Saturday, April 29, 2017

మంద యీ మంది

నీకు నీవే ఎదురైతే
ఆబగా ఆవంక చూస్తే
మేరువు నైనా తన్ని
మెట్టనో గుట్టనో నమ్మి
కంట్లో వేలెట్టి పొడుచుకునే
భవితను భసితం చేసుకునే
 గొఱ్ఱెల మంద యీ మంది
కుహనా మేధావుల కుత్సితాలు
పది మందికీ విన సొంపులు
చేతులు కాలాకే జ్ఞానోదయం
విధీ బలీయసీ అంటూ ఉపసమనం
మేధా దేవి ప్రాప్త కాలజ్ఞత నిచ్చుగాక
మనో వైకల్యాలు చిత్త చాంచల్యాలు
సాంబ పరమేశ్వరుడు శమింప జేయుగాక
ఉన్నత భావాలతో ఉజ్వల భవితతో

బాలలందరూ ప్రచోదితులౌదురు గాక.

Friday, April 28, 2017

అబ్బురపతామా తబ్బిబ్బౌతామా


ఇనుప పట్టాల బండికి సమయపాలన రాదు
ఏడు గుఱ్ఱాల రథునికి కాలవిలంబన. లేదు
నాగరీకపు మనషికి సమయం విలువ లేదు
తొలి కోడి కూతకు ఆలస్యం అంతగా తెలవదు
తెలిమంచు తెఱలకు ఋతుగమనమే తెలుసు
ఇచ్ఛాపూర్తికీ ఇష్టాగోష్టికీ మనిషికి వేళాపాళా లేదు
వాన రాకకు ప్రాణం పోకకూ కాలంతోపనిలేదు
ప్రకృతిలో కొన్ని కాలానికి యతిగా కొన్ని ప్రతిగా
సమన్యాయం సమధర్మం అందరికీ ఒకటే కాదా
పాత్రలు మారితే నీతీ రీతీ మారి పోతాయా
కొందరికి ఆలస్యం ఆమృతం విషం
మరి కొందరికి కాల విలంబనే పరిష్కారిణి
ఇంకొందరికి సద్యః ఫలితమే పరమావధి
ఏది ఎవరికి ఏరీతి నివ్వాలనేది ఈశ్వరేచ్ఛ
ప్రాప్తాప్రాప్తాలు ప్రారబ్ద వైశేష్యాలు నిర్ణాయకాలు
ఇంత వైచిత్రీ సంఘ జీవనాన్ని చూసి
అబ్బుర పడతామా తబ్బిబ్ఫౌతామా

Sunday, April 23, 2017

O God! Awaken me

Perpetual my thoughts are
Perennial my aspirations are
Devotional my deeds are
Dedicative my helps are
Liked or disliked by
makes no difference to my
determined  destined philosophy
Usual to me many a hurdles
Casual to me many a disciples
no dearth to me for my doctrines
no help to me in my bickerings
no courtesy on me by daughters
shall I shred tears for my fate
shall I afraid dears and hate
shall I live without compromise
shall I leave with a compromise
O God! Clear me and keep me
on the right path and move ahead
awaken me the right
under your blissful light






Saturday, April 22, 2017

నేల మాట

నెఱియ బారిన నేల చూస్తే
వ్రయ్యలైన పిపాసిని తలపిస్తే
నఱవ లన్నీ నేల విడిచి
వాగులై వరదలై ఏరులై
కడలివైపే పరుగులు తీస్తే
ఆర్ద్రతంతా ఇంకిపోయిన గుండెతో
నీటిచేతిలో తడిసి ముద్దై పరవసించిన
మృదు మధుర గత స్మృతులతో
దీనాతి దీనంగా నింగికేసి చూసి
ఎదపరచి విలపిస్తోందా నేల పిల్ల.
'స్నపయ కృపయా' అంటూ రోదిస్తోంది
పంటకుంటలో నేల బావులో
జాలి గుండెతో ఆదుకోవా
మొయిలు చెలియలు నేల చూపులు చూడవా
తొలకరి చిరుజల్లొక్కటి దాహార్తిని తీర్చదా
పగిలిన గుండెల నతికే భిషగ్వర వరుణుడు
కరుణించేదెపుడో సరి జేసేదెపుడో
నీతి మాలిన జాతి హీనుల మనుజుల
ఊడిగంలో ఈసడింపులో ద్వేషంలో
బ్రతికి మెతుకు లిచ్చేకన్నా
నీట మునిగి పోవటమే మిన్న.
(నెఱియ= నేల బీటలు
నఱవ= పొలంలో పారిన నీటి వాగు)

Friday, April 21, 2017

మంచి బడి లో నే చేరుతా

అసలు  నా మాట పట్టించుకోవేల
హాయిగా నన్ చదువు కోనీవేల
నేను కూడా మంచి బడిలో చదవితే
భ్రాత కన్నా గొప్పగా చదువుతా
 నాన్నా
చదువు లో మేటిగా నిలబడతా
కానీ
పైసలు వెచ్చించి మంచి బడికి నన్ను పంపవు
డొక్కు బడిలో చదివితే మంచి మార్కులు రావు
పేరున్న కళాశాలలో చోటూ దొరకదు
చదివించ లేదన్న నింద నీకు రాదు
అందుకేనా ఇలాంటి బడిలో వేసావు
కూతురి పైన పెట్టుబడి  ఎంతైనా
కలసి రాదు తిరిగి రాదనేగా నీ వాదనా
అంతేలే
మీ సరదాలకు ఆనందాలకు నేపుట్టా
మీ స్వార్థానికీ వివక్షకూ బలౌతా
కొడుకంటే ఎందుకంత వ్యామోహం
కూతురంటే  ఎందుకలా నిర్లక్ష్యం
చేయూత నిచ్చే చైతన్య మూర్తులూ
ఆసరాగా నిలచే ఆపన్న హృదయులూ
కొందరున్నారు వారి హార్థిక సాయంతో
నేను కూడా గొప్పగా చదువుతా
అమ్మ నాన్న గురువులకు పేరుతెస్తా

మంచి గురువుల బడిలోనే చేరుతా.

Thursday, April 20, 2017



సీ. తప్పులెన్నకు తల్లి నీతనయుడ గాదె
              దండించి బాధించు తల్లి గలదె
    'నహి మాతా సముపేక్షతే సుతం' అందురే
             నేనేమి నేరాలు నెరపి నాను
    ఉలుకు పలుకును లేక యటులుం దువదేల
            ఊ( కొట్ట ఛీ కొట్ట చూడవేల
    మౌన ముద్రలు నీకు తగునని యనుకోను
            ఏడిపించకు నన్ను ఏవగించి
తే.గీ. చిలిపి తనమున వెలితిగా జేసి నన్ను
        కాదు పొమ్మనకు కసరి కలత పడగ
        ఆదరించవె తల్లి ఆనంద వల్లి
        కంచి కామాక్షి కరుణించు కల్పవల్లి.4.

సీ. నిర్లిప్త వైఖరుల్ నీవవ లంభించి
              నిస్పృహా వేశముల్ నిరత మొసగి
    ఆశ కల్పించి నన్నారాట పడజేసి
             కాలుగాలిన పిల్లి గా వెలార్చి
   అంగ లార్చుచు నొకమారు వేరొకమారు
             వేసరింపగజేసి ఏడిపించి
   కుత్సితుండని నన్నొ 

సీ. తప్పులెన్నకు తల్లి నీతనయుడ గాదె
              దండించి బాధించు తల్లి గలదె
    'నహి మాతా సముపేక్షతే సుతం' అందురే
             నేనేమి నేరాలు నెరపి నాను
    ఉలుకు పలుకును లేక యటులుం దువదేల
            ఊ( కొట్ట ఛీ కొట్ట చూడవేల
    మౌన ముద్రలు నీకు తగునని యనుకోను
            ఏడిపించకు నన్ను ఏవగించి
తే.గీ. చిలిపి తనమున వెలితిగా జేసి నన్ను
        కాదు పొమ్మనకు కసరి కలత పడగ
        ఆదరించవె తల్లి ఆనంద వల్లి
        కంచి కామాక్షి కరుణించు కల్పవల్లి.4.

సీ. నిర్లిప్త వైఖరుల్ నీవవ లంభించి
              నిస్పృహా వేశముల్ నిరత మొసగి
    ఆశ కల్పించి నన్నారాట పడజేసి
             కాలుగాలిన పిల్లి గా వెలార్చి
   అంగ లార్చుచు నొకమారు వేరొకమారు
             వేసరింపగజేసి ఏడిపించి
   కుత్సితుండని నన్నొ దిలి యుండలేవుగా
             నిమ్మళముగ నుండ నీవు నీవు
తే.గీ. ఆటలాడుటే పరిపాటి హంసగమన
        నేను నీవను అంతర మ్మేలనమ్మ
        ఆదరించవె తల్లి ఆనందవల్లి
        కంచి కామాక్షి కరుణించు కల్పవల్లి.3.
తే.గీ. ఆటలాడుటే పరిపాటి హంసగమన
        నేను నీవను అంతర మ్మేలనమ్మ
        ఆదరించవె తల్లి ఆనందవల్లి
        కంచి కామాక్షి కరుణించు కల్పవల్లి.3.

ఎన్నెన్ని ఆశలో ఎన్నెన్ని ఊహలో
        మనసులో కల్పించి మరల నిలిపి
ఆశయ సాధన లక్ష్యమై నడిపించి
        సాహసించెడి బుద్ధి పాదు గొలిపి
అలుపెరుగక రే బవలు శ్రమియించినా
         ఆటుపోటులు నాకు తప్పలేదు
అనుకున్న వన్నియు సాధించ లేదు నే
        చతికిల పడలేదు చేవ పోదు
తే.గీ. నగవు లొకరోజు నగుబాటు నలుసు బాటు
        లా మరుదినమె నిత్యమై లాస్య మైన
         ఓడి పోయితినని కృంగి పోను
         గెలచి నానని గొంతెత్తి చెప్పలేను.

Wednesday, April 19, 2017

నాగరీకం ముదిరిందా


వనములెన్నో భవనమ్ములుగా మారిపోయాక
వసతులెన్నో వసుంధర కోల్పోయాక
నగరాలలో కనరావు వసంతుని నగారాలు
కోవెల కుహుకుహూ రాగాలు పంచమ స్వరాలు
గతస్మృతులుగా మనసులు నింపుకుని
ప్రగతి పథగమన భ్రమైక పథంలో పయనిస్తూ
ప్రకృతి ని శాసిస్తూ జనం
జనాళిని శపిస్తూ ప్రకృతి
పట్టు కోసం పట్టుకు ఛస్తుంటే
సహజ సౌందర్య మహి మహిమ లెక్కడ
రమణీయ ప్రకృతి కాంత రాశీ రూప మెక్కడ
అయాచితంగా వచ్చిన వనరులన్నీ
అనాలోచితంగా నాశనం చేస్తుంటే
విలయ వలయాలు అనల పవనాలూ
మహోగ్ర సూర్య కిరణాలూ సర్వ సాధారణాలు
ప్రాణవాయువును కూడా కొనుక్కోవాలేమో
నీటికి ఎద్దడి , దాహం తీర్చే నాథుడు ఏడీ?
మిన్నేటి పన్నీటిని గతి మార్చి ఏమార్చి
భువి బాట పట్టించి పృథ్వీ లలామను స్నానమాడింపించే భగీరథులేరీ
పంట కరవై పాడి బరువై రైతు గుండె చెరువై
నీతిమాలిన జాతిహీనత మనదా?
నాగరీకం ముదిరిందా? నడిరోడ్డున పడిందా? 

Monday, April 17, 2017


శ్రీ వాణీ పరిసేవితా గిరి సుతా త్రైలోక్య సంసేవితా
కైవల్యాది సమస్త భాగ్యఫలదా త్రైగుణ్య సంహారికా
జీవన్ముక్త మహా మునీంద్ర గణ సంసేవాతురా పాహి మాం
భావాభావ వివర్జితా భవహరా అంబా పరా శాంకరీ.

Sunday, April 16, 2017

సీ. బాలగా తలచినే బేలగా కొలువగా
                నాబాల కేల నే నన్న పడదు
     బాలనే జపియింప బాలగా కనిపించి
                ఆరాడి తారాడి ఆట లాడు
     మరచి పోదామన్న మరచి పోనీదు నా
               మనసంత వేధించి మధన వెట్టు
   యతి యన్న ప్రతియంచు ఎదిరించు బెదిరించు
               ఏమిటీ దౌర్భాగ్య మెందువలన
తే.గీ. అవధి లేనంత అక్కసు లామె కేల
       గురువుయను గౌరవములేదు గురియు లేదు
       కూతురని చేరదీసినా కుదురు కోదు
       మంచి తనమిచ్చి మన్నించి మనుపు మమ్మ.

సీ. శివుని అర్థాంగి వై ఏరాలు జాహ్నవి
               కేరీతి తలపై చోటిచ్చి నావు
    వక్ర గమనమె గాని ఋజు వర్తనమెరుగ
               దాగంగ సంగమమా శివునితొ?
    విమలోత్తుంగ తరంగ గంగ దివిజ గంగ
              మీమధ్య తాదూరి మిడిసి పడదె
    గతి నిర్దేశించు భగీర థా దులె తన్నా
             ప గలరు తన్నోప గలరు  తుదకు
తే.గీ. ఇతరులేమి జెప్పిన విని పించుకోదు
        వినియు విననట్లు నటియించు విఱ్ఱవీగు
        తనకె సర్వము తెలియు నన్నట్లె తలచు
        అమ్మ! తన పొగ రణగించ వమ్మ దయతొ.

Saturday, April 15, 2017

వందనాలు

శిశిరంలో మోడైపోయిన వృక్షంలా
ఆకులన్నీ రాలిపోయిన అపర్ణలా
ప్రతి తలపూ వసివాడి పోతోంది
ప్రతి పిలుపు  కసుగంది పోతోంది
ఎటు చూసినా అంతా అసూయలే
మచ్చుకైనా అగుపించదు అనసూయ
ఆపాద మస్తకం అహంభావమే
అణువణువూ అహంకార మే
నిర్లక్ష్యపు నీలి నీడల మాటున
దుర్మార్గపు కక్షసాధింపుల నీడన
ఔనన్న ప్రతిదీ కాదనే కుత్సితులను
కాపలా కాస్తావా నాకెందుకని గాలికి వదిలేస్తావా
ఋజువర్తనలకు నిర్ద్వంద్వంగా మళ్ళిస్తావా
మాను మళ్ళా చిగురిస్తుంది
బీడు మళ్ళీ మొలకేస్తుంది కదా
శిశిరం వెనకే వసంతం రాదా
మానుకైనా మనిషికైనా ఒకటేకాదా
అనుకుంటారా అని అనుభవిస్తారా
ఓసారి వసివాడి నలిగినా పరవాలేదా
ఓచేయి నూతన మర్యాద పొందితే తప్పు కాదా
మనువుకు ముందే చనువులు ఒప్పుకోగలవా
కాదని ఎవరిని శాశించ గలవు
వలదని ఎవరిని నిలదీయ గలవు
ఆత్మ సాక్షి లేని అహంభావులకు
నీతిమాలి గోతిలో దూకే జీవులకు
వందనాలు వేనవేల అభివందనాలు.

Thursday, April 13, 2017

సాగరతీర ఆరామం

అయాచితంగా వచ్చిన వరం
నాకు విశాఖ సుందర సాగర తీరం
చెలియలి కట్టపై కూర్చొని చూస్తుంటే
ఎన్నెన్నో గత స్మృతుల పలకరింపులు
ఏవేవో అలవి కాని మధురానుభూతులు
దూరాన దీపాల కాంతితో లంగరు ఓడలు
అరుణారుణ జలధిజ ఇన బింబం
నవనవోన్మేష ఉత్సుకతల కారంభం
భావోద్వేగాల రాగద్వేషాల సంరంభం
అలల కలలతో తలపుల కలల పోటీ
నిశ్శబ్దంగా వీచీ బాలికలతో పిచ్చాపాటీ
ఎగసి పడే అలలూ పడిలేచే కెరటాలు
మనసున్న మహనీయులకు స్ఫూర్తి ప్రదాతలు
ఆ ఆర్ద్ర సైకత తిన్నెల వెన్నెల వెలుగులు
తలచుకుంటేనే ఒడలు పులకింతలు
ఎన్నటికీ మరువలేని సాయం సమయాలు
అది నా మనసు దోచిన సాగర తీరం
అది కర్తవ్యాన్ని గుర్తు చేసిన ఆరామం.

అన్నుల మిన్న

కనిపించని దైవంకన్నా
కనిపెంచే దైవం మిన్న
వినిపించని నాదంకన్నా
వినిపించే వేదం మిన్న
కలసిరాని కాలంకన్నా
కలసొచ్చిన ఓలం మిన్న
తెలియరాని భవితం కన్నా
తెలిసొచ్చిన వర్తమానం మిన్న
అందరాని అందలం కన్నా
అందొచ్చిన ఆనందం మిన్న
పొందలేని పదవుల కన్నా
పొందు కోరు పడతుల కన్నా
పొందిన గోరంత పుష్టి మిన్న
చేతకాని వచనం కన్నా
చేయి తిరిగిన కవనం మిన్న
అంతంత మాత్రపు జ్ఞానం కన్నా
కొద్ది పాటి అనుభవం అన్నుల మిన్న.

(ఓలం= గుప్త నిధి)

Wednesday, April 12, 2017

ఉభయ పార్శ్వాలు

నిస్వార్థ సేవకు నిలువెత్తు నిదర్శనంగా నిలవాలని ఇచ్ఛాపూర్వకంగా ఇతోధికంగా అండగా నిలిచావని
లబ్దిపొందిన వారే యీసడిస్తే ముఖం చాటేస్తే
కృతఘ్నులై శతఘ్నులై కయ్యానికి కాలు దువ్వితే
కొందరే పుణ్యమో చేసికొనియె ననిరి
కొందరే పాపమో కట్టి కుడిపె ననరి
పరమ పురుషులు పావనులని కొందరనిరి
పిదప బుద్ధులు, పోగాలమని కొందరనిరి
తనకు తానుగా ఊడిగం చేస్తే
హితం కోరినవారు జన శృతం విన్న వారు
అపహాస్యం పాలైతే అవమానాలకు లోనైతే
యోగి, ఋషి తుల్యుడని కొందరనిరి
లోకమెరుగని వట్టి వెంగళప్ప యని యితరులనిరి.

Monday, April 10, 2017

ఇది ఏ కాలం?


పేరుకి వసంతమైనా వేసవి గ్రీష్మాన్ని తలపిస్తోంది
చండ ప్రచండ తామసహరు ప్రతాప మనిపిస్తోంది
చెట్లు చేమలూ కన్నీరులా ఆకులు రాలుస్తన్నాయి
ఇంకా శిశిర ఋతువు వదల లేదని పిస్తున్నాయి
ఆరుబయట వాకిటిలో పిల్లగాలి తెమ్మెరలు
అపురూపంగా అప్పుడప్పుడూ పలకరింపులు
చైత్ర పూర్ణ చంద్ర కాంతిలో ఎంతో వెల్లదనం
రాకానిశాకరుని నామమాత్రపు చల్లదనం
ఇంకా వేసవి అంతా ముందేవుంది
రయజాతశ్రమ తోయ బిందువుల కేముంది
ఆవకాయలూ ఆమ్ర ఫలాలూ ఇంకా రాలా...
చలివేంద్రాలూ వేసవి విడిదులూచూడలా
ఇప్పడే ఇంత యిబ్బందిగా వుంటే
ఇంకో మూడు నెలలు ఎలా గంటా
అబ్బుర పడతావా నివ్వెర పోతావా

Sunday, April 9, 2017

LET ME DO SO

Though cautious  me at times
fall prey to spurious  smiles
share my melodious  thoughts
spare my laborious  earnings
for the glittering future of others.
Many a people mostly pupils
lure me to their emotional hearts
take me to their inner murmurings
here and there one or two use and throws
flares in their eyes n shivers on lips
push me again and again to their shore
like them at heart, make them smart
O God! let me do so let me do so
though at times left in lurches.

Saturday, April 8, 2017


ఆ రెంటి నడుమలోనే

ఆశ నిరాశల మధ్య నలిగి నలిగి
ఆశావహ దృక్పథంతో ముందుకు సాగి
ఆ రెంటి నడుమలోనే  నే  ఎదిగా
ఆకట్టు కోవాలని ఆందరిని, ఎలుగెత్తి రోదించి
ఎవరి కంటా పడకుండా మౌనంగా విలపించి
ఆ రెంటి నడుమలోనే  నే ఎదిగా
ఉద్ధరించాలని ఉబలాట పడుతూ
ఎద్దేవాలను ఎకశక్యాలను సహిస్తూ
ఆ రెంటి నడుమలోనే  నే ఎదిగా
మనసు మెచ్చినవారికి ఊడిగాలు చేసి
ఇచ్చకాలలో ఈసడింపులు మోసి
ఆ రెంటి నడుమలోనే  నే ఎదిగా
ఆకర్షణలకు లోనై ఆత్మీయులు కరవై
అయినవారిచే అయ్యవారిచే నిందల లోనై
ఆ రెంటి నడుమలోనే  నే ఎదిగా
అందివచ్చిన అవకాశాలు ఒడిసి పడుతూ
అపోహలతో ఆక్రోశంతో కొన్ని జారవిడుస్తూ
ఆరెంటి నడుమలోనే నే ఎదిగా
ప్రాయంకన్నా ముందే ప్రాకులాడుతూ
ప్రాయోపవేశమా సన్మార్గ గమనమా చింతిస్తూ
ఆ రెంటి నడుమలోనే  నే ఎదిగా
కాని వాటికని ఆరాట పడుతూ
మేటి పనులను వెనుక పెడుతూ
ఆ రెంటి నడుమలోనే  నే ఎదిగా
తత్కాల సుఖమే పరమావధిగా తలచి
తప్పన్న వారిదే తప్పని నమ్మబలుకుతూ
ఆరెంటి నడుమలోనే నే ఎదిగా.



విద్యుక్త ధర్మం

మరపురాని మధుర స్మృతి గా మిగిలేవా
మనోబంధమే అనుబంధమై దరి చేరేవా
మమతల కోవెలలో అపురూపంగా నిలచేవా
నిర్లక్ష్యపు వైఖరితో నిన్ను నీవే ఏమార్చేవా

గ్రీష్మతాపాలు కోపతాపాలుఒకలాంటివే
ఏ చలివేంద్రాలో అతి శీతల ప్రాంతాలో
సేద దీర్చి గుండెలు చల్ల బరచి ఆదుకోవాలి
ఆత్మీయ ఆదరణతో చిరునవ్వుల పలకరింపుతో
అక్కున చేర్చుకోవాలి మనసును హత్తుకోవాలి

తత్కాల ఆనందపు గోతిలో హేమాహేమీలైనా
ఊబిలో దున్నలే ,కుడితిలో పడ్డ ఎలుకలే
దూరపు లక్ష్యాలను ఆదమరిస్తే అష్టకష్టాలే
కన్నవారి కడుపుకోత అయ్యవారి ఈక్షణ వాత
అనుక్షణం వెంటాడి వేధించే ఱంపపు కోతలు
వివేకవంతులై మనగలగడమే విద్యుక్త ధర్మం
విచికిత్సాహేతు సాతోదరత్వమే శిరోధార్యం.

Friday, April 7, 2017

అదే పది వేలు

నీ చదువు ఖర్చులో సగం నే భరీస్తా
నీ చదువు ఆసాంతం చేయూతనిస్తా
పీజీ వరకూ నిన్ను చదివిస్తా
మంచి కాలేజీలో చదివిస్తా
శృతి లాగా నువ్వూ సాధించాలి
నీ విజయం వెనుక నేనుండాలి
నాకు నువ్వేం ఇవ్వాలంటే
మంచి నడవడికతో ఉండాలి
చదువే సమస్తం కావాలి
చాలా బాగా చదవాలి
పెద్దలు కుదిర్చిన పెళ్ళి చేసుకోవాలి
గురుతుంటే గురివుంటే
అప్పుడప్పుడూ నన్నూ పలుకరించాలి
నా అంత్యేష్టికి రావాలి.
అంతే అదేనాకు పదివేలు.

చీకటి-వెలుగులు

ఒకరోజు కారుమొయిళ్ళు కటిక చీకటీ
మరునాడే చిరునవ్వుల వెలుగుల దివటీ
ఒకరోజేమో నిరాశ నిస్పృహ అసహనం
మరునాడే గుండె నిబ్బరం ఆశా కిరణం
ఏమిటీ పరిస్థితుల వింత వైపరీత్యం
ఏమిటీ అర్థంకాని అయోమయ వాతావరణం నిన్నటికి నిన్న అనుబంధాలకు అమావాస్య
ఎన్నటికీ  తిరిగి రాని ఆశావహ పయనాడంబరం
అరుణారుణ ఉషోదయ తొలి తెలి కిరణాగమనం
మరుక్షణమే మాటా మంతీ లేని ధిక్కార స్వరం
కాలం కలసి రాదు ఆనందం మిగలనీదు
మౌనంగా సహించటమే నిర్లక్ష్యాన్ని భరించడమే
మిగిలిన ఏకైక మార్గం తెలిసిన సదుపాయం
ఆవేశాలూ ఆక్రోశాలూ పూర్తిగా చల్లారాక
మేలు కోరిన వాని మనసు మేటిమి తెలిసాక
ఇచ్చవచ్చిన క్రియా విశేషాల రచ్చ కనిపించాక
మనసులో ఆరాట పోరాటాల అలజడి తగ్గాక
భూమి గుండ్రంగా ఉందని నీ చెంతకు రారూ
ఏమీ ఎరుగని నంగనాచిలా ఊసులాడబోరూ.

Tuesday, April 4, 2017

మనసు జారాక

అభిమానపడ్డ చిరునవ్వుల తొలకరి చిరుజల్లు
అలిగి ఆమడ దూరంలో ఎదిరి పంచకు చేరింది
ఏదో ఎవరెస్టు శిఖరాల నెక్కినంత ఆనంద పడింది
ఎదలోపల కలుక్కుమంటూ జ్ఞాపకాల ముల్లొక్కటి
ఒంటరిగా నిదానంగా ఆలిచించేప్పుడు గుచ్చుకోదూ
పరిచయాన్ని ఆకర్షణ వఱకూ  తీసుకెళ్ళి
నంగనాచిలా అపనిందలని గగ్గోలు పెట్టి
ఎదుటి వారిపై అబద్ధాల బురద జల్లి
పారిపోయావా పైశాచిక ఆనందీ
నీ గుండె సవ్వడి కనలేవా
నీ మనసు రోదన వినలేవా
మరోసారి నీ మనసు జారాక
మరలా మదిలో ఘర్షణ మొదలయ్యాక
లోలోన కుమిలి పోవూ
లోలోనె నలిగిపోవూ
కాలం అన్నీ గుర్తు చేస్తుందిలే
జ్ఞాపకాల ప్రాపకాలు వేధించునులే.

Sunday, April 2, 2017

కిం కర్తవ్యం

చేత నున్న బ్రహ్మాస్త్రం సంధించింది
పోతా పాతచోటకే అని సెలవిచ్చింది
ఊహించినట్టే ఉరితాడు విసిరింది
వెళ్ళిపోయి సాధించేది శూన్యం
కానీ దెబ్బ కొట్టి పోతాననే పంతం
వంతపాడే పెద్దలు తన సొంతం
తప్పనడమే నేజేసిన తప్పా
తప్పుకో నివ్వడమే మాకు ఒప్పా
పెంచుకున్న అనుబంధం
మచ్చలేని మమకారం 
ఆత్మ రక్షణలో పడిన మాట వాస్తవం
ఆత్మ సాక్షిలేని కర్కశ హృదయం
ఎన్నెన్నో జేసి ఎత్తులో నిలపాలనుకున్నా
తన ఉన్నతికి నేనే పరిశ్రమించాలనుకున్నా 
తనచేతలు తప్పనకూడదు
తన నసలు నిర్దేశించ కూడదు
కంటికి ఱెప్పలా కాపాడటమే 
నే చేసిన నేరమా
వక్రగతుల పోకుండా చూడటమే
నే చేసిన పాపమా
నే చేయని తప్పుకు లెంపలేసుకోవడమా
పోయి కాళ్ళ మీద పడటమా
పోతే పోనిమ్మని మిన్న కుండటమా
కిం కర్తవ్యం ?????