Friday, May 17, 2013

ధనము

                         ధనము 

అర్ధము చాల సున్నితము అంతకు మించి అకార ణంబుగా
స్వార్ధము పెచ్చు మీరి మది సాంత్వన నించుక నుండ నీదు ని
స్వార్ధ మదేక్కడుండు మనసా వచసా పనిజేయుటెట్లు యీ
వ్యర్ధ మనర్ధ యర్దమదియె   వ్యష్టి వివేచన నేర్పు దుష్ట మై .

Monday, May 13, 2013


తల్లీ  నాదు మనోగతం బయిన దంతా   నీ కృపా భావమే
తల్లీ  నాకు వచో విధేయ మది యంతా  నీ దయా సారమే
తల్లీ  నాకు సదా స్మృతి ప్రచుర మంతా  నీదు ఔదార్యమే
తల్లీ  నాదు మహా ధృతి విభవ మంతా   నీదు ప్రాసాదమే.   

ఈ పద్యం శ్రీ సదా శివానంద నాధ  తుమ్మలాపల్లి రామలింగేశ్వర రావు
గారు సౌందర్య లహరికి వ్యాఖ్యానమ్ వ్రాసి జగదంబ పై ఇలా వ్రాసారు.
అయితే నాలుగవ పాదం పూర్తిగా నా చేత ప్రక్షిప్తం చేయ బడింది 

Saturday, May 11, 2013

     
శ్రీ  చక్రోపరి  వేష్టి తామ్  శుభకరీమ్ హ్రీంకార సంశోభితాం
చిఛ్చక్తీమ్ వరదా భయామ్ సునయనామ్ సమ్పత్కరీమ్ పాహిమామ్
కాంచీ నూపుర ధారిణీమ్ సతతమైమ్ క్లీం సౌ:యుతామమ్బికామ్
శ్రీ చండాసుర మర్ధినీమ్ శివ పరామ్  శ్రీ రాజరాజేశ్వరీమ్ . 
లోవల  లోపలన్ మనసులో ముఖ  పొత్తము జూడ నెంచి నే
నావల  పయ్యొడిన్ తెరచి  నాను సనాతన ధర్మమో తెనున్
గు న్ వివ రించు పద్యములొ గద్యము లో మహనీయు లెందరో
వావిరి గొల్పు నట్లు సవాళ్ళను వేయుట చూడ ముచ్చటై.



అమ్మకు వంట నేర్పుటకు అమ్మమ కెవ్వరు నేర్పినారు మా
యమ్మయె కాదు ముది యమ్మయు ప్రేమను రంగరించి గో
పెమ్మల గోరు ముద్ద మురిపెమ్ముగ పెట్టుచొ ఆరగించుచో
కమ్మని పాటలో   కథలొ   కావవి కమ్మని పోపు వాసనల్.