సాగి పో వడమే నీ ధర్మం
చింత చచ్చినా పులుపు చావదన్నట్టువయసు హెచ్చినా పరుగు ఆగదన్నట్టు
ఏదో సాధించాలని
ఎంతైనా శ్రమించాలని
ఆరని తీరని ఆకాంక్ష
ఆశయాల సాధనలో
అవకాశాల పార్వేటలో
అద్భుత విన్యాసాలు
పద్మవ్యూహాలు
ఎత్తు పల్లాలు ఎద మూల్గులూ
పునరుత్తేజాలు పునస్సమీక్షలూ
విజయానికి చేరువలో అవనతవదనం
సమయానికి నీవెవరో అనవసర విషయం
పయనానికి తోడెవరో తెలిసిన మరునిమిషం
సాగి పోవడమే ధర్మం
సాగి సాధించడమే మర్మం
గత శ్రముడవై ఉత్తుంగ తరంగమై
ధృత కంకణుడవై ఉధృత జ్యోతివై
కృత నిశ్చయుడవై సమీకృత బల్మివై
సాగి పోవడమే కర్తవ్యం
సాగి సాధిస్తేనే భవితవ్యం.
0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home