సీ. అరచి గీ పెట్టినా అల్లాడినా కొంద
రధములు మూర్ఖులు మార లేరు
కొరివితో తలగోకు కొనువారి కేనీతి
జెప్పినా తప్పుగా జూడ గలరు
చినిచిన్ని సరదాలె ముదిరి ఊసర వెల్లు
లై పుట్టి ముంచు అనైతికముగ
ముందు చూపది లేనిచో మంది తో వేగ
గలమే ? పడరటేఏ గోతి లోనొ
తే.గీ. నిన్ను నాకూతు రనుటయే నీకు పడదు
నీకు నచ్చిన రీతిగా నుండనీను
చదువు బుద్ధిగా శ్రద్ధగా చదువ వలెను
నన్ను మన్నించి నామాట నాల కించు.
సీ . ఏ మాయ జేసావొ ఏ మంత్ర మేసావొ
ఏ క్రొత్త పన్నాగ మేసి నావొ
రోజంత పొద్దంత రేయంత నిదురంత
నీ పైన బెంగతో విసివి పోతి
ఎందుకో నాపైన నీకంత కోపమ్ము
తప్పేమిటో నాకు తెలియ రాదు
వాడు కొని విసిరి పారేసి పోయేటి
బుద్ది కాదే నీది గూసులాడి
తే. గీ . నిన్ను నా కూతురనుటయే నాదు తప్పు
కలడు పైవాడు నా బాధ కనెడి వాడు
మంచి మనసిఛ్చి తెలివిచ్చి మనల కలిపి
తండ్రి కూతుల మనుటయే దైవ ఘటన .
సీ. తారాడి పోరాడినా నువు మాటాడి
తూలాడి నావొ తుత్తునియ లగుదు
ఊరించి ఊరించి విసిగించి ఊసాడి
గూసాడి నావొ అట్టుడికి పోదు
లోలోన కుమిలితే నీలోన కనలితే
కాలుగాలిన పిల్లి నగుదు నేను
మనసులో అక్కసులు తలపులో చిక్క
సలు దాచినావొ నే సచ్చిపోదు
తే.గీ. అమ్మ నీ కంట కన్నీరు కార రాదు
అమ్మ నాన్నల పరువు కాపాడ వలెను
అన్న కన్నను మిన్నగా చదువ వలెను
మంచి దనుకున్న నా తోటి మాటలాడు.
0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home