)

Saturday, June 9, 2018

कभी न भूलें

कभी न भूलें
जान पहचान
कभी न बोले
याद नहीं अब कुछ
दिल मे है सब कुछ
दिल वाले सबलोग।
परन्तु
कभी कभी हां लगे
जब मन परेशान करे
जब जोड़ बिगाड़ रहे
ये मन का क्रोध, द्वेष
फिलहाल की बात होगी
घायल मन स्वास्थ्य जब हो
समय पर मुश्कराई मिलाव हो
दुनिया भर कि जिंदगी प्यारा हो।

Thursday, June 7, 2018

ఇదంతా ఓ కలా?

ఎటు చూచినా చిమ్మచీకటి
దుర్నిరీక్ష్య దుస్సహ నిశ్శబ్దం
నీటిమీద నిలచినట్లుంది నా వైనం
నాకు శరీరం లేనట్టుగా ఉంది
అవయవాల ఆనవాళ్లు లేవు
నారూపం నాకే అగమ్యగోచరం
నేను ఆత్మనా జీవినా తెలీదు
ఒంటరినా మందితోనా తెలీదు
కటిక చీకటిని ఛేదించే అవకాశం లేదు
కిం కర్తవ్యం కిమర్థమేన కర్తవ్యం
ఆ ఆలోచన అవలోకన లేవు
నేను ఎవరో ఎవరికి తెలుసు
పెన్ జీకటి కావల ఏముందో
ఉంది ఏదో మిణుకుమిణుకు ల చిరు కాంతి
బహుశః జలధి గర్భంలోంచి వచ్చానేమో
ఆ సుదూరపు చిరుకాంతికి జోత
అది అదే అదే ఆ పరంజ్యోతి
నీటిలోంచి ఏదో బురదలోకి మారానా?
ఏదో భూగోళం ఉద్భవించిం దేమో
నెత్తిమీద నభోవీథి అనుకుంటా
తళతళా మెరుస్తున్న తారకలు
ఆ తారానివహపు నడివీథిన
నిలుచుంటే నన్నచటకు పిలచుంటే
నేను ఎవరో నాకు తెలిసేది
ఈ భూ జల ఖగోళాలేవిటో తెలిసేవి
నిస్సహయంగా విలోకిస్తున్నా ఆలోచిస్తున్నా
ఇంతలో ఎఱ్ఱని కాంతి రేఖ
ఇంతింతై పెరుగుతోంది
సృష్టి ఆరంభం అయ్యింది
కళ్ళు నులుపుంటూ లేచా
జరిగినదంతా ఓ కలా?

Saturday, June 2, 2018


ఎండ ఎంతొ చల్లన
వెన్నెలెంతొ వెచ్చన
మమతల పందిరి
నల్లుకుని మనసున
నిలచిన సుందరి
అలా జతగూడితే
జలపాతంలా కదిలితే
ఊహలు ఊయలలూగితే
ఆశలు ఆకశాన ఊరేగితే
ఎండ ఎంతొ చల్లన
వెన్నెలెంతొ వెచ్చన
ఆ ఊహల ఊర్వసి
ఓ ఆశల ప్రేయసి
వినీల గగనంలో విహరిస్తే
సుదూర తీరంలో కనిపిస్తే
మరో సౌరమండలం లో
మనముందామా అంటే
రోదసిలో పయనం
ఊర్వసితో ప్రణయం
బ్రతుకే మహదానందం
కాదంటే కూడదంటే
పట్టపగలె చీకటి
బ్రతుకంతా అధోగతి
అందుకే
ప్రేమించడం ఓ నేరం
వెంపరలాడడం ఘోరం
అల్లరి వయసు
చిల్లర మనసు
ఒద్దికగా ఉంటే నయం
బొత్తిగా లేకుంటే భయం.