మనసు జారాక
అభిమానపడ్డ చిరునవ్వుల తొలకరి చిరుజల్లుఅలిగి ఆమడ దూరంలో ఎదిరి పంచకు చేరింది
ఏదో ఎవరెస్టు శిఖరాల నెక్కినంత ఆనంద పడింది
ఎదలోపల కలుక్కుమంటూ జ్ఞాపకాల ముల్లొక్కటి
ఒంటరిగా నిదానంగా ఆలిచించేప్పుడు గుచ్చుకోదూ
పరిచయాన్ని ఆకర్షణ వఱకూ తీసుకెళ్ళి
నంగనాచిలా అపనిందలని గగ్గోలు పెట్టి
ఎదుటి వారిపై అబద్ధాల బురద జల్లి
పారిపోయావా పైశాచిక ఆనందీ
నీ గుండె సవ్వడి కనలేవా
నీ మనసు రోదన వినలేవా
మరోసారి నీ మనసు జారాక
మరలా మదిలో ఘర్షణ మొదలయ్యాక
లోలోన కుమిలి పోవూ
లోలోనె నలిగిపోవూ
కాలం అన్నీ గుర్తు చేస్తుందిలే
జ్ఞాపకాల ప్రాపకాలు వేధించునులే.
0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home