Saturday, November 5, 2016

స్వర్ణ కమలం 


నా యెద వాకిట వెలిసిన
ఓ మనో మానస సరసి
అట విరిసిన కమలం
నా ఊహల ఊర్వశి చిరు దరహాసం
నా ఆశల నవలామణి పరిహాసం
అప్పుడప్పుడూ పలుకరించిపోయే
బాలా నవనీతం ఆమె ఓ సునీతం
మేము ప్రేమికులం కాదు
షికార్లు కొట్టే జంట గువ్వల0 కాదు
మళ్ళీ ఒక చెల్లంటూ దొరికితే
అది ఆమే అది ఆమే అది ఆమే
ఎందుకంటే దాపరికం లేని మనస్సు
అంతకంటే  వ్యామోహం లేని వయస్సు
నేనంటే ఒక గౌరవం ఒక అనురాగం
ఒక స్వతంత్రం  ఒక  అనుబంధం
మా మనసుల్ని కట్టి పడేసే
ఎదో బలీయమైన శక్తి
ఈ స్నేహం ఈ పాశం ఈ భావం
కలకాలం ఇలానే మిగలాలని
దేవ దేవుని  పదే పదే కోరుకుంటా.