ఉభయ పార్శ్వాలు
నిస్వార్థ సేవకు నిలువెత్తు నిదర్శనంగా నిలవాలని ఇచ్ఛాపూర్వకంగా ఇతోధికంగా అండగా నిలిచావనిలబ్దిపొందిన వారే యీసడిస్తే ముఖం చాటేస్తే
కృతఘ్నులై శతఘ్నులై కయ్యానికి కాలు దువ్వితే
కొందరే పుణ్యమో చేసికొనియె ననిరి
కొందరే పాపమో కట్టి కుడిపె ననరి
పరమ పురుషులు పావనులని కొందరనిరి
పిదప బుద్ధులు, పోగాలమని కొందరనిరి
తనకు తానుగా ఊడిగం చేస్తే
హితం కోరినవారు జన శృతం విన్న వారు
అపహాస్యం పాలైతే అవమానాలకు లోనైతే
యోగి, ఋషి తుల్యుడని కొందరనిరి
లోకమెరుగని వట్టి వెంగళప్ప యని యితరులనిరి.
0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home