Sunday, April 2, 2017

కిం కర్తవ్యం

చేత నున్న బ్రహ్మాస్త్రం సంధించింది
పోతా పాతచోటకే అని సెలవిచ్చింది
ఊహించినట్టే ఉరితాడు విసిరింది
వెళ్ళిపోయి సాధించేది శూన్యం
కానీ దెబ్బ కొట్టి పోతాననే పంతం
వంతపాడే పెద్దలు తన సొంతం
తప్పనడమే నేజేసిన తప్పా
తప్పుకో నివ్వడమే మాకు ఒప్పా
పెంచుకున్న అనుబంధం
మచ్చలేని మమకారం 
ఆత్మ రక్షణలో పడిన మాట వాస్తవం
ఆత్మ సాక్షిలేని కర్కశ హృదయం
ఎన్నెన్నో జేసి ఎత్తులో నిలపాలనుకున్నా
తన ఉన్నతికి నేనే పరిశ్రమించాలనుకున్నా 
తనచేతలు తప్పనకూడదు
తన నసలు నిర్దేశించ కూడదు
కంటికి ఱెప్పలా కాపాడటమే 
నే చేసిన నేరమా
వక్రగతుల పోకుండా చూడటమే
నే చేసిన పాపమా
నే చేయని తప్పుకు లెంపలేసుకోవడమా
పోయి కాళ్ళ మీద పడటమా
పోతే పోనిమ్మని మిన్న కుండటమా
కిం కర్తవ్యం ?????

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home