Wednesday, June 13, 2018

అమ్మో పాపం అమ్మాయిలు

గొడ్డు చాకిరీ తనే చేయ్యాలి
అయ్యగారికి అన్నీ అందించాలి
లక్షల్లో సంపాదించుకు రావాలి
నోరెత్తకుండా పడి ఉండాలి
అత్త మామలంటే అగ్గగ్గలాడాలి
ఆడపడుచు ఏం చెబితే అది చెయ్యాలి
ఏగాణీకి పనికిరాని ఏబ్రాసికి ఏసీ కావాలి
ఆలసీ పోలసీ అల్లాటప్పా అప్పారావు
తిండిపోతు వదరుబోతు తిమ్మారావు
ఎంత కాల్చుకు తింటున్నారు
ఈ నాజుకు సాఫ్ట్వేర్ అమ్మాయి లను
ఈడేరిన దగ్గరనుంచి సవాలక్ష ఆంక్షలు
ఎవరికుండవు అభివృద్ధి పై ఆకాంక్షలు
పది తరువాత పెళ్ళికాదు పదకొండు
అని దండోరా వేయించింది పోలీసు దండు
చేతికీ మూతికి సరిపోయే ఇంటిలో
ఆడపిల్ల పెద్దచదువు అత్యాశే.
ఎలాగో తినో తినకో చదివి ఓ ఉద్యోగం సాధిస్తే
ఇంటిల్లి పాదికీ ఆనందమే
మాయదారి పెళ్ళి కన్నీటి సిరికోసమా
ఇంగీతం లేని మగడు అత్త మానవ మృగాలు
ఇంతలో ఒకరో ఇద్దరో పిల్లలు
వారితో మరో కొత్త బాధ్యతలు
ఎక్కడండీ అమ్మాయికి సుఖం
కంట తడిపెట్టనిదే కునుకు శూన్యం
ఎందుకీ ఆడ బ్రతుకు ఎవరికోసం ఈ తెగింపు
అత్తలూ ఆయన గార్లూ కట్ట కట్టుకుని
పాపి కొండల నడుమ గోదాట్లో దూకండి
ఆడదాని ఉసురు పోసుకోకండి.
(కూతుళ్ళ వారం సందర్భంగా
ఆడపిల్లల కు అంకితం)

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home