Wednesday, January 27, 2016


    నిప్పు కన్నా నిజం 

కణ కణ లాడే నిప్పును నేను  
కాలి పోతాను కాని ఎవరినీ కాల్చాలనుకోను
భగ భగ లాడే మంటను నేను
వేలుతురునిస్తా కాని  ఎవరిని మసి చేయాలను కోను
సృష్టి లో ప్రతి జీవికి ఓ గమ్యం మరో లక్ష్యం ఉంటాయి
తెలిసినా తెలియక పోయినా
సమాజానికి ఉపయోగ పడటం తప్పదు
కాదంటే తనకే  ముప్పు తప్పదు .
అందుకే రాద్ధాంతాల  సిద్ధాంతాల  మాట అటుంచి
వైరుధ్యాల జోలికి పోకుండా
నా వంతుగా మంచి చేయాలనుకుంటా
నన్ను వెఱ్ఱి వాడిగా అనుకుని
నాపైకి వస్తే నా రెండో పార్శ్వం  చూస్తారు.
మాడి మసై పోతారు
కాలి బూడిదై పోతారు
తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త.